Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ 5 పనులు చేస్తే శనిదేవుడి ఆశిస్సులు..2025లో మీ అదృష్టం మామూలుగా ఉండదు
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం 2025లోకి ప్రవేశించబోతున్నాం. కొత్త సంవత్సరం ఎన్నో కొత్త అంచనాలను తెస్తుంది. కొత్త ఏడాది నుంచి తమకు అంతా మంచి జరగాలని అందరూ కోరుకుంటారు. అయితే కొత్త ఏడాదిలో మీ అదృష్టం మెరిసిపోవాలంటే, మీ పనులన్నీ సులభంగా పూర్తి కావాలంటే మీరు కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి.
హిందూ పురాణాల ప్రకారం శని దేవుడిని న్యాయానికి,కర్మలకు అధిపతిగా భావిస్తారు. అందుకే శని దేవుడంటే చాలా మంది భయపడతారు. శని దేవుడిని ఇష్టం లేని, కోపం తెప్పించే పనులను పొరపాటున కూడా చేయకూడదు. లేకుంటే శని ఆగ్రహానికి గురై ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే కొత్త ఏడాది 2025లో శనిదేవుడిని ప్రన్నం చేసుకొని అదృష్టం పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్త సంవత్సరంలో ఇలా చేస్తే అదృష్టం
ఆంజనేయస్వామికి కుంకుమ: శని దేవుడి కోపాన్ని నివారించడానికి శనివారం నాడు ఆంజనేయస్వామికి కుంకుమ సమర్పించండి. అలాగే హనుమాన్ చాలీసా పఠించండి. దీంతో శని దేవుడి కోపం నుండి రక్షించబడవచ్చు. మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడిని పూజించే భక్తుడు శని దేవుడి హింసను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.
శని దేవుడికి నువ్వులు,నూనె: ప్రతి శనివారం శని ఆలయంలో శని దేవుడి పాదాలకు నల్ల నువ్వులు, నూనె సమర్పించాలి. నూనె దానం చేయడం ఉత్తమమని నమ్ముతారు. దీని కోసం మీ ముఖాన్ని నూనె గిన్నెలో ముంచి,ఆ తర్వాత ఆ నూనెను అవసరమైన వ్యక్తికి దానం చేయండి.
శని దేవుడికి నీలిరంగు పువ్వులు: శని దేవుడికి నీలిరంగు పుష్పాలను సమర్పించండి. శని దేవుడిని పూజించేటప్పుడు పొరపాటున కూడా అతని విగ్రహాన్ని నేరుగా చూడకండి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం ఆచారాల ప్రకారం పూజించండి అని గ్రంధాలలో రాయబడింది.
రావి చెట్టుకు నీరు: రావి చెట్టుకు క్రమం తప్పకుండా నీటిని సమర్పించడం,దానిని పూజించడం,రావి చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా శనిదేవుడు ప్రసన్నుడవుతాడు. అలాగే శనివారం రోజున ఒక పేదవాడికి ఆహారం అందించడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. దీంతో మీ పేదరికం తొలగిపోతుంది.
రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి: శనివారం సూర్యాస్తమయం తర్వాత నిర్జన ప్రదేశంలో ఉన్న రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. మీ దగ్గర్లో రావి చెట్టు లేకపోతే ఆలయంలో కూడా దీపం వెలిగించవచ్చు. ఇది డబ్బు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
Note: మత విశ్వాసాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడిందాి. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని నమ్మడం లేదా పాటించడం వ్యక్తుల సొంత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications