Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
బిగ్గెస్ట్ జాక్‌పాట్.. ఈ రాశి వారికి తమ జీవితంలో ఎప్పుడూ దొరకని అరుదైన అవకాశం రాబోతుంది!
గ్రహాల సంచారం, వాటి స్థానాల ఆధారంగా ఈరోజు ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? ఏ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి?, ఏ రాశి వారికి ఈరోజు అనుకున్న పనులు నెరవేరుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రోజు మేషరాశి వారికి సహనం చాలా తక్కువగా ఉంటుంది. వీరు ప్రతి విషయంలోనూ సహనం కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు ఈ రాశి వారు తమ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన చింతలను విడిచిపెట్టి పనిపై దృష్టి పెట్టాలి. ఈ రోజు ఆర్థికంగా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి
ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితం బాగుంటుంది. మీ మధ్య కొంత అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ, అంతా బాగానే సాగిపోతుంది. మీకు ఉన్న అన్ని సమస్యలను పోగొట్టుకోవడానికి మీకు ఇదే మంచి సమయం. ఈ కాలం మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది. కానీ పెట్టుబడి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి
ఈరోజు మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు ఈరోజు కొంత అసహనానికి గురై.. అనవసర ఇబ్బందులను తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రాశివారు ఈరోజు అసహనానికి గురి కావొద్దు. బంధుమిత్రులు, స్నేహితుల కారణంగా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఆ సమస్యలను పరిష్కరించుకోండి.
కర్కాటకం
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సమస్యలన్నిటినీ వదిలేసి మీరు మీ పనిపై దృష్టి పెట్టగలుగుతారు. ఈ రోజు మీపై మీరు చాలా విశ్వాసంతో ఉంటారు. ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. కుటుంబ సమస్యలు తొలిగిపోతాయి.
సింహ రాశి
ఈరోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి, మీ పని చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. ఈ రోజున మీ విశ్వాసం పెరుగుతుంది, ఆర్థికంగా ఈ రోజు బాగుంటుంది.
కన్య రాశి
ఈ రాశి వారు ఈరోజు తమ వృత్తిపై దృష్టి పెట్టాలి. కెరీర్ జీవితంలో మంచి అవకాశాలు వస్తాయి. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య కొంత విబేధాలు ఉండవచ్చు, వాటిని ఓపికతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అనవసర ఆందోళనలు వదిలేసి లక్ష్యంపై దృష్టి పెట్టండి.
తుల రాశి
ఈ రాశి వారు ఈరోజు ఒత్తిడికి లోనవుతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. ఓపికగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. వృత్తిపరమైన జీవితం దృష్ట్యా ఈ రోజు మంచి రోజు కాబోతుంది. వ్యక్తిగత జీవితం వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేయకుండా చూసుకోండి.
వృశ్చిక రాశి
ఈ రోజు వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పని, ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. కుటుంబ జీవితం చాలా సరదాగా ఆహ్లాదకరంగా సాగిపోతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా మీకు ఈరోజు అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రయాణ వ్యవహారంలో కొంత జాగ్రత్త తీసుకుంటే మంచిది.
ధనుస్సు రాశి
ఈ రోజున ఈ రాశి వారికి కొంత గందరగోళం ఉండే అవకాశం ఉంటుంది. కానీ అనుకూలమైన పరిస్థితిలో ప్రతిదీ పరిష్కరించబడుతుంది. చిన్న విషయాలను పెద్దగా చేయకూడదు. మీ పనిపై దృష్టి పెట్టండి. వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఆర్ధిక పరిస్థితులు అంతతమాత్రంగానే ఉంటాయి.
మకర రాశి
ఈ రోజు మకర రాశి వారికి తమ జీవితంలోనే ఎప్పుడూ చూడని ఒక అమూల్యమైన అవకాశం లభిస్తుంది. మీకు, మీ భాగస్వామికి మధ్య ఏదైనా విభేదాలు ఉంటే, అది ఈరోజు పరిష్కరించబడుతుంది. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి.
కుంభ రాశి
ఈ రాశి వారికి ఈరోజు పనులు చక్కగా సాగుతాయి. కుటుంబంలో కూడా సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వ్యాపారులు లాభాలను పొందగలుగుతారు. ఆర్థికంగా ఈ రోజు మంచిది. మొత్తంగా ఈ రోజు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
మీనం
ఈ రాశి వారికి ఈరోజు తమ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో వీరు ఎలాంటి పనులనైనా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. పనిలో చూపించే ప్రతిభకు వీరికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితులు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications