Latest Updates
-
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే! -
నేడు ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఊహించని ధనలాభం మీ సొంతం! -
భీమవరం స్పెషల్ చిట్టి రొయ్యల బిర్యానీ..ఘుమఘుమలాడే గోదావరి రుచి మీ ఇంట్లోనే.. -
2026 జూన్ 7: రవి యోగంతో అదృష్టం మీ సొంతం.. ఉదయం 8 గంటల లోపే ఈ పని చేయండి! -
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే భార్యలు చేయకూడని పనులు!..తలస్నానం చేస్తే.. -
మీ జన్మ నక్షత్రానికి ఏ దేవత అధిపతి తెలుసా? ఏ దేవతను పూజించాలి మీ స్టార్ ఏది? -
జూన్ 7 గ్రహ సంచారం: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి హెచ్చరిక.. నేటి గ్రహాల ప్రభావం ఇదే! -
మిథునం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 07 నుండి 13 జూన్ 2026 వరకు -
సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్ట యోగం.. ఆదివారం మీ జాతకం ఎలా ఉంది? - ఆదివారం, 07 జూన్ 2026
ఫిబ్రవరి 07 రాశిఫలాలు..మేషానికి విజయం..మీనానికి ధన గండం? శనివారం మీకు ఎలా ఉందో చూడండి
ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాల స్థితిగతుల్లో మార్పుల్లో మనుషుల జీవితాలపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది. ఇవాళ శనివారం కావడం, కొన్ని రాశుల వారికి శని దేవుని అనుగ్రహం లభించనుండగా, మరికొందరు కాస్త అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.
కెరీర్, ఆరోగ్యం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సంబంధాల పరంగా మేషం నుండి మీనం వరకు అన్ని రాశుల వారి జాతక ఫలితాలు ఈరోజు(ఫిబ్రవరి 7,2026) ఎలా ఉన్నాయో ఇక్కడ చూడండి.

మేష రాశి
ఈ రోజు మేష రాశి వారికి విజయకేతనం ఎగురవేసే రోజు. మీరు తలపెట్టిన పనులన్నీ సజావుగా సాగుతాయి, సానుకూల ఫలితాలు మీ సొంతమవుతాయి. ఆరోగ్య పరంగా చాలా ఉల్లాసంగా, శక్తివంతంగా ఉంటారు.
వ్యాపారవేత్తలకు లాభాల పంట పండుతుంది, మీ వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. అతిథుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. ఒక చిన్న విహారయాత్రకు వెళ్ళే అవకాశం కూడా ఉంది.
అదృష్ట రంగు: నీలం
వృషభ రాశి
గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆందోళనల నుండి ఈరోజు ఉపశమనం లభిస్తుంది. కొత్త ఆస్తులు లేదా స్థలాలు కొనుగోలు చేయడానికి ఇది అనుకూలమైన రోజు. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది.
అనవసరమైన జోక్యం వల్ల లేనిపోని సమస్యలు రావచ్చు. కార్యాలయంలో మీపై తప్పుడు ఆరోపణలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీ దీర్ఘకాలిక ప్రణాళికలు మాత్రం సఫలమవుతాయి.
అదృష్ట రంగు: మెరూన్
మిథున రాశి
ఈ రోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది.
ఉద్యోగంలో పని ఒత్తిడి లేదా సవాళ్లు ఎదురైనా, మీ పై అధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. క్లిష్ట పరిస్థితుల్లో సహనం కోల్పోకండి.
అదృష్ట రంగు: ఆకుపచ్చ
కర్కాటక రాశి
ఈరోజు ఎమోషన్స్ ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు జరిగే అవకాశం ఉంది, కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.
ఆర్థికంగా ఈరోజు సామాన్యంగా ఉంటుంది, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపకపోవడమే మంచిది. ఆఫీసులో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది, ఉన్నతాధికారుల సాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి హెచ్చుతగ్గులు ఉండవచ్చు.
అదృష్ట రంగు: తెలుపు
సింహ రాశి
సింహ రాశి వాళ్లకి ఇవాళ చాలా కీలకమైనది. కుటుంబ జీవితం ఆనందమయంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను వాయిదా వేయకండి. కోర్టు కేసులు లేదా చట్టపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది.
ప్రయాణాల్లో ఉన్నవారు వాహన మరమ్మతుల కారణంగా అనుకోని ఖర్చులు చేయాల్సి రావచ్చు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఒక ముఖ్యమైన పని ఈరోజు పూర్తయి మీకు ఊరటనిస్తుంది.
అదృష్ట రంగు: పసుపు
కన్య రాశి
ఈ రోజు కన్య రాశి వాళ్లు కొంచెం ధైర్యంగా ఉండాలి. కొన్ని ఊహించని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే కుటుంబంలో ఉన్న పాత గొడవలు సమసిపోతాయి. తోబుట్టువులతో ఆస్తి తగాదాలు రావచ్చు, సంయమనం పాటించండి.
ఈరోజు కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది, లేదంటే నష్టాలు తప్పవు. వ్యక్తిగత సమస్యల వల్ల కొద్దిపాటి మానసిక ఆందోళన ఉంటుంది.
అదృష్ట రంగు: ఊదా
తుల రాశి
ఈ రోజు దురాశ దుఃఖానికి చేటు అనే సామెతను గుర్తుంచుకోవాలి. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తప్పుడు మార్గాల్లో వెళ్లే ప్రమాదం ఉంది, దీనివల్ల మీరు ఇబ్బందుల్లో పడవచ్చు.
ఏదైనా కొత్త అవకాశం వస్తే దాని పూర్వాపరాలను పరిశీలించి అడుగు ముందుకు వేయండి. ఆఫీసులో నిజాయితీగా పనిచేయడం ముఖ్యం. మీ తెలివితేటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు కానీ, అతిగా ఆశపడకండి.
అదృష్ట రంగు: నారింజ

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ పరంగా శుభవార్త అందుతుంది. మీ ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక కొత్త స్నేహితుడి పరిచయం మీలో ఉత్సాహాన్ని నింపుతుంది.
కుటుంబంలో ఇన్నాళ్లు ఉన్న మనస్పర్థలు తొలగిపోయి, ఇంట్లో ప్రశాంతమైన, సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. మొత్తం మీద ఈరోజు మీకు సానుకూల ఫలితాలు ఉంటాయి.
అదృష్ట రంగు: ఆకుపచ్చ
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పిల్లల ప్రవర్తన లేదా వారి విషయాల వల్ల కొంత ఒత్తిడికి లోనవుతారు. మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం, ప్రేమ లభిస్తాయి.
కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి, సహోద్యోగుల విమర్శలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం. ఎవరి మాటలకూ నొచ్చుకోకండి, మానసిక ప్రశాంతత ముఖ్యం.
అదృష్ట రంగు: తెలుపు
మకర రాశి
ఈ రోజు మకర రాశి వారికి సవాలుతో కూడుకున్న రోజు. ఆఫీసులో పనిభారం ఎక్కువగా ఉండి అలసటను కలిగిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి, నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడతారు.
వ్యాపార భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి, మోసపోయే అవకాశం ఉంది. నోరు జారడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు, కాబట్టి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
అదృష్ట రంగు: నలుపు
కుంభ రాశి
ఈ రోజు కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ప్రమాదకరమైన వ్యాపారాలు లేదా స్పెక్యులేషన్ జోలికి వెళ్లకండి. సామాజిక సేవలో పాల్గొనే వారికి మంచి గుర్తింపు లభిస్తుంది.
కొత్త వ్యాపార ప్రయత్నాలు మీ ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది. వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది. ఎవరి దగ్గరా రుణాలు తీసుకోకండి, అది భవిష్యత్తులో సంబంధాలను పాడుచేయవచ్చు.
అదృష్ట రంగు: ఎరుపు
మీన రాశి
ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆఫీసులో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, మీ కృషి, పట్టుదలతో వాటిని అధిగమిస్తారు.
పెద్ద లక్ష్యాలను సాధించడానికి పక్కా ప్రణాళిక అవసరం. వ్యాపారవేత్తలకు పెద్ద మార్పులు సంభవించవచ్చు. ఉన్నతాధికారుల మద్దతుతో కష్టమైన పనులను కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు.
అదృష్ట రంగు: గులాబీ
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications