Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Capricorn May 2024 Horoscope : మేనెలలో మకర రాశి వ్యాపారులకు మంచి లాభాలు..!
2024వ సంవత్సరం మే నెలలో మకర రాశి వారు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. గ్రహాలన్నీ వారికి అనుకూలంటా ఉన్నాయ్. వారికి ఇక మేలో అంతా మంచే జరుగుతుంది. అంతకు ముందుకన్నా వారిలో ధైర్యం పట్టుదల పెరుగుతుంది కానీ వాటి వెల్ల గొడవలు రాకుండా వారే జాగ్రత్తపడాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంట్లో ఏవైనా వస్తువులు లేక భూమి లాంటివి కొనడానికి ఇదే వారికి మంచి సమయం.
కెరీర్ అద్భుతం
మకరరాశి వారి కెరీర్ మే నెలలో చాలా బాగుంటుంది. ఉద్యోగం లేాదా చదువుకు సంబంధించిన ఏ పనులైనా సవ్యంగా సాగిపోతాయ్. ఈ విషయంలో వారు చింతించాల్సిన అవసరం ఉండదు.. సూర్య భగవానుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయ్. చదువుకుంటున్న వారికి మంచి మార్కులు రావడం, ర్యాంకులు రావడం జరుగుతాయ్. ఏదైనా పరీక్షకు హాజరైనా మీకు అనుకూలంగా ఉంటుంది.

విద్యార్ధులు
మే నెల మకర రాశి వారిలో ఎక్కువగా లాభపడేది విద్యార్ధులేనని చెప్పుకోవచ్చు. వీరు ఇతరుల కెరీర్, చదువుపైన కూడా శ్రద్ధ వహించి వారిని కూడా ప్రోత్సహిస్తే మంచి పేరును సంపాదించుకుంటారు.
కుటుంబం
మకర రాశి అధిపతి శని రెండవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబానికి, ఇంటికి సంబంధించిన అన్ని విషయాల్లో శుభమే జరుగుతుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. వీరికి ఇంట్లో కుటుంబ సభ్యుల నుంచి కూడా సహకారం మెండుగా ఉంటుంది.
ఈ నెలలో కుటుంబంలో ఎలాంటి ఆర్థిక సమస్యలు రావు. బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయ్. లాభాల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేసినా తప్పకుండా విజయం సాధించి లాభాలను సంపాదించుకుంటారు.
ఆరోగ్యం
ఆరోగ్య పరంగా కూడా మకరరాశి వారికి మంచి జరుగుతుంది. రాహువు, కుజుడు, బుధిని స్థానంలో ఉండడం వల్ల పెద్దగా ఎటువంటి అనారోగ్య సమస్యలను గురి కారు. కానీ గొంతు, వెన్నెముకకు సంబంధించి కొన్న జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి భయం అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
దోషం తొలగాలంటే
మకర రాశి వారికి మే నెలలో అసలు దోషాలు లేవు, ఒక వేల దోషాలు కలగవద్దనుకుంటే ప్రతీ రోజు ఉదయం లేవగానే హనుమంతుడికి పూజచేసి వారానికి ఓసారి హనుమంతుడి గుడికి వెళ్తే చింతించాల్సిన అవసరం ఉండదు. ప్రతీ రోజూ ఉదయం లేవగానే లేదా పడుకునే ముందు హనుమాన్ చాలీసా చదివితే ఆ ఆంజనేయ స్వామే దోషాలు రాకుండా చేస్తాడు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications