Latest Updates
-
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి -
వర్షాకాలంలో పాదాల పగుళ్లు.. వారానికి రెండు సార్లు ఇలా చేయడం తప్పనిసరి.! -
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా.. -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా..
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, కేతువు కలయికను అశుభంగా భావిస్తారు. ఈ రెండు గ్రహాల కలయిక పలు గ్రహాల వారికి ఒత్తిడి, ప్రతికూల ప్రభావాలను కలిగించడంతో పాటు సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ 9న మధ్యాహ్నం 3:14 గంటలకు చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. కాగా, అప్పటికే కేతువు సింహ రాశిలో ఉండటంతో ఈ రెండు గ్రహాల కలయిక గ్రహణానికి కారకం కానుంది. దీంతో దీని ప్రభావం సెప్టెంబర్ 11 వరకు ఉంటుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి వృత్తి, వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బందులు రానున్నాయి. చిన్న పాటి నిర్లక్ష్యం, అజాగ్రత్తతో పనుల్లో ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉంది. గతం వేధించవచ్చు. మరి ఆ రాశులేంటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఆ ప్రభావాలేంటి తెలుసుకుందాం..

మేషరాశి
సెప్టెంబర్ 9 నుంచి మూడు రోజుల పాటు మేష రాశి వారికి గడ్డు కాలం కానుంది. ఈ రాశి చక్రం వారు ఏదైనా సంకల్పం, పనిని ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. గత వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి గురి కావచ్చు. మునుపటి కంటే ఎక్కువగా కష్టపడితేనే ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబంతో మీ అభిప్రాయాలను పంచుకున్నా ఆశించిన మద్దతు లేకపోవడం విచారం ఎదుర్కొంటారు. విద్యార్థులు కొన్ని ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చు.

తులారాశి
రేపటి నుంచి మూడు రోజుల పాటు తులారాశి వారికి సవాలు కానుంది. ఈ సమయంలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఏదైనా పనిలో మీరు ఎదుర్కొనే ప్రతికూల ఫలితాలు వారికి కొంచెం ఆందోళనని కలిగించవచ్చు. పట్టుదలతో ఓర్పు, కృషి ఉంటే విజయాన్ని సాధించవచ్చు. పని సంబంధిత విషయాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. కొన్ని ప్రయాణాలు చేసి వచ్చిన మీరు మరింత అలసటకి గురవుతారు. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

మీన రాశి

ఈ మూడు రోజుల పాటు మీన రాశి వారికి అదృష్టం కలిసి రాదు. కుటుంబీకులు, స్నేహితుల నుంచి ఆశించిన మద్దతు లభించదు. ఆర్థిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బుకి సంబంధించిన విషయాల్లో క్షుణ్ణంగా పరిశీలన చేసుకోండి. తొందరపాటుతో ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ఆర్థికంగా నిర్ణయాల విషయంలో సమస్యలను పెంచుతుంది. కుటుంబ సంబంధిత విషయాల్లో మీ లైఫ్ పార్ట్‌నర్‌తో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఏదైనా వస్తువు కొనుగోలు విషయంలో ప్రణాళికలు విఫలమవుతాయి. దీంతో మీరు కలత చెందవచ్చు. ఏ పనైనా చేసే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
