Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
Buddha Purnima 2023: ఒకేరోజు బుద్ధ పూర్ణిమ, చంద్రగ్రహణం.. ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు
వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అంటారు. ఈ ఏడాది మే నెలలో బుద్ధ పూర్ణిమ వస్తోంది. మే 5 వ తేదీ శుక్రవారం రోజు రాబోతుంది. అలాగే ఈ రోజు 2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణ కూడా సంభవించనుంది. గ్రహణం సమయంలో మతపరమైన కార్యక్రమాలు, శుభకార్యాలు జరగవు. ఈ కాలాన్ని అశుభంగా భావిస్తారు.

ఈ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారికి ఈ కాలం కలిసి వస్తే, కొన్ని రాశుల వారికి ఈ సమయం కష్టాలు తప్పవు. ఈ ఏడాదిలో వచ్చే మొదటి చంద్రగ్రహణం వల్ల ఏయే రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషం:
మే 5వ తేదీ శుక్రవారం రోజు సంభవించబోయే చంద్రగ్రహణం వల్ల మేషరాశి వారికి కాలం కలిసి రాదు. ఇది ఏమాత్రం శుభప్రదం కాదు. ఈ సమయంలో మేష రాశి వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఈ సమయంలో మేష రాశి వారి ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఏ నిర్ణయమైన చాలా ఆలోచించి జీవిత భాగస్వామితో, కుటుంబసభ్యులతో, మిత్రులతో చర్చించిన తర్వాతే తీసుకోవాలి. ఈ సమయంలో మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి.
వృషభం:
వృషభ రాశి వారికి ఈ ఏడాదిలో వచ్చే తొలి చంద్రగ్రహణం ఏమాత్రం శుభప్రదం కాదు. ఈ కాలంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఎలాంటి నిర్ణయమైనా మీదే తుది తీర్పు కావాలి. ఇతరులపై ఆధారపడవద్దు. ఈ సమయంలో ఇంట్లో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల ప్రశాంతత ఉండదు. ఇతర వ్యక్తులతోనూ వివాదం తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండటం మంచిది. గొడవలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఇది శారీరకంగా, మానసికంగా బాధిస్తుంది.
కర్కాటకం:
ఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం అలాగే బుద్ధ పూర్ణి కర్కాటక రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ గ్రహణం వల్ల సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో ఆరోగ్యం పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం చూపొద్దు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. అలాగే ఉద్యోగాల్లో ఉన్న వారు పైస్థాయి అధికారులతో జాగ్రత్తగా సంభాషించాలి. సహోద్యోగులతో ఇతరుల గురించి గాసిప్స్ కు దూరంగా ఉండాలి. వాటి వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications