Latest Updates
-
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.! -
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.! -
రెస్టారెంట్ స్టైల్ టేస్టీ స్టార్టర్.. ఇంట్లోనే ఈజీగా స్పైసీ చిల్లీ ఎగ్.. ఎలా చేయాలంటే.! -
కిచెన్‌లో ఉండే ఈ చిన్న ఐటం.. అజీర్తి సమస్యే కాదు బరువును సైతం తగ్గిస్తుందని తెలుసా.? -
రక్తం పెరగాలన్నా, చర్మం మెరవాలన్నా.. బ్రేక్ ఫాస్ట్ లో ఈ పింక్ పూరీ ఉండాల్సిందే! -
స్పెషల్ అంటే ఇలా ఉండాలి.. వీకెండ్లో మజా ఇచ్చే కొబ్బరి పాల చికెన్ పులావ్.. ఇంటిల్లిపాదికీ పండగే.! -
మీరు సెప్టెంబర్‌లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా..
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.!
రానున్న వారం రోజులు కొన్ని రాశుల వారికి సవాలుగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గ్రహాల కదలికల్లో మార్పులు కారణంగా మూడు రాశుల వారి జీవితంలో ఊహించని సంఘటనలు చోటుచేసుకుంటాయి. బుధ గ్రహ సంచారం సరిగా ఉన్నా.. శని వక్ర గతిలో ఉండటం కారణంగా కొన్ని రాశుల వారిలో గందరగోళం తలెత్తుతుందని శాస్త్రం చెబుతోంది.

జులై 28 వరకు కర్కాటక, కన్య, కుంభ రాశి వారి జాతకాల్లో ప్రతికూల సంకేతాలు ఉన్నాయని జ్యోతిష్యం చెబుతోంది. ఆ రాశుల వారు సవాళ్లు ఎదుర్కోవచ్చని.. పనుల్లో జాప్యం, కుటుంబంలో మనస్పర్థలు, ఆర్థికంగా పలు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. రాహువు, కేతువు, శని, బుధ గ్రహాల ప్రభావంతో వృత్తి, వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు, ప్రేమ జీవితాల్లో వివిధ రకాల మార్పులు చోటుచేసుకుంటాయి. దీంతో వారు అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది.
కర్కాటక రాశి
ఈ వారం రోజులు కర్కాటక రాశి వారి జీవితం కొంచెం గందరగోళంగా ఉండవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఉద్యోగ జీవితంలో బాధ్యతలు పెరుగుతాయి. దీంతో మానసిక ఒత్తిడికి గురవుతారు. మీరు చేపట్టిన ముఖ్యమైన పనుల్లో పదేపదే అంతరాయాలు ఏర్పడతాయి. ఫలితంగా నిరాశ చెందుతారు. పని ఒత్తిడితో వ్యక్తిగతంగా చిరాకు ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలోనూ చిన్న చిన్న విషయాలపైన అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్న కారణంగా కీలక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.
ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకంటూ ఇష్ట దైవాన్ని పూజించడం ద్వారా మానసికంగా ప్రశాంతతను పొందవచ్చు. వృత్తిపరంగా, ఆర్థిక విషయాల్లో మానసికి ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి.

కన్యారాశి
కన్యా రాశి వారికి ఈ వారం రోజులు సవాలుగా ఉంటుంది. విజయం సాధించడం కోసం మునుపటి కంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. వృత్తిపరంగా ఉద్యోగ బాధ్యతలో మీ శక్తి, సామర్థ్యాలను నిరూపించుకునేందుకు అదనంగా కృషి చేయాల్సి ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు వ్యాపార విస్తరణ కోసం, కొత్త అవకాశాల కోసం ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార నిర్వహణలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. లేదంటే నష్టాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాట తీరులో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వివాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకోవడం మేలు చేస్తుంది.
మీన రాశి
మీన రాశి వారు ఈ ఏడు రోజుల పాటు కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు. వృత్తిపరంగా ఉద్యోగ బాధ్యతల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. లేదంటే కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. దీంతో మానసికంగా ఒత్తిడిని ఎదుర్కొంటారు. అయితే మీరు మీ ఉద్యోగంలో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. షాపింగ్ చేసేటప్పుడు బడ్జెట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఖర్చులు పెరిగి, మీ బడ్జెట్‌కి అంతరాయం కలిగే అవకాశం ఉంది. మీ ఫ్రెండ్స్‌తో మనస్పర్థలు వచ్చే సూచనలు ఉన్నాయి. కెరీర్‌కి సంబంధించి తరచుగా ప్రణాళికలు వేసుకుంటారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆచితూచీ వ్యవహరించాలని పండితులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications