Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
దీపావళి రోజు ఏర్పడనున్న అరుదైన యోగం.. ఆ రాశుల వారి అదృష్టానికి ఇక అడ్డు ఉండదు!
జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గమనం అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండవు. తరచుగా అవి రాశులు మారుతూ, అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. అలా ఒక రాశి లోనుంచి మరొక రాశిలో గ్రహాలు తమ గమనాన్ని మార్చుకున్నప్పుడు పలు రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారికి శుభఫలితాలు కలిగితే, మరికొన్ని రాశుల వారికి చాలా తీవ్రమైన నష్టకాలం నడుస్తుంది.
అయితే ఈనెల 31 నుంచి గురు, శని గ్రహాలు తమ గమనాన్ని మార్చుకోనున్నాయి. దీని కారణంగా దీపావళి నాడు ఒక అరుదైన యోగం ఏర్పడనుంది. ఈ యోగం కారణంగా ఏ రాశి వారికి అనుకూలమైన కాలం ఉండనుంది, ఏ రాశి వారిపై ప్రతికూల ఫలితాలు ఏర్పడనున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ముందుగా యోగం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం..
గ్రహాలు తమ రాశులను వదిలి వేరొక రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ప్రస్తుతం శనీశ్వరుడు తన రాశి అయిన కుంభరాశిలో, గురు వృషభ రాశిలో తిరోగమనం చేస్తున్నారు. ఈనెల 31న ఈ గ్రహాలు తమ రాశిని మార్చుకోనున్నారు. దీని కారణంగా ఈ అరుదైన దీపయోగం ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశుల వారికి అదృష్టం వరించనుంది. ఆ రాశులు ఏమిటంటే..

వృషభ: దీపావళికి ఏర్పడే ఈ దీపయోగం కారణంగా.. వృషభ రాశి వారికి విశేషమైన అదృష్టం పట్టనుంది. ఈ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. దీంతోపాటు ఆర్ధిక రాబడి పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఉద్యోగులకు ఈ కాలంలో అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఒత్తిడిని జయించి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. వ్యాపార రంగాల వారికి ఊహించని లాభాలు వచ్చిపడతాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం దొరకనుంది.
ధనుస్సు: గురు, శని గ్రహాల తిరోగమన సంచారం కారణంగా ఏర్పడనున్న ఈ దీపయోగం కారణంగా ధనుస్సు రాశి వారికి అదృష్ట యోగం జిడ్డు పట్టుకోనున్నట్లు పట్టుకోనుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఊహించని స్థాయిలో లాభాలు వస్తాయి. మీ మీ రంగాల్లో మీ పనితీరుకు ప్రశంసలు లభించనున్నాయి. ఆదాయం పెరగడంతో సమాజంలో గుర్తింపుతో పాటు సమస్యలు తొలగనున్నాయి.
కుంభ రాశి: ఈ రాశికి అధిపతి అయిన శనీశ్వరుడు, అలాగే గురు గ్రహాల తిరోగమనం కారణంగా ఏర్పడే దీపయోగంతో ఈ రాశివారికి అన్ని సమస్యలు తొలగిపోనున్నాయి. ఆదాయ మార్గాలు పెరగడంతో సంపద పెరుగుతుంది. ఆర్ధిక సమస్యలన్నీ దూరమవుతాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది కుంభరాశి వారికి తిరుగులేని కాలంగా చెప్పుకోవచ్చు. చేపట్టిన అన్ని పనులు విజయవంతం అవడంతో పాటు.. అనుకున్న విధంగానే ప్రణాళిక ప్రకారంగా లక్ష్యాలను చేరుకుంటారు.
గమనిక: జోతిష్య శాస్త్రం మనకు తెలిపిన వివరాలు మనలో ఆత్మవిశ్వాన్ని నింపు ఆవైపుగా నడిచే విధంగా ఉంటుంది. అలానే కూర్చొని ఉంటే ఏదీ కాదు. అందుకే పైన పేర్కొనబడిన అంశాలు జోతిష్య శాస్త్రం, నిపుణుల సమాచారం మేరకు అందించబడింది. దీనిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications