Latest Updates
-
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.!
ధనలాభం, అష్టైశ్వర్యాలు పొందాలంటే..దీపావళి రోజున వాస్తు ప్రకారం ఇలా చేయండి
చీకటిని పారద్రోలి జీవితంలో వెలుగులను పంచే దీపావళి పండుగ వచ్చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 20న దీపావళి పండుగ జరుపుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవి, గణపతి పూజ.. పిండి వంటలు,స్వీట్స్..సాయంత్రం బాణసంచా కాల్చడం..రావణ దహనవ చేయడం మనకు తెలిసిన విషయం. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం దీపావళి నాడు కొన్ని నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో అదృష్టం పడుతుందని పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం దీపావళి రోజున పాటించాల్సిన నియమాలు ఏంటో ఇక్కడ చూడండి.
ప్రధాన ద్వారం దగ్గర ఇలా చేయాలి
దీపాలు వెలింగించే దిశ
ఇంట్లో దీపాలను వెలిగించే దిశ కూడా చాలా ముఖ్యం. ఇంటికి ఆగ్నేయ దిశలో దీపాలు వెలిగించడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు వృద్ధి చెందుతాయి. అలాగే ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలను ఉంచి, ఉత్తర దిశలో ఎక్కువ దీపాలను వెలిగించడం ద్వారా కుబేర స్థానాన్ని ఉత్తేజపరిచి ఆర్థిక అభివృద్ధిని పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు.

బీరువా ఇక్కడ ఉంచాలి
డబ్బులు, జ్యూవెలరీ, బట్టలు వంటివి బీరువాలో లేదా సేఫ్ లో పెట్టుకుంటాం. కాబట్టి బీరువా లేదా సేఫ్ ను ఇంటికి దక్షిణ దిశలో ఉండే గోడకు ఆనించి దాని తలుపు ఉత్తరం వైపు తెరుచుకునేలా సెటప్ చేయండి. ఇలా చేస్తే సంపద స్థిరంగా ఉండి, వృథా ఖర్చులు తగ్గిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
చీపురు
చీపురును లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠా దేవిగా భావిస్తారు. అందుకే దానిని ఎప్పుడూ కనపడని ప్రదేశంలో నైరుతి దిశలో నిలబెట్టి ఉంచాలి. దీపావళికి ముందు పాత చీపురును మార్చి కొత్తది వాడటం శుభప్రదంగా చెబుతారు.
ప్రధాన ద్వారం
ఏ ఇంటికి అయిన ప్రధాన ద్వారం ఉంటుంది.లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించే ముఖద్వారం ఇది. కాబట్టి ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా,కళకళలాడుతూ ఉంచుకోవాలి. అందమైన రంగోలితో అలంకరించి, మామిడి ఆకులు, బంతిపూలతో కట్టిన తోరణాన్ని వేలాడదీయండి. ద్వారానికి రెండువైపులా స్వస్తిక లేదా శుభ్ లాభ్ వంటి శుభ చిహ్నాలను ఉంచడం ద్వారా అమ్మవారికి మీ ఇంట్లోకి ఆహ్వానం పలకండి.
ఇంట్లో ఈ వస్తువులు ఉంచవద్దు
వాస్తుశాస్త్రం ప్రకరం ఇంట్లో పగిలిపోయిన,పాడైపోయిన వస్తువులు గడియాలు, ఎలక్ట్రానిక్ సామాను వంటివి ఉంటే వాటన్నింటిని బయట పడేయాలి. ఇల్లు అనేది ఎంత క్లీన్ గా ఉంటే పాజిటివ్ ఎనర్జీఅంతగా ప్రవహిస్తుందని పండితులు చెబుతారు.

తులసి మొక్కతో శుభప్రదం
తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. మీ ఇంటికి ఈశాన్య దిశలో తులసి మొక్క పెట్టి నిత్యం పూజించడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి వాస్తు దోషాలు తొలగిపోతాయి.
శంఖాన్ని, గంటను వాయించడం
పూజ సమయంలో శంఖాన్ని, గంటను వాయించడం వల్ల వాటి నుంచి వెలువడే పవిత్ర ధ్వనులు ఇంట్లోని నెగిటివ్ శక్తులను నాశనం చేస్తాయి. తాజా బంతి, తామర పువ్వులతో ఇంటిని అలంకరించడం వల్ల సువాసనలతో పాటు శుభకరమైన వాతావరణం నెలకొంటుంది.
మంత్రోచ్ఛారణతో మానసిక ప్రశాంతత
దీపావళి రోజున ఉదయం, సాయంత్రం శ్రీ సూక్తం లేదా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీయై నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభించి, అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications