Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఈ రాశి వారికి అన్నీ ఇబ్బందులే.. అవి పోవాలంటే ఏం చేయాలంటే..!
మనలో చాలా మందికి మన రాశి ఫలాల మీద నమ్మకం ఉంటుంది. ఆ విధంగానే ప్రతిరోజూ ఉదయం లేవగానే రాశి ఫలాలు చెక్ చేసుకుంటూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు రాశి ఫలాలు కూడా చూద్దాం. నేటి రాశి ఫలాల్లో మేష రాశి వారికి ఆదాయపరంగా వృద్ధి ఉంటే, వృషభ రాశి వారికి ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటాయి. అయితే నేడు మిగిలిన రాశుల ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే..
మేషం: ఈ రాశి వారికి వారి వారి రంగాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఎప్పటినుంచో అనుకుంటున్న ముఖ్య పనులను మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. కొన్ని పరిస్థితులు ఈ రాశి వారికి మానసిక సంతృప్తిని కలుగజేస్తాయి. లక్ష్మీదేవి దర్శనం ఉత్తమం.
వృషభం: ఈ రాశి వారికి వారి వారి రంగాల్లో రాణించాలంటే ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు వేరే వారి మాటలు కూడా పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో సహనం కోల్పోకుండా నేర్పుతో ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు.

మిథునం: ఈ రాశి వారికి ఈరోజు మొత్తం శుభకాలమే ఉండనుంది. ముందుగా తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో ఈ రాశివారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వీరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి.
కర్కాటక: ఈ రాశి వారు ఎప్పటినుంచో అనుకుంటూ వస్తున్న ఒక ముఖ్యమైన పని దాదాపు పూర్తి కావస్తుంది. ఉద్యోగ జీవితంలో శ్రమకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనుల విషయమై పెద్దలను కలుస్తారు.
సింహ: ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలకు చెందిన వారుంటే ఒక శుభవార్త వింటారు. కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య: ఈ రాశి వారికి అంతా శుభకాలమే నడుస్తుంది. ఈ రాశి వారు వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలను పొందుతారు. వీరికి సకాలంలో సహాయం చేసే వారుంటారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి మంచి ఫలితాలను పొందుతారు.
తుల: ఈ రాశివారు తాము చేపట్టిన పనుల్లో అవరోధాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఈ రాశివారికి సకాలంలో సహకారం అందుతుంది. మనసౌఖ్యం ఉంటుంది.
వృచ్చిక: ఈ రాశివారికి వారు పాటించే స్వధర్మమే వారిని రక్షిస్తుంది. ఎప్పటి నుంచో వెంటాడుతున్న ఓ సమస్య వల్ల ప్రశాంతత కలుగుతుంది. ఒక వార్త వీరికి బాధను కలిగిస్తుంది. ప్రయాణాలు చేసే వారు.. ఈరోజు ఆ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వీరు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముంది.
ధనుస్సు: ఈ రాశి వారు తలపెట్టిన కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను కుటుంబ సహకారంతో పూర్తి చేయగలుగుతారు. వీరికి శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. కొందరు వ్యక్తులు కుటుంబ విషయాలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. వారితో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది.
మకర: ఈ రాశివారికి బంధువుల నుంచి మేలు జరగనుంది. అలాగే ఉద్యోగంలో, సమాజంలో కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి. పలు కీలక వ్యవహారాల్లో ఈ రాశివారు తమ సమయస్ఫూర్తితో ప్రశంసలు అందుకుంటారు .
కుంభ: ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. వీరి శ్రమకు తగ్గ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనఃశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. తలపెట్టిన పనులు త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
మీనం: ఈ రాశివారు తాము చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు చేయకుండా పొదుపు మంత్రాన్ని పాటించాలి. శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications