Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
కేవలం ఈ మూడు రాశుల వారు 2025లో 45 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.. ఎప్పటి నుంచి అంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక గ్రహాన్ని అన్ని గ్రహాల కమాండర్‌గా పిలుస్తుంటారు. అంగారకుడు ధైర్యం, శక్తిని ప్రసాదిస్తుంటారు. అలాగే జోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి 45 రోజులకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు. ఈ ఏడాది జనవరి 21వ తేదీన అంగారకుడు అదే కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. అది కూడా తిరోగమనంలో ఆ రాశిలో ప్రవేశించనున్నాడు. ఈ ప్రవేశం రాశి చక్రమంలోని మిగిలిన 11 రాశుల వారిని ప్రభావితం చేయనుంది.
ఈ సమయంలో కొన్ని రాశుల వారికి మంచి జరిగే అవకాశం ఉంటే, మరికొన్ని రాశుల వారికి కొన్ని సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కుజుడు తన రాశిని మార్చుకోవడం వల్ల ఎవరికి నష్టమో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మిథున రాశి
కుజుడు మిథున రాశి వారిలోని 6, 11వ స్థానాలకు అధిపతిగా పరిగణించబడతారు. మిథున రాశివారి లగ్న స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆందోళనకరమైన జీవితాన్ని గడుపుతారు. మీరు చేపట్టిన ప్రతిపనిలోనూ ప్రతికూల ఫలితాలను పొందడంతో పాటు ఏ పని కూడా కలిసిరాదు. ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో కూడా చాలా సమస్యలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి.
వృశ్చిక రాశి
కుజుడు వృశ్చిక రాశిలోకి లగ్న స్థానం, ఆరో స్థానానికి అధిపతిగా ఉన్నారు. అయితే ఈ రాశిలో ఎనిమిదో స్థానంలో తిరోగమనంలో కుజుడు సంచరిస్తున్నారు. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారు తీవ్రమైన ప్రతికూల ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఏ పని చేపట్టినా అడ్డంకులు ఎదురవుతాయి. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పర్యటనలు చేయాల్సి వస్తుంది. అవి ప్రతికూల ఫలితాలను కలిగిస్తాయి. ఉద్యోగ జీవితంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అది కొంత ఆందోళన గురి చేస్తుంది. కుటుంబ జీవితం కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశిలోని 5, 12వ స్థానాలకు కుజుడు అధిపతిగా పరిగణించబడుతున్నాడు. అయితే వీరి ఏడవ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల వీరికి అనేక ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ తమ స్నేహితులతో ఉద్రిక్తత పరిస్థితులను సృష్టించుకుంటారు. అలాగే పిల్లల భవిష్యత్తు గురించి కూడా తీవ్రంగా మనోవేదన చెందుతారు. అనేక సమస్యలు ఏకకాలంలో చుట్టుముట్టి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా చాలా అసంతృప్తిగా ఉంటుంది. అందుకే ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. అదే ఈ రాశి వారిని సమస్యల నుంచి బయటపడేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications