Latest Updates
-
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్ -
అబ్బాయి వర్జిన్ కాదని పెళ్లి రద్దు చేసుకున్న యువతి..అసలు నువ్వు వర్జినేనా అంటూ.. -
100 ఏళ్లు బతికించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్..రోజుకి ఒక గిన్నె తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు..ఎలా చేసుకోవాలంటే.. -
హోటల్ స్టైల్ ఇడ్లీ కారం పొడి..బ్రేక్ ఫాస్ట్ లోకి చట్నీ కూడా వద్దంటారు..ఇంట్లోనే ఇలా చేసుకోండి.. -
కిడ్నీలు పాడవడానికి ముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు ఇవే -
ఇడ్లీ,దోశ,చపాతీల్లోకి కేక పుట్టించే చికెన్ నిర్వాణ..బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు -
పెద్ద ఎర్రిపప్ప అయ్యావ్ మావా: ప్రియురాలి కోసం మొత్తం అమ్మేసి 1900 కి.మీ ప్రయాణించి వెళ్తే..అసలు అమ్మాయే కాదట! -
దసరా స్పెషల్ నైవేద్యం చక్కెర పొంగలి..సంప్రదాయ పద్ధతిలో ఇలా చేస్తే ఇళ్లంతా డివోషనల్ వైబ్
Astro tips: సంక్రాంతి రోజు ఇలా చేస్తే..ఇంట్లో సంపదల వర్షం కురుస్తుంది
సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం జనవరి 14న మకర సంక్రాంతి జరుపుకుంటున్నాం. హిందూమతంలో ఈ రోజుని అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున అనేక శుభ యోగాలు కూడా ఉన్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం మకర సంక్రాంతి రోజున కొన్ని చర్యలను పాటించడం ద్వారా జీవితంలో వివిధ అంశాలలో అభివృద్ధిని పొందవచ్చు. ఇల్లు ఏడాది పొడవునా సంపద, ధాన్యాలతో నిండి ఉంటుంది. మకర సంక్రాంతి రోజున ఎలాంటి జ్యోతిష్య చర్యలు తీసుకోవాలో ఇక్కడ చూడండి.
మకర సంక్రాంతి రోజున ఇలా చేయడండి
-మకర సంక్రాంతి రోజున గంగా స్నానం చేయడం ఉత్తమంగా పరిగణించబడుతుంది. దీంతో గ్రహ దోషాలు తొలగిపోతాయి. గంగాస్నానం చేయడం కుదరని పక్షంలో ఏ నీటిలోనైనా గంగాజలం కలిపి లేదీ మీ ఇంటి దగ్గర్లోని పుణ్య నదిలో అయినా పర్లేదు స్నానం చేయవచ్చని పండితులు తెలిపారు. స్నానం చేసేటప్పుడు సూర్య భగవానుడికి నైవేద్యాలు సమర్పించండి.

-మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడికి ఎర్రటి పువ్వు, కుంకుమ లేదా ఎర్రచందనం, కొద్దిగా అన్నంతో కూడిన నీటిని రాగి పాత్రలో సమర్పించండి. దీంతో పాటు ఖచ్చితంగా సూర్య భగవానుడి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. ఈ పరిహారం చేయడం వల్ల సూర్యుడు జాతకంలో బలవంతుడు అవుతాడు.
-సంక్రాంతి రోజున ఇంటి ముఖ ద్వారం ముందు ఎలాంటి మురికిని ఉంచరాదు. ముందు రోజు ఇంటిని మురికితో శుభ్రం చేయాలి. కలవాలో 5 పసుపు ముక్కలను చుట్టి వాటిని ప్రధాన తలుపు దగ్గర కట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
-మకర సంక్రాంతి రోజున ఇంటి దేవతలకు కొత్త బట్టలు పెట్టండి. ఇలా చేయడం చాలా శ్రేయస్కరం.
-మకర సంక్రాంతి రోజున రొట్టెపై నెయ్యి రాసి కొద్దిగా బెల్లం కలిపి ఆవులకు తినిపించండి.
-సంక్రాంతి రోజున దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున మీరు దుప్పటి, బెల్లం, నువ్వులు, ఎర్రటి వస్త్రం వంటి కొన్ని వస్తువులను దానం చేస్తే మంచిదని పండితులు సూచిస్తున్నారు.
-సంక్రాంతి రోజున ఖిచ్డిని ఇంట్లో వండి మీ ఇష్ట దైవానికి సమర్పించండి. దీని తర్వాత ఆ ఖిచ్డీని తిని దానం చేయండి. ఇలా చేయడం వల్ల సంపద పెరుగుతుంది.
-మకర సంక్రాంతి రోజున తెల్ల నువ్వులను నీళ్లలో కలిపి రావి చెట్టు వేరుకు నైవేద్యంగా పెట్టాలి. ఈ పరిహారంతో పిత్ర దోషం కూడా శాంతమవుతుంది.
-ఈ రోజు పిల్లలకు గాలిపటాలను బహుమతిగా ఇవ్వండి. మకర సంక్రాంతి నాడు ఇంటి దగ్గర గాలిపటాలు ఎగురవేయడం చాలా శుభప్రదం.
-మకర సంక్రాంతి రోజున ఎవరూ ఇంటి నుండి దూరం వెళ్లకూడదు. ఇలా చేయడం శ్రేయస్కరం కాదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
