Latest Updates
-
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా? -
రెచ్చిపోయి తినేంత రుచి..అరిటాకులో పొట్లం చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఇంట్లో వాళ్లు ఫిదా! -
Viral Video: ఆ బుడ్డోడు మాములోడు కాదయ్యా..తానే చదివిస్తానంటూ ఆనంద్ మహీంద్రా బంపరాఫర్
House warming 2025: కొత్త ఇంట్లో చేరుతున్నారా? గృహ ప్రవేశ సమయంలో వీటిని అస్సలు మర్చిపోకూడదు
ప్రతి ఒక్క వ్యక్తికి సొంతింటి కల ఉంటుంది. సొంత ఇంటిని నిర్మించుకొని లేదా కొనుక్కొని తనకు నచ్చినట్లుగా అందులో నివసించాలని అందరూ కోరుకుంటారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇల్లు కట్టేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఇల్లు కట్టేటప్పుడు ఎలాగయితే నియమాలు పాటించాలో ఇల్లు కట్టిన తర్వాత అందులోకి ప్రవేశించేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాల ప్రకారం మనం గృహ ప్రవేశం చేస్తే జీవితంలో ఎటువంటి ప్రత్యేక సమస్య తలెత్తదు. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటో ఇక్కడ చూడండి.
గృహ ప్రవేశ సమయంలో పాటించాల్సిన నియమాలు ఇవే
-వైశాఖ, జైష్ఠ, మాఘ, ఫాల్గుణ మాసాలు గృహ ప్రవేశానికి చాలా అనుకూలమైన నెలలు.
-ఆది, శని, మంగళవారాల్లో ఎప్పుడూ కొత్త ఇంట్లోకి ప్రవేశించకండి.
-గృహ ప్రవేశం చేసేటప్పుడు పూజాపథం బాగా చేయాలి. ఆ పూజలో గృహ యజ్ఞం చేయాలి.
-చతుర్థి, నవమి, చతుర్దశి, అమావాస్య తిథి నాడు ఇంట్లోకి ప్రవేశించవద్దు.

-కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మగవాళ్ళు ముందుగా గదిలోకి ప్రవేశించకూడదు. స్త్రీలు ముందుగా కొత్త గృహ ప్రవేశం చేయడం శుభప్రదం. మీ కుటుంబానికి సంబంధించిన ఏ స్త్రీ అయినా కావచ్చు. తల్లి, సోదరి, భార్య ఎవరైనా ముందు కొత్త గృహ ప్రవేశం చేయడం మంచిది.
-గృహ ప్రవేశం రోజున గృహంలో అల్పాన్ని గీయడం చాలా మంచిది. ఈ రోజున ఇంట్లో పొగ పెట్టడం చాలా శ్రేయస్కరం.
-గృహ ప్రవేశ పూజ సమయంలో ఒక గదిలో మాత్రమే పూజ చేయరాదు, వంటగది, ఇంటిలోని ప్రతి గదిలోనూ పూజ చేయడం అవసరం.
-గృహ ప్రవేశం చేసే సమయంలో ముందుగా ఇంట్లోకి ప్రవేశించే వ్యక్తి కొబ్బరికాయ, పచ్చి పాలు, బెల్లం, బియ్యం, పసుపు తీసుకురావాలి.
-గృహ ప్రవేశం రోజున ఐదుగురు లేదా ఏడుగురు పూజారులకు భోజనం పెట్టండి. అంతే కాకుండా పేదలకు భోజనం పెట్టడం శుభపరిణామం.
ఈ ఏడాది గృహ ప్రవేశానికి అనుకూలమైన తేదీలు
-జనవరిలో గృహ ప్రవేశానికి శుభ సమయం లేదు.
-ఫిబ్రవరిలో 6, 7, 8, 14, 15, 17 తేదీలు గృహ ప్రవేశానికి మంచిది.
-మార్చి నెలలో 1, 5, 6, 14, 15 తేదీలు గృహ ప్రవేశానికి అనుకూలం.
-ఏప్రిల్ నెలలో 30వ తేదీ గృహ ప్రవేశానికి అనుకూలం.
-మే నెలలో 1, 7, 8, 9, 10, 14, 17, 22, 23, 28 తేదీలు గృహ ప్రవేశానికి అనుకూలం.
-జూన్ నెలలో 4, 6 తేదీల్లో గృహ ప్రవేశం చేస్తే మంచింది.
-జూలై నుండి సెప్టెంబరు వరకు గృహ ప్రవేశానికి ఎలాంటి శుభ సమయం లేదు.
-అక్టోబర్ లో 23, 24, 29 తేదీలు గృహ ప్రవేశానికి అనుకూలం.
-నవంబర్ లో 3, 6, 7, 8, 14, 15, 24, 29 తేదీలు గృహ ప్రవేశానికి అనుకూలం.
-డిసెంబర్ నెలలో 1, 5, 6 తేదీలు గృహ ప్రవేశానికి అనుకూలం
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications