Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Horoscope on Indian Elections : ఈ ఎన్నికల్లో ఎవరికి రాజయోగం.. ఎవరికి ఓటమి..?
మన జీవితంపై గ్రహాల ప్రభావం ఉంటుంది. దానిని బట్టే మన పనులు జరుగుతాయ్. ఏది మంచి రోజు, ఏది మంచి సమయం, ఏది మనకు అనుకూలిస్తుంది లాంటి విషయాలను మనం రాశిఫలాల ద్వారా తెలుసుకుంటాం. అయితే ఈ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రముఖ జ్యోతిష్యులు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో నేతల రాశిఫలాలను బట్టి ఎవరికి అధికారం దక్కవచ్చు, ఎవరు ఓడిపోవచ్చనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నరేంద్రమోడీ
నరేంద్రమోడీ మళ్లీ అధికారంలోకి వస్తారు. రాజకీయలో కుజ గ్రహం, శని గ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు మోఢీ రాశిని బట్టి బలంగా ఉన్నాయ్. కాబట్టి మళ్లీ దేశాన్ని ఆయనే పాలిస్తారు. వచ్చే ప్రభుత్వంలో ఈ సారి రక్షణ రంగం, హోం మంత్రిత్వ శాఖకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.
అమిత్ షా
అమిత్ షాలో శని గ్రహం బలంగా ఉంది. ప్రత్యర్థులను ఈజీగా దెబ్బకొట్టగలరు. మళ్లీ అధికారంలో ఆయనకు హోంమంత్రితో పాటు ఇతర మంత్రిత్వ శాఖ బాధ్యతలు కూడా దక్కే అవకాశముంది. వీదేశీ వ్యవహారాల్లో కూడా అమిత్‌షా ప్రముఖ పాత్రను పోషించనున్నారు.

సోనియా గాంధీ
సొంతపార్టీ నుంచి సోనియా గాంధీ అసంతృప్తులను ఎదుర్కొంటారు. ఆమె నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తారు. సోనియా గాంధీ అనుకున్నవేవీ ఈ ఎన్నికల్లో జరగవు, మరోసారి ఓడిపోయే అవకాశాలున్నాయ్.
రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీలో శని నాలుగవ స్థానంలో ఉంది. సొంత కుటుంబ సభ్యల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. శని ప్రభావం వల్ల పొలిటికల్ ర్యాలీలో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. పది సంవత్సరాల తరువాత కాంగ్రెస్ పార్టీని నడిపే సామర్ధ్యం కూడా ఉండకపోవచ్చు.
అరవింద్ కేజ్రీవాల్
ప్రస్తుతం కేజ్రీవాల్‌కు దురదృష్ట కాలం నడుస్తోంది. ఆయనకు బెయిల్ దొరుకుతుంది కానీ మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో సరిగ్గా గెలవలేక భవిష్యత్తులో సీఎం పదవి నుంచి కూడా దిగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది.
చంద్రబాబు
చంద్రబాబు గ్రహస్థితి బాగుంది. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందంటున్నారు. తండ్రీ కొడుకులు ఇద్దరికీ గ్రహస్థితి బాగుంది కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తారు. గతంలో బాబును శని ఇబ్బంది పెట్టాడు, ప్రస్తుతం ఆశీస్సులు ఉంటాయంటున్నారు. పొత్తు పెట్టుకొని గెలిచే అవకాశాలు ఉన్నాయ్.
పవన్ కళ్యాణ్
2024 జులై తరువాత పవన్ వ్యక్తిగతంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయ్. పవన్ కళ్యాన్ పిఠాపురం నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయ్. పవన్ విజయం సాధిస్తాడు కానీ చాలా తక్కువ మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. 2027 తరువాత పవన్‌ను తాత్కాలికంగా సీఎం అయ్యే యోగం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications