Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారా?..ఏ రాశి వారు ఏ రంగు దుస్తులు ధరిస్తే విజయం లభిస్తుందో చూడండి
ఈ రోజుల్లో ఉద్యోగం పొందడం చాలా కష్టంగా మారిపోయింది. పరీక్షల్లో రాణిస్తున్నప్పటికీ చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. అన్నీ అవరోధాలను అధిగమించి జాబ్ సాధించినా అది ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. మనదేశంలోనే కాదు చాలా దేశాల్లో ప్రజెంట్ జాబ్ మార్కెట్ అంత బాగా లేదు. అయితే కొంతమంది అయితే ప్రతి రోజూ జాబ్ కోసం ఏదో ఒక ఇంటర్వ్యూకి హాజరవుతూనే ఉంటారు.
ఆశక్తికరంగా ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లినా కొందరికి ఉద్యోగం రాదు. పదే పదే ఇంటర్వ్యూకి వెళ్లడం..జాబ్ రాక నిరాశకు గురవడం చాలామందికి జరుగుతుంటది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మీరు మీ రాశి ప్రకారం నిర్దిష్ట రంగు దుస్తులను ధరించి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే సులభంగా విజయం సాధిస్తారు.

ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఏ రాశి వాళ్లు ఏ రంగు దుస్తులు ధరించాలి
మేష రాశి
మేష రాశి వారికి లేత నీలం లేదా లేత నీలం రంగు దుస్తులు అనుకూలం.
వృషభ రాశి
వృషభ రాశి వాళ్లు ముదురు నీలం రంగు దుస్తులను ఇంటర్వ్యూలకు ధరించవచ్చు. దీంతో విజయం లభిస్తుంది.
మిథున రాశి
మిథున రాశి వారు మెరూన్ లేదా పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు ముదురు ఎరుపు లేదా మెరూన్ రంగు దుస్తులు ధరించి ఉద్యోగ ఇంటర్వ్యూ వెళ్తే మంచి ఫలితాలు పొందుతారు.
సింహ రాశి
విజయం సాధించడానికి సింహ రాశి వారు బూడిద రంగు దుస్తులు ధరించి ఇంటర్వ్యూకి వెళ్లవచ్చు.
కన్య రాశి
కన్యా రాశి వారు ఆకుపచ్చ లేదా తెలుపు రంగు దుస్తులు ధరించి ఉద్యోగాల ఇంటర్వ్యూస్ కి వెళ్లడం మంచిది.
తుల రాశి
తుల రాశి వారికి తెల్లటి రంగు దుస్తులు మంచిది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు ఉద్యోగ ఇంటర్వ్యూల కోసం ఎరుపు లేదా పింక్ కలర్ దుస్తులను ఎంచుకోవడం ఉత్తమం.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు వెండి లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి ఇంటర్వ్యూకి వెళ్లడం ఉత్తమం.
మకర రాశి
మకర రాశి వారు ఉద్యోగ ఇంటర్వ్యూలలో విజయం సాధించేందుకు తెలుపు లేదా వెండి రంగు దుస్తులను ఎంచుకోవచ్చు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి మెరూన్ లేదా పసుపు రంగు మంచిది.
మీన రాశి
మీన రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించి ఇంటర్వ్యూకి వెళ్తే విజయం మీకు అనుకూలంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications