Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
జ్యోతిష్యశాస్త్రం చెబుతున్న షాకింగ్ నిజాలు..ఈ వస్తువులు నేరుగా ఇస్తే ఇంట్లో పేదరికం,గొడవలు
ఈ భూమ్మీద పుట్టిన ఏ వ్యక్తి అయినా సరే హ్యాపీగా,ఎలాంటి కష్టాలు లేకుండా బతకాలని కోరుకుంటారు. ఇందులో తప్పేం లేదు. ఈ కలను సాకారం చేసుకోడానికి మనం చాలా కష్టపడతాం. అయితే మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మన అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయని జ్యోతిష్యశాస్త్రం తెలియజేస్తుంది. మన రోజువారీ జీవితంలో వస్తువులను ఇచ్చిపుచ్చుకునే విధానంలో కొన్ని నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వస్తువులను ఇతరులకు నేరుగా అరచేతిలో పెట్టడం వల్ల నెగిటివ్ శక్తులు ప్రవేశించి మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆనందం, శ్రేయస్సు మీ ఇంట్లో వెల్లివిరియాలంటే ఎవ్వరి చేతికి అందించకూడదని వస్తువులు ఏవో ఇక్కడ చూడండి.
నీరు
దాహం వేసినవాళ్లకు నీరు అందించడం మహాపుణ్యమే కానీ నీటిని అందించే పద్దతి కూడా అంతే ముఖ్యం. చేతులతో దోసిలి పట్టి లేదా పాత్ర లేకుండా నేరుగా నీరు ఇవ్వడం దరిద్రానికి ఆహానం పలకడమేనని శాస్త్రం చెబుతోంది. ఇది ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని హరించేసి పేదరికాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఎప్పుడైనా గ్లాసు, చెంబు లేదా సీసాతో మాత్రమే నీటిని అందించాలని గుర్తుంచుకోవాలి.

ఉప్పు
ఉప్పు అనేది చేతికి ఇవ్వకూడదని మన పెద్దలు తరచుగా చెబుతుంటారు. అయితే దీనికి బలమైన జ్యోతిష్య కారణం కూడా ఉంది. ఉప్పును నేరుగా చేతికి ఇవ్వడం వల్ల ఇచ్చిపుచ్చుకునే ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతింటాయని, పెద్ద గొడవలు జరుగుతాయని నమ్ముతారు. ఇది ఇంట్లో ఆర్థిక కష్టాలను కూడా తీసుకొస్తుంది. కాబట్టి మీరు ఎవరికైనా ఉప్పు ఇవ్వాల్సివస్తే ఒక పాత్రలో లేదా గిన్నెలో ఉంచి మాత్రమే అందించాలి.
మిరపకాయలు
మిరపకాయలను నిత్యం మనం వంట్లో కారం కోసం వాడుతుంటాం. మిరపకాయలను నేరుగా చేతికి ఇవ్వడమంటే మీ రిలేషన్ లోకి కారాన్ని,ఘాటును ఆహ్వానించినట్లే. ఇలా చేయడం వల్ల ఆ ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతింటాయని,తరచూ గొడవలు,మనస్పర్థలు వస్తాయని,ఇంట్లో అశాంతి నెలకొంటుందని నమ్ముతారు కాబట్టి మిరపకాయలను ఎలప్పుడూ ఒక గిన్నెలో లేదా పల్లెంలో పెట్టి ఇవ్వాలి.
రొట్టె
ఆకలేసినోళ్లకి ఆహారం పెట్టడం అనేది చాలా గొప్ప పుణ్య కార్యం. అయితే రొట్టె లేదా చపాతీని నేరుగా చేతికి ఇవ్వడం మహా దోషంగా పరిగణించబడుతుంది. ఇలా చేయడం వల్ల అన్నపూర్ణాదేవికి ఆగ్రహం వస్తుందట..దీంతో ఇంట్లో సంపద నశించడానికి, శ్రేయస్సు కోల్పోడానికి కారణమవుతుంది. అన్నదానం చేసిన పుణ్యం కూడా లభించదు. కాబట్టి రొట్టెనె ఎప్పుడూ ఒక పల్లెంలో ఉంచి గౌరవంగా అందించాలి.
చేతి రుమాలు
ఒకరి నుంచి చేతిరుమాలను మరొకరు నేరుగా తీసుకోవడం అశుభప్రదం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రుమాలు దు:ఖానికి,కన్నీళ్లకు ప్రతీకగా భావిస్తారు. దీనిని నేరుగా చేతికి ఇవ్వడం వల్ల వారి మధ్య ప్రేమ,నమ్మకం తగ్గిపోయి సంబంధాలు బలహీనపడతాయి. ఇది తీవ్రమైన ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ఎవరైనా రుమాలు అడిగితే దాన్ని ఎక్కడైనా పెట్టి తీసుకోమని చెప్పడం ఉత్తమమైన మార్గం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications