Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీరు మంగళవారం జన్మించారా?.. అయితే మీలో ఉన్న ఈ సీక్రెట్ లక్షాణాలను తెలుసుకోండి!
వార చక్రంలో రోజుకూ ప్రత్యేకత ఉంటుంది. ఏ వారం పుట్టినా ఆ వారానికి సంబంధించిన ప్రత్యేకతలు కలిగి ఉంటారు. ఒక వ్యక్తి భవిష్యత్తు అతను పుట్టిన తేదీ, రాశి చక్రం ఎంత ముఖ్యమో.. ఆయన పుట్టిన రోజు కూడా అంతే ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అన్ని వారాలలో కంటే మంగళవారం పుట్టిన వ్యక్తులపై అంగారకుడి అనుగ్రహం ఎక్కువగా కనిపిస్తుంటుంది. గ్రహాల పాలకుడిగా పిలవబడే అంగారకుడి అనుగ్రహం కారణంగా.. మంగళవారం జన్మించిన వారిలో కొంత దూకుడు ఎక్కువగా ఉంటుంది. అయితే వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? భవిష్యత్తులో ఎలాంటి స్థానాలు ఎదగలుగుతారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మంగళవారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం
మంగళవారం.. వారంలో మూడవ రోజు. మంగళవారం జన్మించిన వారు యుద్ధ దేవుడైన అంగారకుడిచే పాలించబడతారు. మంగళవారం జన్మించిన వ్యక్తులు పోరాట పటిమ, సంకల్పం కలిగి ఉంటారు. వారు ఎల్లప్పుడూ పెద్ద పెద్ద బాధ్యత వహించాలని, అలాగే విజేతగా ఉండాలని కోరుకుంటారు. వారి ప్రధాన లక్షణాలు నిగ్రహం, చురుకైన స్వభావం, ఉత్సాహభరితమైన శక్తి, ధైర్యం. వారు ఎల్లప్పుడూ విజయం సాధించడానికి ప్రయత్నిస్తుంటారు.

మంగళవారం జన్మించిన అమ్మాయిల స్వభావం
మంగళవారం జన్మించిన వారి శరీర నిర్మాణం చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉంటుంది. వారి ముఖాల్లో ప్రత్యేక గ్లో ఉంటుంది. మంగళవారం జన్మించిన వారు గిరజాల జుట్టు, పొడవాటి మెడ, విశాలమైన భుజాలు కలిగి ఉంటారు. మంగళవారం జన్మించిన వారి ముఖంపై చిన్న పుట్టుమచ్చలు ఉంటాయి. మంగళవారం పుట్టిన వారు కాస్త నల్లగా, గోధుమరంగు రంగుతో ఉంటారు.
వృత్తి జీవితం
మంగళవారం జన్మించిన వ్యక్తులు అధిక నిర్ణయాత్మక నైపుణ్యాలను కలిగి ఉంటారు. అతి పెద్ద సమస్యలను కూడా క్షణాల్లో పరిష్కరించగల సామర్థ్యం వీరికి ఉంటుంది. వీరు చాలా తెలివైన, పదునైన మనస్సు కలిగి ఉంటారు. వారి వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. తమ పనులను చక్కగా నిర్వహించడం తెలిసిన వ్యక్తులు. కాబట్టి వారికి ఆఫీసులో, కుటుంబంలో పెద్ద బాధ్యతలు అప్పగిస్తారు. మంగళవారం జన్మించిన వారు మెకానికల్ పనిని, శారీరక బలంతో కూడిన పనులను చాలా త్వరగా నేర్చుకుంటారు. అలాగే చాలా జాగ్రత్తగా చేయడం ద్వారా వారు జీవితంలో పైకి ఎదుగుతారు.
ఆరోగ్యం
మంగళవారం జన్మించిన వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. వీరు చాలా తక్కువ ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. మంగళవారం పుట్టిన వారికి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే నయమవుతుంది. వారికి తరచుగా గాయాలు, ప్రమాదాలు వంటివి సంభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సంబంధాలు
మంగళవారం జన్మించిన వ్యక్తులు వారి స్నేహితులు, బంధువులతో సాధారణ సంబంధాలు కలిగి ఉంటారు. వారి కోపం కారణంగా, వారి సంబంధాలలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి. వారిని బాగా అర్థం చేసుకున్న వారికి వారితో అనుబంధం మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. చాలా అందమైన, ఆకర్షణీయమైన జీవిత భాగస్వామిని పొందినప్పటికీ, వారి జీవితంలో ఏదో ఒక సమస్య కొనసాగుతుంది.
అదృష్ట సంఖ్య
మంగళవారం జన్మించిన వారికి 9వ నంబర్ అదృష్ట సంఖ్య. 9వ తేదీన ఏదైనా శుభ కార్యం లేదా కొత్త కార్యం ప్రారంభిస్తే వారికి విజయాన్ని చేకూరుస్తుంది. వారు పేదలకు దానం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అలాగే జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన వారికి సహాయపడగలరు. ఎరుపు రంగు వీరికి అదృష్ట రంగు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications