Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Shani transit: 2025లో ఈ రాశుల వారికి అన్నీ ఆర్ధిక కష్టాలే!
జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం అత్యంత ముఖ్యమైనది. శని గ్రహాన్ని అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. ఏదైనా ఒక రాశిలో శనీశ్వరుడు ప్రవేశిస్తే ఆయన రెండున్నర సంవత్సరాల పాటు అదే రాశిలో ఉంటారని చెప్పుకుంటూ ఉంటారు. ఏ రాశిలో అయితే శని సంచరిస్తారో ఆ రాశిలో వారు చేసే పనుల ఆధారంగా ఫలితాలను పొందుతారు. అయితే 2025లో శని ప్రస్తుతం ఉన్న కుంభ రాశిని వదిలేసి మీన రాశిలోకి వెళ్తాడు. దీని కారణంగా మూడు రాశుల వారికి ఆర్ధిక కస్టాలు ఎదురవనున్నాయి. ఆ రాశులు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
2025లో మీనరాశికి శని సంక్రమించడం వల్ల మేష రాశికి కష్టమైన రోజులు వస్తాయి. మేష రాశి వారికి 12వ స్థానంలో శని ఉండటం వల్ల వచ్చే రెండున్నరేళ్లలో దోషాలు తొలగిపోయే అవకాశం తగ్గుతుంది. ఇది ఈ రాశికి చెందిన వారి జీవన పురోగతిని అడ్డుకుంటుంది. మీ శ్రేయస్సుల్లో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. కష్టాలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇలా అనేక రకాల ఆరోగ్య ప్రమాదాలను ఈ రాశి వారు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న పనులు కూడా కష్టపడి పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ధన నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నందున డబ్బు విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి
ఇది శని సంచారము వలన సింహరాశిలో అనేక మార్పులను వస్తుంది. శని 8వ స్థానంలో ఈ రాశిలో సంచరిస్తాడు. కాబట్టి ఈ రాశి వారు 2025లో మార్చి తర్వాత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి, వాటి నుంచి ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా మీరు ఒత్తిడికి గురవుతారు. అలాగే ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి ఉంటుంది. వైద్య ఖర్చుల కోసం మీరు రుణం తీసుకోవలసి రావచ్చు. మీరు మీ పనిలో సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి ఉద్యోగులు ఆఫీసులో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి
2025లో శని సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి కూడా ఇబ్బందులు తప్పవు. ఈ రాశిలో 4వ స్థానంలో శని సంచరిస్తాడు. దీని వల్ల ధనుస్సు రాశి వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి. మీరు ఊహించిన పనికి మీకు ఎక్కువ మద్దతు లభించకపోవచ్చు. కాబట్టి ఆర్థిక సహాయం, నిధుల సేకరణ కష్టంగా ఉంటుంది. మీ పని ప్రదేశంలో ఒత్తిడి పెరుగుతుంది. కొత్త బాధ్యత, నాయకత్వంతో ఒత్తిడి ఎక్కువై మానసికంగా ఇబ్బందులకు గురవుతారు. వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉండదు. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications