Latest Updates
-
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు! -
సూర్యగ్రహణం 2026..గ్రహణానికి ముందు, తర్వాత చేయాల్సిన పనులివే! -
డ్రై ఫ్రూట్స్ రోజుకు ఎన్ని తినాలో తెలుసా? ఆ తప్పు చేస్తే ప్రమాదమే! -
డెలులు డేటింగ్.. మీరూ ఇలాంటి భ్రమల్లో బతుకుతున్నారా.? -
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి?
మరొకరి ఇంటి నుంచి ఈ 3 వస్తువులు అస్సలు తెచ్చుకోకండి..తెస్తే సర్వ నాశనమే
సాధారణం మనం మన చుట్టాలు లేదా ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్లినప్పుడు లేదా వాళ్లు మన ఇళ్లకు వచ్చినప్పుడు అనేక వస్తువుల మార్పిడి జరుగుతుంది. అంటే వాళ్లు మనకు కొన్ని వస్తువులు తీసుకెళ్లండి అని ఇస్తుంటారు..లేదా మనమే ఇవి తీసుకోండి అని వాళ్లకి ఇవ్వడం వంటివి జరుగుతుంటాయి. ఇలా ఒక వ్యక్తి తన దైనందిన జీవితంలో పరిచయస్తులతో అనేక విషయాలను మార్పిడి చేసుకుంటాడు. అయితే మరొకరి ఇంటి నుంచి 3 వస్తువులను మాత్రం అసలు ఎప్పటికీ మీ ఇంటికి తెచ్చుకోకూడదు. పొరపాటున అవి మీ ఇంట్లోకి వస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుంది.
జ్యోతిష్యం, గ్రంధాలలో తెలిపిన విషయాలు జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. కొన్నిసార్లు తెలిసో, తెలియకో చేసే తప్పు వ్యక్తి నాశనానికి కారణం అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇతరుల ఇళ్ల నుంచి తీసుకొచ్చే కొన్ని వస్తువులు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఉపయోగించే వస్తువులు అతని శక్తి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఒక వస్తువు యాజమాన్యాన్ని మార్చడం ద్వారా దాని శక్తి కూడా మారుతుంది. కాబట్టి ప్రతికూల శక్తి ప్రభావం ఎక్కువగా ఉండే వాటిని ఎవరి ఇంటి నుంచి తీసుకురావద్దు. నెగెటివ్ ఎనర్జీ ఇంటికి వచ్చి వాస్తు దోషాలను కలిగిస్తుంది.

మరొకరి ఇంటి నుండి తీసుకురాకూడని వస్తువులు
చెప్పులు,బూట్లు
చాలా సార్లు మనం ఎవరి ఇంటికైనా వెళ్లిన సందర్భంలొ ఇతరుల చెప్పులు వేసుకుంటుంటాం..అయితే ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే శరీరం నుండి నెగిటివ్ ఎనర్జీ బయటకు వచ్చే మొదటి ప్రదేశం పాదాలే. మీరు ఇతరుల బూట్లు, చెప్పులు ధరించినప్పుడు వాళ్ల నెగిటివిటీ కూడా మీలోకి ప్రవేశించి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.
పాత ఫర్నిచర్
మరొకరి ఇంటి నుంచి పాత ఫర్నిచర్ ఇంటికి తీసుకురావద్దు. ఇలా చేస్తే మీరు పేదరికాన్ని ఆహ్వానించినట్లే.. సంతోషకరమైన కుటుంబం నాశనం అవుతుంది
గొడుగు
వేరొకరి ఇంటి నుండి గొడుగు తీసుకురావడం శ్రేయస్కరం కాదు. ఇలా చేయడం వల్ల గ్రహాల స్థితి క్షీణిస్తుంది. కొన్ని కారణాల వల్ల వేరొకరి ఇంటి నుండి గొడుగు తీసుకురావాల్సి వచ్చినప్పటికీ దానిని ఇంటి లోపలకి తీసుకురావద్దు. దానిని ఉపయోగించిన తర్వాత తిరిగి ఇవ్వడం మంచిది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications