Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈరోజు ప్రేమసంబంధాలు ఏ రాశివారికి ఎలా ఉన్నాయంటే..!
ఈ రోజు మీ జీవితంలో ప్రేమ, పెళ్లి బంధాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వివిధ రాశుల వరికి ప్రత్యేకంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎవరికి ఈరోజు ప్రమ చిగురిస్తుందో ఎవరి ప్రేమబంధాల్లో సంతోషంగా ఉండగలుగుతారో చూద్దాం.
మేషము
మీ ఇద్దరి బంధానికి సంబంధించిన బంధువులతో ఎవైనా గొడవలు, మనస్పర్ధలు ఉన్నా అవి ఈరోజు సమసిపోతాయ్. మిమ్మల్ని ప్రేమించే వారి నుంచి ఈ రోజు వ్యక్తిగత విషయాల్లో సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. పాత స్నేహితులు మీకు తారసపడతారు. ఎలాంటి గడవలు లేకుండా మీ బంధం ప్రేమపూర్వకంగా జరిగిపోతుంది.
వృషభము
ప్రేమ, బంధం విషయంలో ఆచితూచి అడుగువేయవలసి ఉంటుంది. సెంటిమెంట్లకు ఈరోజుక ప్రాధానత్యకు కొంత తగ్గించి దూరంగా ఉండండి. మిమ్మల్ని ప్రేమించినవారిని స్మరించుకొని వారిని బాధపెట్టవద్దు. ఎలా జరగేవాటిని అలా సహజంగా జరగనిస్తే ఈరోజు సంతోషాన్ని అనుభవిస్తారు. ఇంటి సమస్యలపై ఫోకస్ పెట్టి పరిష్కారానికి ప్రయత్నించండి.

మిథునం
మీ ఇద్దరి బంధం మరింత బలపడి సంతోషంగా ఉంటారు. ఆ ఆనందాన్ని కుటుంబసభ్యలతో పంచుకోండి. రక్తసంబంధాలకు ప్రాధాన్యతనివ్వండి. మిమ్మల్ని ప్రేమించిన వారితో సమయాన్ని కేటాయించండి. చాలా మందిని ప్రభావితం చేయగలుగుతారు.
కర్కాటకము
బంధువులతో సమావేశాలు ఉంటాయ్. ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయ్. స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. విలువైన బహుమతులు పొందుతారు. ప్రేమించిన వారి కోసం మీరు చేసిన కృషికి ఫలితం దక్కుతుంది. కుటుంబ సభ్యులకు ప్రాధాన్యతనిస్తారు.
సింహరాశి
ప్రతిఒక్కరితో కలిసిపోతారు. మీకు ఈ రోజు అందరి సహకారం ఉంటుంది. ఎమోషనల్ విషయాలపై సున్నితంగా వ్యవహరిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బంధాల్లో గతంలోకంటే మెరుగు కనిపిస్తుంది. దగ్గరి బంధువులు, స్నేహితుల నుంచి సహకారాన్ని పొందుతారు. కొత్తస్నేహితులు కలుస్తారు. సమావేశాల్లో మీకు ప్రాధాన్యత పెరుగుతుంది.
కన్య
మృదువుగా మాట్లాడి పనులు చేయించుకుంటారు. ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు తీసుకోవచ్చు. బంధాల్లో ఓపిక సహనాన్ని ప్రదర్శిస్తారు. ఎమోషన్స్‌ను అదుపులో పెట్టుకుంటారు. ప్రతికూల సంఘటనలపై అప్రమత్తంగా ఉంటారు.
తుల
మీ బంధంలో ఈ రోజు ప్రేమ, గౌరవం, అర్ధం చేసుకోవడం ఉంటాయ్. ప్రయాణాలు చేస్తారు. మంచి వార్తలను వింటారు. మీ భాగస్వామితో ప్రేమబంధం మరింత పెరుగుతుంది. అదృష్టం ఈరోజు మీవెంటే వుంటుంది. స్నేహితులపై మీకు నమ్మకం పెరుగుతుంది. మనసుకు సంబంధించిన విషయాలపై చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
వృశ్చికము
ప్రేమించిన వారితో సంతోషాలను పంచుకుంటారు. వ్యక్తిగత విషయాలపై ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. బంధాలు బలపడతాయ్. బంధువలుతో సంతోషంగా గడుపుతారు. మీకు అనువైన మంచి సమాచారాన్ని బంధువుల నుంచి అందుకుంటారు.
ధనుస్సు
కుటుంబ సభ్యులకు సహకారాన్ని అందిస్తారు. వ్యక్తిగత విషయాలపై చురుగ్గా నిర్ణయం తీసుకుంటారు. ప్రేమకు సంబంధించిన బంధం మెరుగుపడుతుంది. స్నేహితులకు ఎక్కువ ప్రధాన్యతనిస్తారు.
మకరము
కుటుంబసభ్యులకు చెప్పిన విషయాలకు ప్రధాన్యతనివ్వండి. ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. వ్యక్తిగత అంశాలపై జోక్యాన్ని సహించరు. కుటుంబ సభ్యుల సహకారాన్ని అందిస్తారు. మంచి అవకాశం కోసం ఎదురుచూడండి. మీ భావోద్వేగాలను అదుపులో వుంచచుకోండి. మాటలను కొంత అదుపులో వుంచుకుంటే సంతోషంగా ఉండగలుగుతారు.
కుంభమ
మీ దగ్గరివారితో మృదుసంభాషణ ఉంటుంది. మీకు సంతోషం కలిగించే సమాచారాన్ని అందుకుంటారు. మీ జీవితభాగస్వామి మీకు సహకారంగా ఉంటారు. స్నేహితుల సపోర్ట్ ఉంటుంది. భావోద్వేగాలను ప్రకటించకుండా కొంత అదుపులో ఉంటే బాగుంటుంది. మీ బంధాల్లో మెరుగుదల కనిపిస్తుంది.
మీనము
మాట్లాడుతున్న విషయాల్లో స్పష్టత ఉండాలి. ముఖ్యమైన విషయాల్లో తరువాత మాట్లాడవచ్చని వాయిదాలు వేయవద్దు. వ్యక్తిగత విషయాలకు ప్రధాన్యనివ్వాలి. ప్రతి ఒక్కరికి గౌరవ మర్యాదలు ఇవ్వండి. జరుగుతున్న విషయాలపై అప్రమత్తంగా ఉండాలి. రిలేషన్‌షిప్‌లో బ్యాలెన్సింగ్ మెయింటేన్ చేయాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications