Latest Updates
-
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే! -
చుక్క పాలు లేకుండానే గడ్డ పెరుగు.. ఇలా సులభంగా తయారు చేయండి! -
కర్ణాటక స్టైల్ గ్రీన్ చికెన్ బిర్యానీ.. ఇలా చేస్తే ఫిదా అవ్వాల్సిందే! -
దరిద్రం పోయి అదృష్టం..జూలై 20 నుంచి ఈ 3 రాశులకు తిరుగుండదు! -
పల్లెటూరి స్టైల్ లో మట్టికుండలో చేపల కుర్మా..అన్నం, ఇడ్లీ, దోసె దేనిలోకైనా అదుర్స్! -
కళ్లు ఎర్రబడి, నీరు కారుతోందా? కండ్లకలక లక్షణాలు, నివారణ మార్గాలివే! -
వైజాగ్ లో కథ మాములుగా లేదుగా..దానికోసం ఏఐ తెగ వాడేస్తున్నారంట! -
నానబెట్టే పనిలేదు,పిండి రుబ్బే పనిలేదు.15 నిమిషాల్లో అటుకుల ఇడ్లీ..డయాబెటిస్ ఉన్నవారికీ బెస్ట్
బుధాదిత్య యోగం.. డిసెంబర్ 16వ తేదీ లోపు ఈ రాశుల వారి సమస్యలు తొలగిపోతాయి
ఈనెల 16వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు వృశ్చిక రాశిలో రవి, బుధులు కలుసుకోనున్నారు. ఇలా రవి బుధులు కలుసుకోవడం వల్ల ఎదో ఒక యోగం ఏర్పడనుంది. ఈసారి బుధాధిత్య అనే యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా పలు రాశుల వారికి కష్టాల నుంచి విముక్తి లభించనుంది. అలాగే వారి కొద్దిపాటి ప్రయత్నంలో విజయాన్ని సాధించేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఏ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగం వల్ల ప్రయోజనం కలుగుతుంది? ఆ రాశులు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వృషభ రాశి:
ఈ రాశికి బుధ, రవి గ్రహాలు నాలుగు, అయిదవ స్థానంలో సంచరిస్తున్నారు. ఇవి రెండు శుభ స్థానాలు కావడం పైగా సప్తమ స్థానంలో వీరి కలయిక జరగడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడతుంది. దీని కారణంగా ఈ రాశి వారు ఏ పని చేపట్టినా అది విజయవంతమై తీరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అనూహ్యంగా లాభాలను గడిస్తారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. రాజకీయ ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు లాభాల బాట పట్టిస్తాయి. ఇంటా బయట రాజసం కొనసాగుతుంది. మీ సలహాలు, సూచనల వల్ల మీ స్నేహితులు, బంధువులు లాభపడతారు.

సింహ రాశి
ఈ రాశి వారికి నాలుగో స్థానంలో ఆ రాశికి అధిపతి అయిన రవి, ధనాధిపతి అయిన బుధుడు కలుస్తున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి కూడా బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఈ యోగం కారణంగా సింహ రాశికి చెందిన వ్యక్తులు గృహ, వాహన ప్రయత్నాల్లో విజయవంతమవుతారు. ఆస్తిపాస్తులు సమకూరే అవకాశం ఉంటుంది. సమాజంలో హోదా, గౌరవం పెరుగుతుంది. కొద్దీ ప్రయత్నంలోనే వివాదాలు పరిష్కారమై ఆస్తులు సమకూరే అవకాశం ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు లాభదాయకంగా మారనుంది.
తులా రాశి:
ఈ రాశి వారికి ధన స్థానంలో రవి, బుధ గ్రహాల యుతి కారణంగా తులా రాశి వారికి కూడా ఈ బుధాదిత్య యోగ ఫలాలు పొందనున్నాయి. దీని కారణంగా ఆదాయపరంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతమవుతుంది. సమాజంలో మీ ఈ రాశి వారి మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో ఏర్పడిన పరిచయాలు లాభదాయకంగా మారనుంది. ఉద్యోగంలో మీ పని తీరుకు బాగా గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు దేశ విదేశాల్లో ఉద్యోగాలు లభించనుంది. వృత్తి, వ్యాపారాల్లో గణనీయమైన లాభాలను గడిస్తారు.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి కూడా ఈ బుధాదిత్య యోగం ఏర్పడనున్న కారణంగా.. ఈ రాశి వారి వ్యక్తుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అనేక రకాల కొత్త అవకాశాలు దొరుకుతాయి. లాభాలను గణనీయంగా ఆర్జిస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి.
మకర రాశి:
ఈ రాశి వారికి లాభ స్థానంలో బుధుడు, రవి గ్రహాలు కలుస్తున్నాయి. దీని కారణంగా ఈ రాశి వారికి కూడా ఈ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మకర రాశి వారికి సమాజంలో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఇప్పటి వరకు మకర రాశి వ్యక్తులపై ఉన్న దోషాలు, వారికున్న సమస్యలు, కస్టాలు తొలిగిపోతాయి. ఉద్యోగంలో మంచి హోదా లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల బారిన పడతారు. ఆరోగ్యం బాగా మెరుగవుతుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యక్తిగత సమస్యలు తొలిగిపోతాయి. మొత్తానికి చెప్పాలంటే ఈ రాశి వారికి ఈ బుధాదిత్య యోగం వల్ల అంతా మంచే జరగనుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications