ఆఫీస్‌ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?

ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక చాలా మంది తమ బ్యాగులను ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. ఒక్కోసారి అలసట, కోపంతో విసిరేస్తుంటారు. కొన్నిసార్లు వచ్చీరాగానే నేలపై పెట్టేస్తారు. అయితే దీన్ని చాలా మంది సాధారణ విషయంగా భావిస్తారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేయడం మీకు వ్యక్తిగతంగా, కెరీర్‌ పరంగా మంచిది కాదని వాస్తు నిపుణులు అంటున్నారు. మరి బ్యాగ్‌ను ఎలా ఇంట్లో ఎలా పెట్టుకోవాలి.. పండితుల సలహాలు చూద్దాం..

Do not keep your office bag this way affects career and financial situation

ఆఫీస్‌ బ్యాగ్‌ అంటే కేవలం వ్యక్తిగత అవసరాలు తీర్చుకునేది కాదు. వాస్తు ప్రకారం ఇది మీ వృత్తి, ఆర్థిక స్థితి, విజయంతో ముడిపడి ఉంటుంది. ఇందులో ల్యాప్‌టాప్‌, ముఖ్యమైన డాక్యుమెంట్స్‌, ఐడెంటిటీ కార్డ్స్‌, డైరీ, పర్సు, డబ్బులు బుక్స్‌ ఇలా అవసరమైన వాటిని భద్రపరుచుకుంటాం. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికపరమైన కార్యకలాపాలతో ముడిపడి ఉంటుంది. ఈ క్రమంలో ఆఫీస్‌ బ్యాగులకు సంబంధించి వాస్తు సలహాలు చూద్దాం..

నేలపై పెట్టకండి..

ఆఫీసు నుంచి ఇంటికి రాగానే వెంటనే మీ బ్యాగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకండి. దానికి బదులుగా టేబుల్‌, కప్‌బోర్డు, షెల్ఫ్‌ లాంటి ఎత్తయిన ప్రదేశాల్లో ఉంచడం మంచిది. వాస్తు ప్రకారం బ్యాగ్‌ను నేలపై ఉంచినట్లయితే అది పాజిటివ్‌ ఎనర్జీకి ఆటంకం కలిగిస్తుంది. ఆర్థిక ఒడుదొడుకులు, పనిలో అడ్డంకులను కలిగించవచ్చు.

విపరీత రాజయోగం: అక్టోబర్‌ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!విపరీత రాజయోగం: అక్టోబర్‌ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!

ఆదాయంపై ప్రభావం

వాస్తు పండితుల సలహా ప్రకారం మీ ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన వస్తువులను గౌరవప్రదంగా, క్రమబద్ధంగా భద్రపరుచుకోవడం మంచిది. ఆఫీస్‌ బ్యాగ్‌ను నిర్లక్ష్యం చేసినట్లయితే అది ఆర్థికంగా అసమతుల్యతకి దారితీస్తుంది. మీ బడ్జెట్‌కి వ్యతిరేకంగా అనవసరమైన ఖర్చులు, పొదుపు లేకపోవడం, మీ కష్టానికి తగిన ఆర్థిక లాభాలు అందుకోలేకపోవచ్చు.

Do not keep your office bag this way affects career and financial situation

వృత్తిపరంగా ప్రభావం

వాస్తు ప్రకారం ఇంట్లో ఎత్తయిన ప్రదేశాలు పురోగతి, విజయానికి చిహ్నం. అందుకే ఆఫీస్‌ బ్యాగ్‌ను నేలపై కాకుండా ఎత్తులో ఉంచమని పండితులు సలహా ఇస్తున్నారు. అదేవిధంగా బ్యాగ్‌ను సరైన విధానంలో సర్దుకోవడం కూడా మీలో పాజిటివ్‌ ఎనర్జీని కలిగిస్తుంది. వృత్తిపరంగా పురోగతి అందిస్తుందని సూచిస్తున్నారు.

నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!

నెగిటివ్‌ ఎనర్జీ

ఆఫీస్‌ బ్యాగ్‌ను నేలపై ఉంచడం ద్వారా అది ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీకి దారితీస్తుంది. అందుకే రోజువారీ పనులకు ఉపయోగించే బ్యాగులు, ఇతరత్రా వాటిని నేలపై ఉంచకూడదు. ఈ అలవాటు ఇలాగే కొనసాగితే అది మీ సామర్థ్యం, ఆత్మవిశ్వాసంతో మానసికంగా మీ ఆలోచనలపై ప్రభావం చూపిస్తుంది.

మీకు ఆఫీస్‌ బ్యాగ్‌ను ఎలా పడితే అలా సర్దుకోవడం, పెట్టడం లాంటి అలవాటు ఉంటే ఇకనైనా ఆ అలవాటును మానుకోండి. ఇంట్లో భద్రంగా, నీట్‌గా ఉంచుకోవడంతో పాటు ఎత్తయిన ప్రదేశాల్లో ఉంచుకోండి. బ్యాగ్‌ మురికిగా మారినప్పుడు తరచూ శుభ్రం చేసుకోవడం ద్వారా మీలో పాజిటివ్‌ ఎనర్జీ పెరుగుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Sunday, September 6, 2026, 14:24 [IST]
Desktop Bottom Promotion