Latest Updates
-
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.!
Capricorn Horoscope: 2025 సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంటుందంటే?
2025 సంవత్సరం ప్రారంభమయ్యే రోజులు దగ్గరికి వచ్చేశాయి. ఇప్పటికే చాలా మంది తమ 2025 ప్రణాళికలను వేసుకున్నారు. అలాగే తమ జాతకం ఎలా ఉంటుంది అని చూసుకుంటున్నారు. అయితే 2025లో మకర రాశి వారి జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కెరీర్ జీవితం
2025లో ఈ రాశి వారి కెరీర్ జీవితం కొంత అయోమయంలో ఉండే అవకాశం ఉంది. వీరి జీవితంలో మార్పు మార్చి నెల తరువాత వస్తుంది. మే నెలలో బృహస్పతి సంచారం జరుగుతుంది. ఆ తరువాత వీరి జీవితంలో సంచలనమైన మార్పులు వస్తాయి. ఉద్యోగార్థులకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు లభిస్తాయి. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకుంటారు.

వ్యాపారస్తులకు కూడా 2025వ సంవత్సరంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే పోలిస్తే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే మార్చి తర్వాత పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. బృహస్పతి ఈ రాశిలో సంచరించిన తరువాత వీరికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. 2025లో ద్వితీయార్థం తరువాత డబ్బులు సంపాదించడానికి మరింత శ్రమించాల్సి వస్తుంది.
ఆర్ధిక పరిస్థితి
మకర రాశి వారికి 2025 సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మే వరకు ఎక్కువ లాభాలను పొందగలుగుతారు. గురుగ్రహ స్థానం బలహీనంగా ఉన్నప్పటికీ, డబ్బు సంపాదించడంలో గురువు మీకు కావాల్సిన సహకారాన్ని అందిస్తారు. 2025లో ఈ రాశి వారికి డబ్బు ఆదా చేయడం కష్టం, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పొదుపు మంత్రాన్ని కచ్చితంగా పాటించాలి. పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కుటుంబ జీవితం
2025 సంవత్సరం ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. 2025లో మొదటి అర్థ భాగంలో వివాహ నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవిత పరంగా కూడా 2025 అనుకూలంగా ఉంటుంది. దంపతుల మధ్య అనుబంధం బాగుంటుంది. అయితే కుటుంబ సభ్యులతో సంబంధం బలోపేతం చేసుకోవడానికి, కుటుంబ సభ్యుల ప్రేమ పొందడానికి మరింతగా కష్టపడాల్సి వస్తుంది.
ఆరోగ్య జీవితం
2025లో మకర రాశి వారికి ఆరోగ్యం పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం వీరికి అన్ని విధాలుగా సహకరిస్తుంటుంది. జీవన శైలీ, ఆహరంపై ఎక్కువుగా ద్రుష్టి సారించాలి. ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానిపై కొంత ద్రుష్టి సారించాలి.
భూమి, వాహనం కొనే అదృష్టం ఉందా?
మకర రాశి వారికి 2025 నూతన ఆస్తి కొనుగోలు, గృహ కొనుగోలు విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తే దీనికి సంబంధించిన కోరికలు నెరవేరుతాయి. వాహన కొనుగోలుకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. కొత్త సంవత్సరంలో కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications