Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
Budh Vakri: బుధుడి తిరోగమనం..20 రోజుల పాటు ఈ 3 రాశుల వాళ్లని ఎవ్వరూ ఆపలేరు
జ్యోతిష శాస్త్రంలో బుధుడి సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాల రాకుమారుడిగా పరిగణించే బుధుడు త్వరలో తిరోగమనంలోకి వెళ్లబోతున్నాడు. ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న బుధుడు నవంబర్ 26 నుంచి తిరోగమనంలో సంచరించనున్నాడు. డిసెంబర్ 16 వరకు అంటే 20 రోజుల పాటు ఈ తిరోగమన సంచారం ఉంటుంది. వృశ్చిక రాశిలో బుధ గ్రహం తిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో కదులుతుంది.
బుధుడు నవంబర్ 26 ఉదయం 7.39 గంటలకు వృశ్చికరాశిలో తిరోగమనంలో కదులడం మొదలవుతుంది. దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. సాధారణంగా ఏదైనా గ్రహం వక్రించడం వల్ల దాని బలం పెరుగుతుంది. దాని వేగం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బుధుడి తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి లాభం చేకూరుతుంది. బుధుడి తిరోగమనంతో అదృష్టం పొందే రాశులు ఏవో ఇఫ్పుడు చూద్దాం.

వృషభం
వృశ్చికరాశిలో బుధుడు తిరోగమనం కారణంగా వృషభ రాశికి చెందిన ఉపాధ్యాయులు, కోచ్ లు, కన్సల్టెంట్స్, థెరపిస్టులు, సలహాదారులు, లాయర్లు, నటులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా బ్లాగర్స్ తమ వృత్తిలో విజయం పొందుతారు. బుధుడి తిరోగమన కాలంలో చాలా డబ్బు సంపాదిస్తారు. వ్యాపారం చేస్తే మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. డబ్బు సంపాదించడానికి ఇది గొప్ప సమయం.
సింహం
సింహరాశి వారికి ఈ సమయం శుభప్రదం. కుటుంబం కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. ఇంట్లో కొన్ని రకాల మరమ్మతులు చేయవచ్చు. ఈ కాలంలో మీరు మీ డబ్బును లగ్జరీ కోసం ఖర్చు చేయవచ్చు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టవచ్చు. తల్లిదండ్రులను గౌరవించండి,వారి మద్దతు మీకు ముఖ్యం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గౌరవం పెరుగుతుంది. స్నేహితుల సహాయం వల్ల ప్రయోజనం పొందుతారు. విద్యారంగంతో అనుబంధం కలిగి ఉంటే ప్రయోజనం పొందవచ్చు. ఈ సమయం మీ ఆరోగ్యానికి అనుకూలమైనది. మీ పాత వ్యాధి ముగుస్తుంది. మీరు మంచి అనుభూతి చెందుతారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.
Note: మత విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని నమ్మడం లేదా పాటించడం వ్యక్తుల సొంత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications