Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
Daily Horoscope: ఈరోజు ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఒక్క పొరపాటు చేసినా ప్రమాదమే!
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ప్రతి రోజు నక్షత్రాలు, గ్రహ స్థానాల సంచారం ఆధారంగా రాశి చక్రంలోని 12 రాశుల జాతకం డిసైడ్ అవుతుంది. మేషం నుంచి మీన రాశి వరకు ప్రతి ఒక్కరి జీవితం ప్రభావితం అవుతుంది. అయితే ఈరోజు ఏ రాశి వారికి బాగుంది? ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రాశి వారికి ఈరోజు సవాళ్లతో నిండి ఉంటుంది. వీరు అనుకున్న పని పూర్తికాకపోవడంతో పాటు వీరు పడిన శ్రమకు ఫలితం దక్కకపోతే వీరు చాలా బాధపడతారు. ఈ రాశి వారు ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వివాహితులు జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి. మీరు రుణం తీసుకున్నట్లయితే, ఈరోజే తిరిగి చెల్లించే అవకాశాలు ఉన్నాయి.

వృషభం
ఈ రాశి వారు తమ పనిలో ఉన్నతంగా రాణిస్తారు. తమ పనితీరు ఈరోజు మెరుగ్గా ఉంటుంది. కొన్ని కొత్త పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. తోబుట్టువుల నుంచి ఈ రాశి వారికి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఈరోజు ఎవరికైనా వాగ్దానం చేసే ముందు ఆలోచించండి.
మిధున రాశి
ఈ రాశి వారు ఈ రోజు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగార్ధులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కొందరికి కార్యాలయంలో పదోన్నతి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరు మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. కొత్త ఇల్లు కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్కాటక
రాజకీయాలలో ఉన్న కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. ఏదైనా కొత్త పనిని ఆలోచనాత్మకంగా చేయాలి. పనిలో సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. మూడో వ్యక్తి మాటను అస్సలు నమ్మకూడదు.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈరోజు కొందరు కొత్త శత్రువులు బయటపడవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఖర్చులపై అదనపు శ్రద్ధ వహించాలి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కన్య
కన్యా రాశి ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నవారు ఎవరినీ నమ్మకూడదు. కావాలనే కొందరు కుట్ర చేసే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు చేసే పనుల్లో చాలా తెలివిగా ఉండాలి. ఈరోజు మీ కార్యాలయంలో ఉన్నత అధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు.
తులా రాశి
ఈ రాశి వారికి ఈరోజు కష్టపడి పని చేసే రోజు అవుతుంది. మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెడతారు. ఉద్యోగం మారే అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవడం మంచిది. పురోగతిలో ఉండే ఆటంకాలు ఈరోజు తొలగిపోతాయి. మీరు మాట్లాడే ముందు ఆలోచించండి. తోబుట్టువుల నుంచి వారికి పూర్తి మద్దతు లభిస్తుంది. న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో మీ భవిష్యత్తు కోసం పెద్ద పెట్టుబడి పెట్టె అవకాశాలు ఉన్నాయి. అప్పుగా తీసుకున్న డబ్బు సులభంగా లభిస్తుంది. మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా పెద్ద కోరిక కోరుకునే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు ఈరోజు పెట్టుబడి విషయంలో చాలా తెలివిగా పెట్టుబడి పెట్టాలి. ఈ రాశి వారు ఈరోజు కొత్త ఆస్తిని కొనుగోలు చేస్తారు. జాయింట్ వెంచర్లకు దూరంగా ఉండాలి. కోల్పోయిన ఇష్టమైన వస్తువులను కనుగొనే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. పిల్లల నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు.
మకర రాశి
మకర రాశి వారికి ఈ రోజు ఓర్పు, ధైర్యం కూడిన రోజు అవుతుంది. మీరు కొన్ని పనులను పూర్తి చేయడంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. మీరు ఎవరికైనా వాగ్దానం చేసినట్లయితే, మీరు దానిని సకాలంలో నెరవేర్చాలి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన రోజు అవుతుంది. మీరు ఒకదాని తర్వాత ఒకటి శుభవార్తలు వింటారు. కార్యాలయంలో, మీ ఉన్నతాధికారులు చెప్పేది జాగ్రత్తగా వినండి. దీనివల్ల మీ ప్రభావం, విలువ పెరుగుతుంది. ఆధ్యాత్మికత పట్ల ఈరోజు మీకు ఆసక్తి పెరుగుతుంది. చాలా కాలం తర్వాత మీ స్నేహితుడిని కలుస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈరోజు సంతోషకరమైన రోజు అవుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్త స్నేహితులను పొందుతారు. ఇప్పటి వరకు మీకున్న కొన్ని రుణాలను తీర్చేసుకుంటారు. అదృష్టం యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఇంటి పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications