Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
బాబా వంగా భవిష్యవాణి: 2026లో ఈ రాశుల వారికి సిరిసంపదలు తథ్యం! కోటీశ్వరులయ్యే యోగం మీదేనా?
బాగా వంగా అంచనాలు మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. ఆమె చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయి. న్యూయార్క్ లో ట్విన్ టవర్స్ పై దాడి, ప్రిన్సెస్ డయానా మరణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, బ్రెగ్జిట్ వంటి అనేక ఆమె అంచనాలు నిజమయ్యాయి. బాగా వంగా అనేక విషయాలపై అంచనాలు వేశారు. బల్గేరియాకు చెందిన బాబా వంగా చిన్న వయస్సులో కళ్లు కోల్పోయి తన దివ్య దృష్టితో భవిషత్తులో జరగబోయే సంఘటనలు చూసినట్లు నమ్ముతారు. ఆమె తన మరణానికి ముందే 5079వ సంవత్సరం వరకు జరగబోయే సంఘటనల గురించి జోస్యం చెప్పారు. 2026 ఐదు రాశుల వారికి ఒక స్వర్ణయుగం కానుందని బాబా వంగా చెప్పారు. ఆ అదృష్ట రాశులు ఏవో, వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగనున్నాయో ఇక్కడ చూడండి.
మేష రాశి
బాబా వంగా అంచనా ప్రకారం 2026లో మేషరాశి వ్యక్తులు నూతనోత్సాహం, సాహసోపేతమైన స్ఫూర్తితో ఉంటారు. తలపెట్టే ప్రతి కొత్త పని విజయవంతమవుతుంది. కెరీర్ లో ప్రమోషన్లు, కొత్త వ్యాపార ప్రారంభానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ముఖ్యంగా పాత పెట్టుబడులు, స్టాక్ మార్కెట్ లేదా ఆస్తి అమ్మకాల ద్వారా అకస్మాత్తుగా భారీ ధనలాభం పొంది లక్షాధికారులు అయ్యే బలమైన యోగం ఉంది. ప్రేమ జీవితం మరింత మధురంగా మారుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.

వృషభ రాశి
గత కొన్నేళ్లుగా మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం 2026లో వృషభరాశి వ్యక్తులకు సంపూర్ణంగా అందబోతోందని బాబా వంగా అంచనా వేశారు . ఉద్యోగస్తులకు జీతంలో భారీ పెరుగుదల ఉంటుంది. ముఖ్యంగా సంవత్సరం మధ్య భాగంలో రియల్ ఎస్టేట్ లేదా దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు గడిస్తారని చెప్పారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, కోటీశ్వరులయ్యే మార్గం సుగమం అవుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. జీర్ణ సంబంధిత ఆరోగ్య సమస్యల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించాలి.
మిథున రాశి
2026లో మిథున రాశి వారి సృజనాత్మకతకు, కమ్యూనికేషన్ నైపుణ్యాలకు రెక్కలు వస్తాయి. కళాత్మక ప్రాజెక్టులు, భాగస్వామ్య వ్యాపారాలు, ముఖ్యంగా డిజిటల్ లేదా ఆన్ లైన్ రంగాలలో ఉన్నవారికి ఇది ఒక సువర్ణావకాశం. మీ వ్యాపారంలో పెద్ద పురోగతి సాధించి, అపారమైన సంపదను ఆర్జిస్తారు. ప్రయాణాల వల్ల గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. ఈ కాలంలో మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ప్రతి బుధవారం వినాయకుడిని భక్తితో పూజించడం వల్ల అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి.

సింహ రాశి
సింహరాశి వారికి 2026 సంవత్సరం అధికారం, ఆత్మవిశ్వాసం, ఐశ్వర్యాన్ని ప్రసాదించనుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు, జీతంలో గణనీయమైన పెరుగుదల ఖాయం. వ్యాపార రంగంలో ఉన్నవారు తమ సామ్రాజ్యాన్ని విస్తరించి, లక్షాధికారులు లేదా కోటీశ్వరులుగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడంతో, సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. ప్రతి ఆదివారం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది.
కుంభ రాశి
నూతన ఆవిష్కరణలకు, సాంకేతికతకు ప్రసిద్ధి చెందిన కుంభ రాశి వారికి 2026 ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా ఇతర ఆధునిక రంగాలలో పనిచేస్తున్న వారు అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు. మీ వినూత్న ఆలోచనలు మిమ్మల్ని సంపదకు యజమానులను చేస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. స్నేహితులతో సంబంధాలు బలపడతాయి. శనివారం రోజు నువ్వులను దానం చేయడం వల్ల శని దేవుని అనుగ్రహం లభించి, అదృష్టం రెట్టింపవుతుంది. మీ అదృష్ట రంగు నీలం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications