Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
ఈ ధనత్రయోదశికి ఇవి కొంటే..సంపద 13 రెట్లు పెరుగుతుందట..ఇల్లు,కారు,బంగారం,స్థలాలు కొనడానికి శుభముహూర్తాలు
హిందువులు జరుపుకునే అతిముఖ్యమైన పండుగైన దీపావళి పండుగ సందడి ధన్ తేరాస్ తోనే స్టార్ట్ అవుతుంది. దీనిని ధనత్రయోదశి అని కూడా పిలుస్తారు. ఐదు రోజుల దీపావళి ఉత్సవాల్లో ఇది రెండవ రోజు. ధనత్రయోదశి సమయంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల కొనుగోలకు జనం ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. బంగారం,వెండి ధరలు రోజు రోజుకీ కొండెక్కుతున్నప్పటికీ తాము ఆదా చేసిన డబ్బులు కనీసం ఒక చిన్న వెండి వస్తువైనా కొనాలని చాలామంది భావిస్తారు.
అయితే కేవలం ఆభరణాలే కాకుండా కొత్త వాహనాలు, ఇళ్లు,స్థలాలు,పొలాలు వంటి స్థిరాస్థులను కొనటానికి కూడా ధనత్రయోదశి సమయాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ధన్ తేరాస్ రోజున చేసే కొనుగోళ్లు ఇంట్లోకి లక్ష్మీదేవిని తీసుకొస్తాయని,సిరిసంపదలను వృద్ధి చేస్తాయని ప్రగాఢంగా నమ్ముతారు.

ఈ ఏడాది ధనత్రయోదశి ఎప్పుడు, దీని వెనుక కథ ఏంటీ?
ప్రతి ఏటా అశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష త్రయోదశి తిథి రోజున ధన్ తేరాస్ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అక్టోబర్ 18న మంగళవారం ఈ పండుగ వస్తుంది. పురాణాల ప్రకారం దేవుళ్లు,రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేస్తున్నప్పుడు ఆరోగ్యానికి అధిపతి అయిన ధన్వంతరి స్వామి చేతిలో అమృత కలశంతో ఇదే రోజున ఉద్భవించాడు. అందుకే ఈ రోజున ధన్వంతరిని పూజించడం వల్ల ఆయురారోగ్యాలు లభిస్తాయని నమ్మకం. ఇదే రోజున సంపదకు అధిపతి అయిన కుబేరుడు, ఐశ్వర్య ప్రదాయిని అయిన లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. ఈ రోజున ఏది కొన్నా అది పదమూడు రెట్లు వృద్ధి చెందుతుందని ఒక నమ్మకం. లక్ష్మీదేవి మన ఇంటికి ఆకర్షితురాలై, స్థిరంగా నివసిస్తుందని, పేదరికాన్ని తొలగిస్తుందని కుటుంబానికి శ్రేయస్సును అందిస్తుందని భావిస్తారు.
ధనత్రయోదశి 2025 వివరాలు
తేదీ: అక్టోబర్ 18, 2025 (శనివారం)
ధనత్రయోదశి తిథి ప్రారంభం: అక్టోబర్ 18, 2025 మధ్యాహ్నం 12:18 గంటలకు.
ధనత్రయోదశి తిథి ముగింపు: అక్టోబర్ 19, 2025, మధ్యాహ్నం 01:51 గంటలకు
ధనత్రయోదశి పూజ ముహూర్తం (ప్రదోష కాలం): సాయంత్రం 07:16 నుండి 08:20 వరకు
ఏమేం కొంటే మంచిది
ధనత్రయోదశి నాడు బంగారు,వెండి ఆభరణాలు లేదా నాణేలు కొనడం శ్రేష్ఠం. వీటితో పాటు ఇత్తడి, రాగితో చేసిన వస్తువులు,వంటసామాగ్రిని కొనుగోలు చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున కొత్త చీపురు కొనడం ద్వారా ఇంట్లోనే ప్రతికూల శక్తులను, దరిద్రాన్ని తరిమేయవచ్చని నమ్ముతారు. ధనియాలను కొని పూజలో ఉంచాక వాటిని పొలంలో లేదా కుండీలో చల్లితే ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదని పండితులు చెబుతారు.
కొనుగోళ్లకు శుభ ముహూర్తాలు
ధనత్రయోదశి రోజున మాత్రమే కాకుండా ఈ నెల మొత్తంలో కొనుగోళ్లకు అనుకూలమైన శుభదినాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం,వెండి,ఇత్తడి వంటి లోహాలు కొనడానికి మంచి రోజులు: అక్టోబర్ 7, అక్టోబర్ 10, అక్టోబర్ 12, అక్టోబర్ 13, అక్టోబర్ 15, అక్టోబర్ 17, అక్టోబర్ 18, అక్టోబర్ 19 తేదీలు విలువైన లోహాలను కొనుగోలు చేయడానికి చాలా అనుకూలమైనవని చెబుతున్నారు.
వాహనాలు, ఇల్లు లేదా ఆస్తులు కొనడానికి మంచి రోజులు: అక్టోబర్ 16, అక్టోబర్ 17, అక్టోబర్ 18, అక్టోబర్ 19, అక్టోబర్ 23, అక్టోబర్ 24 తేదీలు శుభప్రదమైనవిగా జ్యోతిష్కులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications