Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
పక్కపక్కనే రెండు అద్భుతమైన రాజయోగాలు.. ఈ మూడు రాశుల వారికి ఐశ్వర్యం, అందులో మీ రాశి ఉందా?
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశిని ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. గ్రహాల గమనం శుభ, అశుభ యోగాలను కూడా ఏర్పరుస్తాయి. అయితే ఇప్పుడు రెండు అద్భుతమైన రాజయోగాలు పక్కపక్కనే ఏర్పడుతున్నాయి. రెండు రోజుల పాటు రెండు ముఖ్యమైన రాజయోగాలు జరుగుతున్నాయి. బుధాదిత్య రాజయోగం జూన్ 24వ తేదీ మిథునరాశిలో బుధుడు మరియు సూర్యుని కలయికతో ఏర్పడింది. మరుసటి రోజు హంస రాజయోగం ఏర్పడుతుంది.
బృహస్పతి విద్యకు, జ్ఞానానికి అధిపతిగా పరిగణిస్తాం. గురుగ్రహాన్ని చాలా పవిత్రమైన గ్రహంగా పరిగణిస్తారు. అలాంటి గురు గ్రహం నుంచి ఉద్భవించే హంసరాజ యోగం కూడా చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడే ఈ రెండు యోగాల వల్ల మూడు రాశుల వారికి అదృష్టం వరించనుంది. వారికి జీవితంలో చాలా ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశుల్లో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథునరాశి:
మిథునరాశి వారికి బుధాదిత్య రాజ యోగం, హంస రాజయోగం చాలా కలిసి రానున్నాయి. ఈ సమయంలో మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెళ్లి కాని వారికి శుభవార్త అందుతుంది. జీవిత భాగస్వామి కోసం అన్వేషణ పూర్తయి పెళ్లి ఘడియలు దగ్గరపడతాయి. మంచి వ్యక్తులతో అనుబంధం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారం నుంచి లాభాలు, గౌరవాలు పొందుతారు.
వృషభ రాశి:
బుధాదిత్య రాజయోగం, హంస రాజయోగం వేళ వృషభ రాశి వారికి కాలం కలిసి వస్తుంది. ఆర్థికంగా చాలా మంచి సమయం. శీఘ్ర ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీడియాలో, కళారంగంలో పని చేసే వారికి తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. చాలా రోజుల నుంచి తిరిగి రాని అప్పు కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మేధో జ్ఞానం, ఆధ్యాత్మికత పట్ల ఇష్టం పెరిగి, దైవారాధన ప్రారంభిస్తారు.
తులారాశి:
తులా రాశి వారు బుధాదిత్య రాజయోగం నుంచి చాలా అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. ఈ రాజయోగం వల్ల చేపట్టిన పనుల్లో సత్ఫలితాలు వస్తాయి. అదృష్టం కలిసి వచ్చి తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విద్యార్థుల కోరికలు నెరవేరతాయి. విదేశాల్లో చదవాలనుకునే వారికి ఇది మంచి సమయం. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. సంపద, హోదా, కీర్తి పెరుగుతుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోయి స్థిరత్వం లభిస్తుంది.
హంస రాజయోగం:
జ్యోతిషశాస్త్రంలో బుధుడు, కుజుడు, గురు, శుక్ర, శని గ్రహాలను ప్రభావవంతమైనవిగా పరిగణిస్తారు. ఈ గ్రహాల కేంద్రం ఇంట్లో వారి సొంత రాశిలో బలమైన స్థితిలో ఉంటే, అవి పంచ మహాపురుష రాజయోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ పంచమహాపురుష రాజయోగాల్లో హంస రాజయోగం అనే ప్రత్యేక యోగం ఉంది. బృహస్పతి విద్యా, జ్ఞానానికి సూచికగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలు, సంస్కృతి వ్యాపార వృద్ధిలో బృహస్పతిది కీలక పాత్ర. గురుగ్రహం ఒ శుభగ్రహంగా పరిగణించబడుతుంది. దాని ద్వారా ఏర్పడే యోగాలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
కర్కాటక, ధనుస్సు, మీన రాశుల్లో బృహస్పతి మొదటి ఇంటి, నాల్గవ ఇంట, ఏడవ ఇంట, పదవ ఇంట ఉన్నప్పుడు హంస రాజయోగం ఏర్పడుతుంది. హంస రాజయోగం మనిషికి ఆనందం, శ్రేయస్సు, సంపద, ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. కీర్తి, సంపద, ఉద్యోగ అవకాశాల పరంగా ప్రయోజనం పొందుతారు. భౌతిక జ్ఞానం, సంపద పెరుగుతుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications