Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Daily Horoscope: ఈరోజు ఆ 3 రాశుల వారికి చాలా ప్రమాదం, మిగిలిన రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వారికి ఈ రోజు ఏ విధంగా గడవబోతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
ఈరోజు మేష రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబంతో సమయాన్ని గడపగలుగుతారు. మీ ప్రస్తుత బడ్జెట్‌కు మించి ఖర్చు చేయకూడదు. వ్యాపారుల వల్ల కలిగే నష్టాలను పూడ్చుకోగలగాలి. ఈ రోజు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ప్రతి విషయం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.
వృషభ రాశి
ఈరోజు వృషభరాశి వారు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. వీరికి ఈరోజంతా బాగుంటుంది. వీరు అనుకున్నది అంతా సవ్యంగానే జరుగుతుంది. కానీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా అవి సవ్యంగానే సర్దుకుపోతాయి. పనిలో ఒత్తిడికి గురి అవ్వాల్సిన అవసరం లేదు. అంతా సవ్యంగానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిధున రాశి
ఈ రోజున ఈ రాశి వారు కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు. అయితే కొందరు వ్యక్తుల నుండి వచ్చే వార్తలు మనశ్శాంతిని ఇస్తాయి. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధం బాగుంటుంది. ఆర్ధిక పరమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
కర్కాటక రాశి
ఈరోజు కర్కాటక రాశి వారిని కొన్ని విషయాలు ఇబ్బంది పెట్టె అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం దొరుకుతుంది. మీరు చెప్పేదానిపై దృష్టి పెట్టండి. మీ అధిక ప్రసంగం కొన్ని విషయాల్లో మీకు సమస్య కావచ్చు. ఆ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
సింహ రాశి
సింహ రాశికి చెందిన వారికి ఈరోజు కెరీర్‌లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండడంతో.. ఈరోజు ఆరోగ్యంపై ఈ రాశికి చెందిన వ్యక్తులు ద్రుష్టి పెడతారు. అయితే దంపతుల మధ్య సంబంధం బాగుంటుంది. పనిలో ఆశ కోల్పోకండి, మీ ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది.
కన్య రాశి
కన్యారాశి వారికి ఈరోజు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో సంతోషంగా గడపగలుగుతారు. ఆర్థికంగా కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు ధనప్రాప్తి కలుగుతుంది. అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. కొంత ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
తులా రాశి
తులారాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు కాబోతుంది. ఈరోజు వీరు ప్రతికూల వ్యక్తుల నుండి దూరం ఉండడం చాలా ముఖ్యం. దీని వల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆర్థికంగా లాభపడతారు. ఈరోజు వ్యాపారులు భారీగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య బాగుంటుంది. చిన్న చిన్న మనస్పర్థలు తొలిగిపోతాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి చెందిన ప్రేమికులకు ఈరోజు చాలా మంచిది. వివాహితులకు కూడా ఈ రోజు శృంగారభరితంగా ఉంటుంది. ఆరోగ్య సమస్య ఉంటే వాటిని జయించడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఈ రోజున ఈ రాశికి చెందిన వారి వృత్తి జీవితం బాగుంటుంది, ఆర్థిక పరమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి.
ధనుస్సు రాశి
ఈ రోజు ధనుస్సు రాశి వారికి చాలా మంచి రోజు అవుతుంది. ఈ రాశి వారు తమ పనితో ఈరోజు సామాజికంగా గుర్తింపు పొందగలుగుతారు. అలాగే మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య బంధం బాగుంటుంది. అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండండి. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా, లాభసాటిగా ఉంటాయి.
మకర రాశి
ఈరోజు మకర రాశి వారికి అత్యంత శుభప్రదమైన రోజు. ఈరోజు మకర రాశి వారి శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారులు ధనలాభాన్ని పొందుతారు. ఈ రోజు ఆరోగ్యం పరంగా కూడా బాగుంటుంది కుటుంబంతో ఆనందంగా గడపగలుగుతారు. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
కుంభ రాశి
ఈ రాశికి చెందిన వారు ఈరోజు గతంలో తీసుకున్న నిర్ణయాల ఫలితాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఈరోజు వీరికి లాభిస్తాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్థికంగా కూడా ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
మీన రాశి
మీనరాశి వారికి కూడా ఈరోజు చాలా మంచి రోజు అవుతుంది. వీరు ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే సమాజంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు మాట్లాడే మాటలు, ప్రవర్తించే విధానంపై కొంత శ్రద్ధ వహించాలి. మీ మాటలు ఎదుటివారిని గాయపరిచే విధంగా ఉంటే.. కచ్చితంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మీ భాగస్వామి భావాలను గౌరవించాలి. ఆర్థికంగా ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications