Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
2025లో ఈ రాశుల వారికే అష్టైశ్వర్యాలు..బాబా వంగా జోస్యం
బల్గేరియా దేశంలో 1911లో జన్మించిన బాబా వంగా 12 ఏళ్ల వయస్సులో ఓ ప్రమాదంలో చూపు కోల్పోయింది. ఆ తర్వాత ఆమె తన జ్ఞానదృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలను చూసే అద్భుతమైన శక్తిని పొందినట్లు నమ్ముతారు. బాబా వంగా తన జీవితంలో చాలా గొప్ప అంచనాలు వేశారు. ఆమె అంచనాలు చాలా నిజం అయ్యాయి. నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్' అని పిలువబడే బాబా వంగా కొన్ని ముఖ్యమైన అంచనాల్లో..సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్ ట్విన్ టవర్స్‌పై దాడి,రష్యా-ఉక్రెయిన్ వివాదం, ప్రిన్సెస్ డయానా మరణం వంటివి ఉన్నాయి.
బాబా వంగా 2025 సంవత్సరానికి సంబంధించి కూడా చాలా షాకింగ్ అంచనాలు వేశారు. 2025 సంవత్సరానికి సంబంధించి బాబా వంగా అంచనాల ప్రకారం కొన్ని రాశుల వ్యక్తులు వారి జీవితంలో భారీ మార్పులను అనుభవించబోతున్నారు. ఈ రాశుల వ్యక్తలు 2025లో ఆర్థిక, ఉద్యోగ సంబంధిత రంగాలలో పెద్ద మార్పులను అనుభవించబోతున్నారు. బాబా వెంగా అంచనాలు చెప్పిన మూడు రాశులు మేషం,వృషభం, మిథునం. ఈ మూడు రాశుల వారికి బాబా వెంగా ఏం చెప్పారో ఇక్కడ చూడండి.

మేష రాశి
మేషరాశి వ్యక్తులు 2025లో వారి జీవితాల్లో మార్పులు, గణనీయమైన విజయాలు సాధిస్తారని బాబా వంగా చెప్పారు. ఈ సంవత్సరం ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. ఈ సంవత్సరం వీరి చిరకాల కోరికలు, కలలు నెరవేరే అవకాశం ఉంది. మేష రాశి వారు తమ లక్ష్యాల పట్ల శ్రద్ధగా పని చేస్తారు, ఆశించిన ఫలితాలను సాధించడానికి ఓపికగా వేచి ఉంటారు. 2025 మేషరాశి వారికి రిస్క్‌లు తీసుకోవడానికి, వారి ఆశయాలను తీవ్రంగా కొనసాగించడానికి గొప్ప సమయం అని బాబా వంగా అంచనా వేశారు.
వృషభం
వృషభ రాశి వారికి 2025 సంతోషకరమైన, అత్యంత సంపన్నమైన సంవత్సరాలలో ఒకటిగా అంచనా వేయబడింది. బాబా వంగా అంచనా ప్రకారం.. చాలా కాలం పాటు కష్టపడి, ఈ సంవత్సరం వారు తమ శ్రమకు తగిన ఫలాలను పొందుతారు. రెండేళ్లుగా ఏదో ఒక లక్ష్యం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నవారు కొందరు ఉండొచ్చు. వారు కూడా ఈ సంవత్సరం పూర్తి ఫలితాలు పొందవచ్చు. వృషభ రాశి వారు ఈ సంవత్సరం దీర్ఘకాల ఆర్థిక భద్రతను సాధించడానికి, తెలివైన పెట్టుబడులు పెట్టడానికి ముఖ్యమైన అవకాశాలను ఎదుర్కొంటారు.
మిథున రాశి
మిథున రాశి వ్యక్తులు 2025లో గొప్ప మార్పులు, అవకాశాలను పొందుతారని బాబా వంగా అంచనా వేశారు. అనేక అడ్డంకులను అధిగమించడం ద్వారా తమ లక్ష్యాన్ని సాధించడంలో కూడా విజయం సాధిస్తారు. అడ్డంకులను అధిగమించి, స్థిరమైన భవిష్యత్తు కోసం తమ క్రియేటివిటీ, సమస్య పరిష్కార నైపుణ్యాలను ఉపయోగించుకుంటారు. ఆర్థిక పురోగతికి మంచి అవకాశాలు ఉన్నాయి. రిస్క్ తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం అని బాబా వంగా అంచనా వేశారు. ఈ సంవత్సరం అవకాశాలను పెంచుకోవడానికి బలమైన నెట్ వర్క్ ని ఏర్పాటుచేసుకోవాలని బాబా వంగా తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications