Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఫిబ్రవరి 13న కుంభరాశిలో సూర్యుడు మరియు శుక్రుడు కలయికతో ఈ 3 రాశుల వారికి డబ్బు కనకవర్షంలా కురుస్తుంది..
ఫిబ్రవరి 13న కుంభరాశిలో సూర్యుడు మరియు శుక్రుడు కలయికతో ఈ రాశుల వారికి డబ్బు కనకవర్షంలా కురుస్తుంది..
సంవత్సరంలో తిథులు మారే కొద్దీ, ఆయా తిథుల్లో గ్రహాల మార్పు కూడా ఉంటుంది. ఈ గ్రహాల్లో కదలికలు, మొత్తం ద్వాదశ రాశుల మీద ప్రభావం చూపుతాయి. అయితే కొన్నిరాశులకు శుభాలు, మరికొన్ని రాశులకు లాభాలు, ఇంకొన్ని రాశుల నష్టాలను కలిగిస్తాయి. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటుంది. ప్రతి నెలలో వివిధ రాశులలో గ్రహాల ప్రేవేశంతో అన్ని రాశుల జీవితాలను ప్రభావితం చేస్తుంది.

గ్రహాలన్నింటిలోకి ఉత్తమ గ్రహం, గ్రహాలకు రాజుగా పిలువబడే సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. ఫిబ్రవరి నెలలో, సూర్యుడు తన స్థానాన్ని మార్చబోతున్నాడు మరియు శని, కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం సూర్యుడు మకరరాశిలో ఉన్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 13 ఫిబ్రవరి 2023న సూర్యుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. కుంభరాశిలో ఇప్పటికే ఆనందం మరియు శ్రేయస్సుకు అధిపతి అయిన శుక్రుడు ఉండటంవల్ల సూర్యుడు కుంభరాశిలోకి ఎంట్రీ ఇవ్వగానే శుక్రుడితో సఖ్యత చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు, విజయాన్నిచ్చే గ్రహం సూర్యుడు ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశులకు చాలా లాభాలను పొందబోతున్నారు. మరి ఆ రాశుల వారు ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశిలో సూర్య మరియు శుక్రగ్రహాల కలయికతో ప్రవేశించడం వల్ల ఈ రాశుల వారు చాలా బెనిఫిట్స్ పొందుతారు. ముఖ్యంగా ఆర్థికపంగా ఊహించిన విధంగా ఎక్కువ లాభాలు పొందుతారు. ఎందులో పెట్టుబడి పెట్టినా, డబుల్ ప్రాఫిట్ పొందుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు భారీ స్తాయిలో లాభాలు పొందుతారు. దాంతో వారి ఆదాయం పెరుగుతుంది. ఫైనాన్సియల్ గా , ఈ రాశుల వారికి ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి.

వృషభం
ఇక వృషభ రాశిలోకి సూర్యడు, శుక్రుడు కలయిక వల్ల అన్నింటిలోనూ శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశుల వారు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న కొత్త ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఇక బిజినెస్ రంగంలో ఉన్నవారికి వారు ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్ఢర్స్ వస్తాయి, పెద్ద ఆర్డర్లు పెద్ద లాభాలు తెచ్చపెడుతాయి. ఈ రెండు గ్రహాల కలయి వల్ల ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. దాంతో కుటుంబంలో ఆనందంగా గడుపుతారు.

మిధునరాశి
మిథున రాశిలో సూర్యుడు మరియు శుక్రుడు కలయిక వల్ల, ఈ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి పనిలో విజయం మీదే. అదృష్టం మీ తలుపు తడుతుంది. అన్ని రకాలుగా మీకు సహకారం అందిస్తుంది. కుటుంబంలో సంతోషం వాతావరణం ఉంటుంది. ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించవచ్చు. మీరు విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతుంది.
(నిరాకరణ: పైన ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది మరియు విశ్వసనీయతకు హామీ లేదు. తెలుగు బోల్డ్ స్కై కథనానికి సంబంధించిన సమాచారాన్ని నిర్ధారించలేదు. మరియు మా ఏకైక ఉద్దేశం సమాచారాన్ని అందించడమే. దానిని ఇలా తీసుకోవాలి సమాచారం మాత్రమే. ఏదైనా సమాచారం లేదా ఊహను సాధన చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు. , దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.)
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications