Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
జ్యోతిష్యంలోనే అత్యంత అదృష్టమైన రోజు, ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు ఎవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఎవరికి ఏ విధమైన ఫలితాలు వస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారికి అస్సలు అనుకూలంగా లేదు. ఈ రోజు ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం బలహీనంగా ఉంటుంది. గందరగోళం కారణంగా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. మీరు పనిపై ఎక్కువ దృష్టి పెట్టడానికి ప్రయత్నించాలి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

వృషభ రాశి
ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టడం మంచిది. మీ కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. పనితో పాటు వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలి. దీని ద్వారా ఈ రాశికి చెందిన వారి జీవితంలో చాలా అనుకూలమైన మార్పులను చూసే అవకాశం ఉంటుంది.
మిథున రాశి
ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారి కష్టానికి తగిన ప్రతిఫలందొరుకుతుంది . మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సొంతంగా తీసుకోండి. మరొకరు చెప్పినట్టు తీసుకోకండి.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వారు కొంత బద్ధకంగా ఉండొచ్చు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఆరోగ్య సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. విశ్రాంతిపై దృష్టి సారిస్తే ఉల్లాసాన్ని పొందగలుగుతారు, ఆర్థికంగా ఈ రోజు చాలా బాగుంటుంది.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా అంత అనుకూలంగా లేదు. అయితే దీని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. మరొకరి సహాయం అడగడానికి వెనుకాడకండి. పనిపై ఎక్కువ దృష్టి పెట్టండి.
కన్య రాశి
ఈ రోజు ఈ రాశి వారు మీ సామర్థ్యాలను అగౌరపరచకండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. అలాగే మీరు విశ్వాసంతో సవాళ్లను సులభంగా అధిగమించగలరని గుర్తుంచుకోండి. ఈరోజు ఈ రాశి వారు ఆర్థికంగా బలంగా ఉంటారు.
తుల రాశి
ఈ రాశి వారికి ఈరోజు అనవసర చింతలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి. మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. లేకపోతే పెను సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానంపై దృష్టి పెట్టండి.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశివారు ఒంటరిగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు నచ్చిన వాటిపై దృష్టి పెట్టండి. అది మీ మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఎలాంటి పనినైనా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రియమైనవారితో సమయం గడపడం మంచిది.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు అనేక పనులపై దృష్టిపెట్టే బదులు, తమ పనిపై ద్రుష్టి పెట్టడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సవాళ్ళను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. అవి మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.
మకర రాశి
ఈ రాశి వారికి ఈరోజు మంచి రోజు కాబోతుంది. ఈ రాశి వారు ఆరోగ్యంపై దృష్టి పెడతారు. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు. మీకు అత్యంత ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టాలి. అనవసరమైన చింతలకు దూరంగా ఉండండి.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశి వారికి చాలా అనుకూలమైన రోజు. ఈ రాశి వారు ఈరోజు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి కూడా ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. పెట్టుబడి విషయంలో కూడా ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది.
మీన రాశి
ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కానీ వాటిని సహనంతో పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. తద్వారా వారు సంతోషంగా ఉంటారు. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications