Latest Updates
-
ఒకే స్థానంలో గురు, రాహు గ్రహాలు.. గురు చండాల యోగంతో జీవితంలో ఈ కష్టాలు తప్పవు.! -
బెండకాయ ఎప్పుడు వండినా జిగురుగా ఉంటుందా.?..ఈ పద్ధతిలో ట్రై చేస్తే అస్సలు వదిలిపెట్టరు.! -
ఆకలినే ఆయుధంగా మార్చి 20 రోజులుగా నిరాహార దీక్ష.. ఎందుకీ ఉద్యమం, ఎవరీ సోనం వాంగ్ చుక్.! -
గ్రహాల శక్తితో పాటు దైవానుగ్రహం.. పూజలో ఈ రంగు వస్త్రాన్నే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా.? -
రాత్రి పూట స్వీట్ తినాలనిపిస్తుందా? ఓవెన్ అక్కర్లేకుండానే ఇంట్లోనే బేకరీ స్టైల్ బనానా బ్రెడ్ చేసుకోండిలా.. -
పిల్లలు, వృద్ధుల ఎముకల బలానికి రాగి, మునగాకు రోటి.. రోజూ ఒక్కటి తింటే చాలు.! -
మగవారిలో వీర్య కణాల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ఈ పది ఆహార పదార్థాలే కారణం.! -
పప్పుచారులోకి బెస్ట్ సైడ్ డిష్.. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ వడ.. 10 నిమిషాల్లో చేసేయండిలా -
ఈ మూడు రాశుల వారికి ఊహించని ఆర్థిక అవకాశాలు.. ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచిది.! -
వారం రోజులు నిల్వ ఉండే సొరకాయ హల్వా..రసాలూరుతూ భలే రుచిగా..
ఈ నక్షత్రంలో పుట్టిన వారు కుబేరులయ్యే అవకాశం..! మీది ఈ నక్షత్రమేనా..?
జ్యోతిష్యానికి చాలా శక్తి వుంటుంది. కొన్ని నక్షత్రాల్లో పుడితే ధనవంతులవుతారు. వారికి పుట్టుకతోనే ఎలాంటి ఆర్థిక సమస్యలు వుండవు. ఆ నక్షత్రాలు ఏవో తెలుసుకుందాం. జ్యోతిష్యంలో మొత్తం 27 నక్షత్రాలు వుంటాయ్. ఒక్కొక్క రాశిలో రెండున్నర నక్షత్రాలు వుంటాయ్. ఈ నక్షత్రాలు ఆ వ్యక్తి యోక్క స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని తెలుపుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వారు పుట్టిన నక్షత్రాన్ని బట్టి వారితో మాట్లాడకముందే వారి స్వభావాన్ని అంచనా వేయగలుగుతారు. హిందూ పురాణంలో దక్ష అనే రాజు వున్నాడు. అతనికి 27 మంది కుమార్తెలు వుంటారు. ఆ 27 మందిని పెళ్లి చేసుకోమని చంద్రుణ్ణి కోరుతాడు. ఆ 27 మందిని పెళ్లి చేసుకోవడానికి చంద్రుడు అంగీకరిస్తాడు. ఆ 27 మందే ఈ 27 నక్షత్రాలను మనం అర్థం చేసుకోవాలి.
చంద్రుడు రోహిణీ నక్షత్రాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. మిగిలిన 26 మంది చంద్రునిపై దక్షునికి ఫిర్యాదు చేస్తారు. భార్యలందరినీ సమానంగా ప్రేమించమని దక్షుడు చంద్రుణ్ణి విన్నవించుకుంటాడు. అయినా కూడా చంద్రుడు తన ప్రవర్తనని మార్చుకోకుండా అలాగే వుంటాడు. అప్పుడు చంద్రుణ్ణి చిన్నగా మారిపోవాలని దక్షుడు శపిస్తాడు.

చంద్రుడు చిన్నగా అయిపోతుంటే దేవతలందరూ వచ్చి శాపాన్ని వెనక్కి తీసుకోవాలని దక్షుడిని కోరుతారు. అందరి భార్యలను చంద్రుడు సమానంగానే చూస్తాడని దక్షుడికి చెబుతారు. చంద్రుడు ఒక నెలలో 27 నక్షత్రాల గుండా వెళ్లడానికి ఇదే కారణమని శాస్త్రం చెబుతోంది. పౌర్ణమి, అమావాస్య కూడా వీటి వల్లే ఏర్పడుతుందని అంటున్నారు.
ముందుగా అశ్వినీ నక్షత్రానికి చెందిన వారు స్వభావం సంచాలకులుగా వుంటారు. మనసు మారుతూ వుంటుంది. భరనీ నక్షత్రంలో పుట్టిన వారికి స్వార్ధం ఎక్కువగా వుంటుంది. క్రిత్తికా నక్షత్రంలో పుట్టిన వారు సాహసాలను ప్రదర్శిస్తూ వుంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు అహంకారులుగా వుంటారు. రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారు ప్రశాంతంగా వుంటారు. మృగశిర నక్షత్రంలో పుట్టిన వారు భోగలాలసులు అయి వుంటారు. ఆద్ర నక్షత్రంలో పుట్టిన వారికి కోపం ఎక్కువగా వుంటుంది. పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారు ఆదర్శవాదులుగా వుంటారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వారు మొండిఘటులై వుంటారు. వీరికి ఆత్మ నూన్యత ఎక్కువగా వుంటుంది. కష్టాలను కొని తెచ్చుకుంటూ వుంటారు. మఘ నక్షత్రంలో పుట్టిన వారు స్వాభిమానాన్ని కలిగి వుంటారు. పుర్వ ఫాల్గుని నక్షత్రంలో పుట్టిన వారికి కళల పట్ల మక్కువ వుంటుంది.
ఉత్తర ఫాల్గునీ నక్షత్రంలో పుట్టిన వారు ఆచితూచి వ్యవహరిస్తూ వుంటారు. వీరిది కష్టపడే స్వభావం. హస్త నక్షత్రంలో పుట్టిన వారు ఎప్పుడూ కలల్లో విహరిస్తూ వుంటారు. చిత్రా నక్షత్రంలో పుట్టిన వారికి చదువుపట్ల ఎక్కువ శ్రద్ధ వుంటుంది. స్వాతీ నక్షత్రంలో పుట్టిన వారు అందరినీ సమానంగా చూస్తారు. విశాఖ నక్షత్రం వారు తాము అనుకున్నది చేయాలని అనుకుంటారు. ఏదో ఒక విధంగా తమదే పైచేయి కావాలని కోరుకుంటారు.
అనురాధా నక్షత్రంలో పుట్టిన వారు తమ కుటుంబమంటే అమితమైన ప్రేమను కలిగి వుంటారు. వీరు అలాంకార ప్రియులు. జ్యోష్టా నక్షత్రంలో పుట్టిన వారు స్వచ్ఛమైన స్వభావాన్ని కలిగి వుంటారు. మూలా నక్షత్రంలో పుట్టిన వారు జీవితం మొదట్లో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. పూర్వా ఆశాఢ నక్షత్రంలో పుట్టిన వారు శాంత స్వభావులు, ఉత్తర ఆశాధ నక్షత్రంలో పుట్టిన వారు వినయం కలిగి వుంటారు, ఆధ్మాత్మిక చింతన ఎక్కువగా వుంటుంది.
శ్రవణా నక్షత్రంలో పుట్టిన వారు సన్మార్గంలో పయణిస్తారు. ధనిష్టా నక్షత్రంలో పుట్టిన వారు కఠువుగా వ్వవహరిస్తారు. శత్‌భిషా నక్షత్రంలో పుట్టిన వారు రసికప్రియులై వుంటారు. పుష్యమీ నక్షత్రంలో పుట్టిన వారు సన్మార్గులై వుంటారు. పూర్వ భాద్రపద నక్షత్రంలో పుట్టిన వారు బుద్ధిమంతులై వుంటారు.ఉత్తర భాద్రపదా నక్షత్రంలో పుట్టిన వారు ఇతరులను ఆకర్షించే స్వభావాన్ని కలిగి వుంటారు. రేవతి నక్షత్రంలో పుట్టిన వారు సత్యవాదులై వుంటారు.
ఈ మొత్తం 27 నక్షత్రాల్లో ఎక్కువ ధనవంతులయ్యే అవకాశం వున్న నక్షత్రం ధనిష్ట నక్షత్రం. ఈ నక్షత్రం అధిపతి అంగారకుడు, శని, ఇందులో పుట్టిన వారు ధనవంతులయ్యే అవకాశం ఎక్కువగా వుంటుంది. వీరు చాలా శక్తివంతులు, అందరిలో కలిసిపోయే తత్వం కలిగి వుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications