Latest Updates
-
రాత్రి మిగిలిపోయిన అన్నంతో క్రిస్పీ దోశ..ఈజీగా చేసుకోండిలా.. -
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది!
మండే వేసవిలో కూడా చల్లదనాన్ని అనుభవించే రాశులివే..సమ్మర్ లో వీరు సేఫ్!
ప్రస్తుతం భాగుడి భగభగల దెబ్బకి ఇంట్లోనుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోజు రోజుకి వాతావరణంలో వేడి తీవ్రత పెరుగుతుంది. అయితే కొన్ని రాశులపై వేడి చాలా తక్కువ ప్రభావం చూపుతుంది. జ్యోతిషశాస్త్రంలో నీటి మూలకానికి చెందిన మూడు రాశులతో పాటుగా గాలి మూలకానికి చెందిన ఒక రాశిచక్రం కూడా ఉందని పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వ్యక్తులు మండే వేసవి కాలంలో కూడా చల్లగా ఉంటారని తెలిపారు. ఆ రాశులు ఏవో, వాటి లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మిథున రాశి
జ్యోతిషశాస్త్రం ప్రకారం మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడి మూలకం గాలి. ఈ రాశి రెండు రకాల స్వభావాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా ఊహాత్మకులు, ఆలోచనలలో మునిగిపోతారు. మానసికంగా కొంచెం గందరగోళంగా ఉంటారు. ఈ రాశి యొక్క ద్వంద్వ స్వభావం వీరి స్వభావంలో కూడా కనిపిస్తుంది. వాతావరణం, పరిస్థితులకు అనుగుణంగా సులభంగా అలవాటు పడతారు. అందుకే వీరికి శీతాకాలంలో పెద్దగా చలి ఉండదు, వేసవి రోజుల్లో చల్లగా ఉంటారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు చల్లదనానికి కారకుడు, ఈ రాశిలో చంద్రుడు ఉన్నాడు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చల్లని స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వారి స్వభావంలో శాంతి కూడా కనబడుతుంది. వీరు మానసికంగా కూడా చాలా బలంగా ఉంటారు. అందుకే తీవ్రమైన వేడిలో కూడా తమను తాము ఎలా చక్కగా నిర్వహించుకోవాలో వీరికి తెలుసు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి అధిపతి కుజుడు..ఇది అగ్ని గ్రహం. దీని కారణంగా వీరి స్వభావంలో కొంత దూకుడు ఉంటుంది, కానీ కుజుడి మూలకం నీరు కాబట్టి అవి నీటి ప్రాంతాలను ఎక్కువగా ఇష్టపడతాయి. అందువల్ల ఈ రాశి వ్యక్తులు అవకాశం దొరికినప్పుడల్లా బీచ్ లేదా జల ప్రాంతాలను సందర్శించడానికి బయటకు వెళతారు. ఈ రాశిలో జన్మించిన వారికి జలుబు, దగ్గు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అవి నీటి మూలకానికి చెందినవి. మంచి విషయం ఏమిటంటే అవి వేడి వల్ల పెద్దగా బాధపడవు.
మీన రాశి
మీనం అనేది జల ధాతువుకు చెందిన రాశి, దీని అధిపతి బృహస్పతి. అందువల్ల బృహస్పతి స్థిరత్వం, గంభీరత ఈ రాశుల వ్యక్తులలో కనిపిస్తుంది. వీరు ఏ విషయంలోనూ త్వరగా అసహనానికి గురికారు. నీటి మూలక రాశి కావడం వల్ల వీరి స్వభావంలో వ్యక్తిత్వంతో పాటు చల్లదనం కూడా కనిపిస్తుంది. వేసవి రోజుల్లో కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు..మండే వేడిలో కూడా చల్లగా ఉండగలుగుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
