Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మౌని అమావాస్య నుంచి ఈ రాశుల వారికి అంతా అదృష్టమే
ఈరోజు మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య సందర్భంగా ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఏ రాశి వారికి ఈరోజు బాగుంటుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేషరాశి
ఈరోజు ఈ రాశి వారికి చాలా శుభప్రదమైనది. ఈ రోజు డబ్బు విషయంలో వీరికి కొంత ఇబ్బందులు ఉండొచ్చు. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. కుటుంబ జీవితం బాగుంటుంది. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధాలు బాగుంటాయి.

వృషభం
మౌని అమావాస్య సందర్భంగా ఈ రాశి వారికి కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. మతపరమైన విషయాల పట్ల ఈరోజు ఎక్కువ మొగ్గు చూపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
మిథునం
ఈ రోజు ఈ రాశి వారికి చాలా మంచిది. పని విషయంలో ఈ రోజు వీరికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇంట్లో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. ప్రస్తుత ఉద్యోగం నుంచి మార్పు కోరుకుంటే ఈ రాశి వారికి ఈరోజు అది కలిసివస్తుంది.
కర్కాటక
ఈ రాశి వారికి ఈరోజు చాలా ఖర్చులు ఉంటాయి. ఆర్థికంగా ఈ రోజు చాలా బాగుంటుంది. వ్యాపారులకు మంచి లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది.
సింహ రాశి
ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఉండే అవి పరిష్కారం కాకపోవచ్చు. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించండి. ఉద్యోగార్ధులకు త్వరలో శుభవార్త అందుతుంది.
కన్యా రాశి
ఈ రోజున ఈ రాశి వారికి అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య అనుబంధం బాగుంటుంది. ఈరోజు ఎలాంటి పనినైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్ధిక పరమైన విషయాలు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది.
తులారాశి
తులారాశివారికి ఈ రోజు శుభప్రదం. మీకు, మీ భాగస్వామి మధ్య మనస్పర్థలు ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా ఈ రోజు ఈ రాశి వారికి మంచిదే. మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే, అవి ఈరోజు తిరిగి వచ్చేస్తాయి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారు ఈరోజు తమ మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, లేకపోతే కుటుంబంలో అనుకోని సమస్యలు, గొడవలు రావచ్చు. వ్యాపారులకు ఈ రోజు ఆర్థికంగా మంచిది. త్వరలో ఇంట్లో శుభ కార్యం జరుగుతుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మంచిది. మీరు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినట్లయితే, మీరు దానిని తిరిగి పొందగలుగుతారు. మీరు కారు కొనాలని ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మకర రాశి
ఈరోజు మీరు ఓపికగా ఉండాలి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. ఈరోజు ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు చేయాలనుకుంటే.. దస్తావేజు విషయంలో జాగ్రత్తగా ఉండండి, మీ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి.
కుంభ రాశి
ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది, కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే అది పరిష్కరించబడుతుంది. అనవసర విషయాల గురించి చింతించకండి, కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది.
మీనం
ఈరోజు మీనరాశి వారికి శుభప్రదమైన రాశి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, అవి నయమవుతాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మొత్తంమీద ఈ రోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications