గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది!

జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని గ్రహాల యువరాజుగా పిలుస్తారు. మనిషి తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్, పెట్టుబడులకు బుధుడే కారకుడు. బుధుడు 2026 సెప్టెంబర్ 7న తన సొంత రాశి అయిన కన్యా రాశి లోకి ప్రవేశించబోతున్నాడు. సెప్టెంబర్ 26 వరకు కన్యారాశిలో కొలువై ఉండే బుధుడు.. ఆ తర్వాత తులా రాశిలోకి వెళ్తాడు.

సెప్టెంబర్ 7, 2026 మధ్యాహ్నం 1:35 గంటలకు బుధుడు కన్యారాశిలో అడుగుపెట్టడం వల్ల జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదంగా భావించే మహా భద్ర రాజయోగం ఏర్పడుతుంది. భద్ర రాజయోగం ప్రభావంతో ప్రధానంగా 5 రాశుల వారి జీవితాల్లో ఊహించని అదృష్టం వరించనుంది.

Bhadra Rajayoga 2026 Mercury Enters Virgo These 5 Zodiac Signs Will Hit the Jackpot

మేష రాశి

మేష రాశి వారికి ఈ బుధ సంచారం కెరీర్ పరంగా సరికొత్త బంగారు బాటలు వేస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి లేదా ప్రస్తుత ఆఫీసులో కీలక బాధ్యతలు దక్కుతాయి. మీ మాటతీరుతో అందరినీ సులభంగా ఆకట్టుకుంటారు. మీ నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. వ్యాపారస్తులకు పెద్ద ఆర్డర్లు, లాభదాయకమైన కాంట్రాక్టులు కుదిరి ఆదాయం అమాంతం పెరుగుతుంది.

వృషభ రాశి

భద్ర రాజయోగం వృషభ రాశి వారి పాలిట కల్పవృక్షంగా మారనుంది. ఇన్నాళ్లూ మీరు పడిన కష్టానికి తగిన, మధురమైన ప్రతిఫలం ఇప్పుడు దక్కుతుంది. ఆఫీసులో మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, రివార్డులు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి డబ్బు సంపాదించడానికి సరికొత్త మార్గాలు గోచరిస్తాయి. ఆర్థిక స్థిరత్వం సిద్ధిస్తుంది.

సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలుసెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు

కన్యా రాశి

బుధుడు స్వయంగా మీ రాశిలోనే ప్రవేశిస్తుండటంతో, జాక్‌పాట్ కొట్టేది మీరే. ఈ సమయంలో మీ దశ పూర్తిగా మారుతుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులకు ఇది సువర్ణావకాశాల సమయం. ముఖ్యంగా విద్యార్థులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో అద్భుతమైన విజయాలు సాధించి సెటిల్ అవుతారు.

తులా రాశి
భద్ర రాజయోగం తులా రాశి వారి జీవితాన్ని సకల భోగభాగ్యాలతో, విలాసాలతో నింపేస్తుంది. ఆర్థికంగా గొప్ప పురోగతి సాధిస్తారు. ఎప్పటినుంచో ఆగిపోయిన, పెండింగ్‌లో ఉన్న మీ ముఖ్యమైన పనులన్నీ ఇప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కెరీర్, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. అయితే, పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదివి, అవగాహన చేసుకున్నాకే అడుగు ముందుకు వేయడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి బుధ గ్రహ సంచారం శుభ సంకేతాలను ఇస్తోంది. అదృష్ట దేవత మీ వెంటే ఉండి నడిపిస్తుంది. భవిష్యత్తులో మీకు స్థిరమైన, భారీ ఆదాయాన్ని అందించే ఒక పెద్ద ప్రాజెక్ట్ లేదా డీల్‌పై మీరు సంతకం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పెట్టుబడుల ద్వారా ఆకస్మిక ధనలాభం పొందే అదృష్టం ఈ రాశి వారికి రాసిపెట్టి ఉంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Monday, September 7, 2026, 12:45 [IST]
Desktop Bottom Promotion