Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
Horoscope Today: ఈరోజు ఈ రాశివారు పోలీస్ కేసుల్లో ఇరుక్కుంటారు.. జాగ్రత్తగా ఉండకపోతే జైలుకే!
జోతిష్య శాస్త్రం ప్రకారం మనిషి జీవితంలో జరిగే సంఘటనలు గ్రహాలు, వాటి గమనాలు, రాశి ఫలాల ఆధారంగా జరుగుతాయని నమ్ముతుంటారు. ప్రతిరోజూ గ్రహాల గమనాలు మారుతుంటాయి. అలాగే రాశి ఫలాలు కూడా మారుతాయి. అయితే ఈ రోజు ఎవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఎవరికీ ఈ రోజు మంచి జరగనుంది అనేది తెలుసుకుందాం.
మేష
ఈరోజు ఈ రాశి వారికి అంతా మంచే జరగనుంది. తమ తమ పనుల పట్ల ఈ రాశి వారు ఈరోజు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ రోజు మేష రాశి వారికి బాగుంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. పెట్టుబడికి కూడా ఈ రోజు మంచిది. కుటుంబ జీవితం బాగుంటుంది.

వృషభ
ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది. వ్యాపారంలో భారీగా లాభాలను పొందే అవకాశం ఉటుంది. వేరే ఉద్యోగం కోసం చూస్తున్నట్లైతే ఈరోజు ఆ ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేయవచ్చు. మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు ఈరోజు పెద్దలు చెప్పే సలహాలను నిర్లక్ష్యం చేయకండి.
మిథున
ఈ రాశి వారికి ఈ రోజు వృత్తి జీవితం చాలా బాగుంటుంది. వ్యాపారులు ధనలాభం పొందుతారు. ఈరోజు దంపతుల మధ్య ఏదైనా చిన్న చిన్న మనస్పర్థలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును అంగీకరించడం ద్వారా మంచి ఫలితాలను పడవచ్చు.
కర్కాటక
ఈ రోజు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారు ఈరోజు చట్టపరమైన విషయాల జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులు, పెద్దల సలహాలు తీసుకుంటే చాలా మంచిది. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది.
సింహ
ఈ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఈరోజు మీ పని కూడా చాలా సులభంగా, అందంగా ఉండబోతుంది. మీ ఉద్యోగంలో నెలకొన్న కొన్ని ప్రధానమైన సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం చాలా బాగుతుంటుంది.
కన్య
ఈరోజు కన్య రాశి వారు కొన్ని అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఆర్ధిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నిర్లక్ష్యం చేయకూడదు. ఆస్తి సంబంధిత వ్యవహారాలకు ఈరోజు చాలా అనుకూలంగా యూదాబోతుంది. కుటుంబ జీవితం బాగుతుంటుంది. దంపతుల మధ్య ప్రేమ చిగురిస్తుంది.
తులా
ఈరోజు ఈ రాశి వారికి కుటుంబ పరంగా చాలా మంచిగా ఉండబోతుంది. దంపతుల మధ్య అనుబంధం చాలా బాగుంటుంది. పెళ్లికాని వారికి పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్ధిక పరమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను నియంత్రిచుకోవాలి.
వృశ్చిక
ఈ రాశి వారికి కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ ఉద్యోగంలో లేదా పనిలో ఎవరితోనూ వాదించకూడదు. మీ పనిపై దృష్టిపెట్టి పని చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా కొంత అనుకూలతలు కనిపిస్తున్నాయి.
ధనుస్సు
ఈ రాశి వారికి ఈరోజు కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి చాలా కస్టపడి పని చేయాల్సి వస్తుంది. వ్యాపారులకు కూడా లాభాలు పొందడం చాలా కష్టంగా మారుతుంది. కుటుంబ జీవితం బాగున్నప్పటికీ ఒత్తిడి కారణంగా మీరు అంతగా ఎంజాయ్ చేయలేరు. ఆరోగ్యంపై ద్రుష్టి పెట్టాలి.
మకరరాశి
ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని పోలీస్ కేసులు, న్యాయపరమైన విషయాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఉద్యోగంలో, పని ప్రదేశంలో ఈరోజు చాలా ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది. వృత్తితో పాటు పర్సనల్ లైఫ్‌పై కూడా ద్రుష్టి పెట్టాలి. మీ భాగస్వామి భావాలను గౌరవించడం చాలా మంచిది.
కుంభ
ఈ రోజు ఈ రాశివారు కీర్తి పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంపై ద్రుష్టి పెట్టాలి. మీ భాగస్వామి భావాలను గౌరవించాలి. విద్యార్థులు చదువు విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ ద్రుష్టి పెడితే మంచి ఫలితాలు చూడొచ్చు.
మీనం
ఈరోజు ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం రెండింతలు అవుతుంది. అనవసర చింతలను వదిలేయడం మంచిది. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. వ్యాపారంలో కూడా లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం కూడా చాలా బాగుంటుంది.
గమనిక: ఈ కథనంలోని సమాచారం, జోతిష్య వివరణలు కేవలం మీకు జ్ఞానం అందించేందుకు మాత్రమే అందించబడింది. ఈ కథనం ఆధారంగా మీకు ఎలాంటి నష్టాలైన కలిగిస్తే వాటికి బోల్డ్ స్కై బాధ్యత వహించదు. ఈ సమాచారం ఆధారంగా మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు కచ్చితంగా గుర్తింపుపొందిన నిపుణుల సలహాలు తీసుకోవాలని Boldsky.com మీకు సూచిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
