Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్..కన్నయ్యకు అత్యంత ఇష్టమైన ధనియాల పంజిరి ఎలా చేసుకోవాలంటే.. -
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.! -
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే! -
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.! -
150 డిగ్రీల కోణంలో శని, బుధులు..సెప్టెంబర్ 1న షడాష్టక యోగంతో ఈ 4 రాశులకు అఖండ ఐశ్వర్యం! -
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి.. -
పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్ ఫ్రూట్ పాయసం.! -
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే!
12 ఏళ్ల తర్వాత సింహరాశిలో చతుర్గ్రాహి యోగం; ఈ 3 రాశుల వారు జాక్‌పాట్ కొట్టేస్తారు
వేదజ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహ కదలిక శుభ, అశుభ ఫలితాలను అందిస్తుంది. నవ గ్రహాలు ఒక నిర్దిష్ఠ సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి కదులుతుంటాయి. గ్రహాల సంచారం, కలయిక, తిరోగమనం వల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇవన్నీ మనిషి జీవితంపై ప్రభావం చూపిస్తాయి.
ఆగస్టు 17వ సింహరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడబోతోంది. శుక్రుడు, చంద్రుడు, కుజుడు, బుధ గ్రహాల కలయికతో ఈ చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ యోగం వల్ల మూడు రాశుల వారు అద్భుతమైన వృద్ధిని, పురోగతిని అందుకోబోతున్నారు. ఆర్థికంగా అద్బుతంగా కలిసిరానుంది. శుక్ర, చంద్ర, కుజ, బుధ గ్రహాల కలయికతో ఏర్పడనున్న ఈ యోగం చాలా అరుదైనది. చతుర్గ్రాహి రాజయోగం వల్ల ప్రయోజనాలు పొందే ఆ 3 రాశుల వారు ఎవరో.. అందులో మీ రాశి ఉందో.. లేదో ఇప్పుడే తెలుసుకోండి.

మిథున రాశి
చతుర్గ్రాహి యోగం మిథున రాశి వారి 3వ ఇంట్లో ఏర్పడబోతోంది. ఆగస్టు 17వ తేదీన ఏర్పడనున్న ఈ యోగం వల్ల మిథున రాశి వారికి అదృష్టం వరించనుంది. ఈ సమయంలో మిథున రాశి వారు తలపెట్టే ఏ పనిలోనైనా తప్పకుండా విజయం సాధిస్తారు. చతుర్గ్రాహి యోగం వల్ల మిథున రాశి వారికి ధైర్యం, పరాక్రమం పెరుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు అందుకోబోతున్నారు. ఉద్యోగ వృత్తిలో ఉన్నవారికి ప్రశంసలు, పదోన్నతులు, జీతం పెరుగుదల లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న సమస్యలు తీరబోతున్నాయి. భార్యాభర్తల మధ్య చాలా కాలంగా ఉన్న సమస్య సమసిపోబోతోంది. ఈ సమయంలో దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారి 4వ ఇంట్లో చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో వృషభ రాశి వారికి వాహనయోగం ఏర్పడనుంది. అలాగే కొత్త ఆస్తులను సొంతం చేసుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేరే అద్భుత సమయం ఇది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన సమస్యలు అన్నీ పరిష్కారమవుతాయి. వారసత్వంగా వచ్చిన ఆస్తి మీ చేతికి అందుతుంది. రియల్ ఎస్టేట్, మీడియా, కళా రంగంలో పని చేసే వారికి ఈ చతుర్గ్రాహి యోగం వల్ల అద్భుతంగా ఉండనుంది. చాలా లాభదాయకమైన సమయం ఇది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారి 9వ ఇంట్లో చతుర్గ్రాహి యోగం ఏర్పడనుంది. దీంతో ధనుస్సు రాశి వారు జాక్‌పాట్ అందుకోనున్నారు. మంచి సంబంధాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు లాభాలను తీసుకువస్తాయి. ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది. విదేశీ పర్యటనలు, విదేశీ చదువుల కోసం వీసాలు లభించడం వంటివి జరుగుతాయి. వ్యాపారస్థులకు ఇది అద్భుతమైన సమయమనే చెప్పాలి. ఏ పని ప్రారంభించిన అందులో లాభాలు అందుకుంటారు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications