Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
నేటి రాశి ఫలాలు కొన్ని రాశుల వారికీ మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి చాలా బాగుంటే, ఇంకొన్ని రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. సమాజంలో అవమానాలు, ఇంట్లో బాధలు అన్నీ వచ్చే అవకాశమున్నాయి. అయితే ఏ రాశి వారికి నేడు ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా నేటి శుభఘడియలు తెలుసుకుందాం..
> వర్జ్యం: ఉ. 9-02 నుంచి 10-41 వరకు తిరిగి రా. 11-50 నుంచి 1-29 వరకు
> అమృత ఘడియలు: అమృత ఘడియలు: సా. 6-54 నుంచి 8-33 వరకు
> దుర్ముహూర్తం: దుర్ముహూర్తం: ఉ. 11-24 నుంచి 12-11 వరకు
> రాహుకాలం: మ. 12-00 నుంచి 1-30 వరకు
మేష రాశి: ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ఈ రాశి వారు తమ శ్రమకు తగ్గ ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యమైన పనులు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవడంతో పాటు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో ఆనందంగా గడిపినప్పటికీ, మనఃశాంతిగా తగ్గకుండా చూసుకుంటే మంచిది. ఆదిత్య హృదయం పఠించడం మంచింది.

వృషభ రాశి: ఈ రాశి వారు మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ప్రతి పనిని ఉత్సాహంగా పని పూర్తి చేస్తారు. మీలోని శ్రద్ధాశక్తులు మిమ్మల్ని సమాజంలో గొప్పవారిగా మారుస్తాయి. అయితే ఎవరినైనా అతిగా విశ్వసించడం మంచిది కాదు. శ్రీరామాన్ని జపాన్ని చేయడం మంచిది.
మిథున రాశి: ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో పై అధికారుల నుంచి ప్రశంశలతో పాటు మంచి గుర్తింపు కూడా పొందుతారు. ఈ రాశి వారికి బంధు మిత్రుల వల్ల చాలా మంచి జరుగుతుంది. శ్రీసుభ్రమణ్య అష్టోత్తర శతనామావళి పఠిస్తే చాలా మంచిది.
కర్కాటక రాశి: ఈ రాశి వారు చాలా సంతోషకరమైన వాతావరణాన్ని గడుపుతారు. కుటుంబంలో సమస్యలు పుట్టుకొస్తాయి. దీని కారణంగా మానసిక ప్రశాంతత కొరవడుతుంది. అయితే మీరు చేసే పనులకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచిది.
సింహ రాశి: ఈ రాశి వారికి నేడు అన్నీ శుభసూచికాలే తాండవిస్తున్నాయి. సుఖ సౌఖ్యాలను ఈ రాశివారు అనుభవిస్తారు. దైవబలంలో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అలాగే ముఖ్యమైన పని కోసం పెద్దలను కలుస్తారు. ఆ ఫలితం అనుకూలంగా అనుకూలంగా వస్తుంది. శనీశ్వరుడి ధ్యానం చేస్తే ఫలితం ప్రయోజనకరంగా ఉంటుంది.
కన్య రాశి: ఈ రాశికి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారంతో కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. మన అనుకున్న వాళ్లే మనల్ని తప్పుదోవ పట్టించే అవకాశముంది. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. దుర్గానామాన్ని జపిస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
తుల రాశి: ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి. ఒక శుభవార్త ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ప్రారంభించిన పనులను సత్వరంగా పూర్తి చేయడంతో పాటు, చేపట్టే ప్రయాణాలు కూడా అనుకూలంగా పూర్తవుతాయి. ఇష్ట దైవాన్ని పూజిస్తే మంచిది.
వృచ్చిక రాశి: ఈ రాశి వారు నేడు చేపట్టే ప్రయాణాల్లో జాగ్రత్త వహించాల్సిన అవసరముంది. ఒక సమస్య ఈ రాశివారి మానసిక ప్రశాంతతను భంగం కలిగించడంతో పాటు ఒక వార్త బాధ కలిగిస్తుంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ స్వధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. శ్రీసుభ్రమణ్య భజంగ స్తోత్రం చదవడం మంచిది.
ధనుస్సు రాశి: ఈ రాశికి నేడు జరిగే కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీ బుద్ధి బలంతో కీలకమైన వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఈరోజు ప్రయాణాలు చేపట్టకపోవడం మంచిది. ఒకవేళ ప్రయాణాలు చేపట్టాల్సి ఉంటే.. జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. శ్రీసుభ్రమణ్య భజంగ స్తోత్రం చదవడం మంచిది.
మకర రాశి: ఈ రాశి వారికి నేడు కష్టాలు దాపురించే అవకాశముంది. అందుకే కష్టాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరముంది. పలు అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. చంచల స్వభావాన్ని దరిచేయనివ్వకపోవడం ఉత్తమం. శ్రీరామ నామాన్ని జపిస్తే శుభాలు జరుగుతాయి.
కుంభ రాశి: ఈ రాశి వారు మానసికంగా ధృడంగా ఉంటారు. పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొనడంతో, బంధు మిత్రులతో కలిసి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మంచిది.
మీన రాశి: ఈ రాశి వారికి అంతా శుభకాలమే నడుస్తోంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తాయి. స్థిరమైన బుద్ధితో వ్యవహరించి కొన్ని వ్యవహారాల్లో మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఎలాంటి ఆపద సమయంలోనైనా.. సకాలంలో సహాయం చేసేవారు ఉంటారు. శివారాధన చేయడం శుభదాయకం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











