Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
Bathroom Vastu: ప్రముఖ జ్యోతిష్కుడు చెప్పిన బాత్రూమ్ వాస్తు నిజాలు..వెంటనే సరిచూసుకోండి!
స్వర్గం అంటే క్లబ్బులు,పబ్బులు,జల్సాల ప్రదేశాలు కాదండోయ్..మన ఇల్లే మనకు అసలైన స్వర్గం. ఉండే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిండి ఉంటేనే మన జీవితం సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో నిండి ఉంటుంది.
అయితే మనం పెద్దగా పట్టించుకోని ఒక చిన్న గది అంటే బాత్రూమ్ టాయిలెట్ మన ఇంటి శక్తి ప్రవాహాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందని మీకు తెలుసా? ప్రముఖ జ్యోతిష్కుడు అరుణ్ పండిట్ తన యూట్యూబ్ పాడ్ కాస్ట్ లో వాస్తు శాస్త్రం ప్రకారం టాయిలెట్ దిశ ప్రాముఖ్యతను స్పష్టంగా వివరించారు.

టాయిలెట్లు.. శక్తిని హరించే ప్రదేశాలు
వాస్తు శాస్త్రంలో ఇంటిలోని ప్రతి భాగం ఒక నిర్దిష్ట శక్తిని కలిగి ఉంటుంది. పూజ గది, కిచెన్ రూమ్,బెడ్ రూమ్ వంటివి సానుకూల శక్తిని నింపితే.. టాయిలెట్ ను మాత్రం శక్తిని హరించే లేదా క్షీణింపజేసే ప్రదేశంగా పరిగణిస్తారు. ఇంట్లో పేరుకుపోయే ప్రతికూల శక్తికి ఇది కేంద్రంగా ఉంటుంది. అందువల్ల దాని స్థానం తప్పుగా ఉంటే అది ఇంటి మొత్తం సానుకూల వాతావరణాన్ని దెబ్బతీసి ఇంట్లో ఉండేవాళ్లపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపుతుంది.
ఈ దిశలలో టాయిలెట్ అస్సలు ఉండకూడదు
మన ఇంటికి కొన్ని దిశలు అత్యంత పవిత్రమైనవి, శుభప్రదమైనవి. ఆ దిశలలో టాయిలెట్ ను నిర్మించడం అంటే మన అదృష్టాన్ని మనమే చేతులారా నాశనం చేసుకోవడమే.
ఈశాన్యం (Northeast): ఇది దేవమూల. అంటే దైవశక్తి ప్రవేశించే పవిత్ర స్థానం. ఈ దిశలో టాయిలెట్ నిర్మించడం వల్ల ఇంట్లోకి వచ్చే దైవానుగ్రహాన్ని అడ్డుకున్నట్లే. ఇది తీవ్రమైన ఆరోగ్య, ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది.
తూర్పు (East): సూర్య భగవానుడు ఉదయించే ఈ దిశ ఆరోగ్యం, కీర్తి ప్రతిష్టలకు చిహ్నం. ఇక్కడ టాయిలెట్ ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినడమే కాక, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
ఉత్తరం (North): ఇది సంపదకు అధిపతి అయిన కుబేరుడి స్థానం. ఈ దిశలో టాయిలెట్ నిర్మిస్తే, అది ధన నష్టానికి, ఆర్థిక అస్థిరతకు కారణమవుతుంది. సంపాదన నిలవదు.
టాయిలెట్ కు అత్యంత అనువైన, సరైన దిశ ఏది?
వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తులను నియంత్రించే దిశలలో టాయిలెట్ ను ఏర్పాటు చేయడం ఉత్తమం. దీనివల్ల దాని దుష్ప్రభావం ఇంటిలోని ఇతర భాగాలపై పడకుండా ఉంటుంది.
దక్షిణం (South),నైరుతి (Southwest): టాయిలెట్ నిర్మాణానికి ఈ రెండు దిశలు అత్యంత అనువైనవిగా వాస్తు నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ దిశలు విసర్జనకు, బరువైన శక్తులకు కేటాయించబడ్డాయి. ఇక్కడ టాయిలెట్ ను ఉంచడం వల్ల దానిలోని ప్రతికూల శక్తి ఇంటిలోని సానుకూల శక్తితో కలవకుండా నిరోధించబడుతుంది. ఇది ఇంటి దిశాత్మక సమతుల్యతను కాపాడి శాంతి, సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications