Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
Vastu: ఈ మొక్క వేరుకి డబ్బుని ఆకర్షించే శక్తి..అక్కడ ఉంచితే ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు!
ప్రతి ఒక్కరి జీవితంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. మన జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయని పండితులు చెబుతారు. ఏ పని చేపట్టినా ఫెయిల్ అవుతున్నా,ఎంత సంపాదించినా ఆ ధనం ఇంట్లో నిలవకపోవడం,ఇంట్లో సంతోషం,శాంతి లేకపోవడం వంటివి జరుగుతుంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉండి ఉండవచ్చు. ఆ సమయంలో కొన్ని వాస్తు చర్యలు చేపడితే మీరు అనుకున్నట్లుగా విషయాలు తిరిగి ట్రాక్‌లోకి వస్తాయి. ఇంట్లో సంపద, సంతోషం, శాంతికి ఎప్పటికీ కొరత ఉండదు.
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని మొక్కలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వాటిని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మంచి ధనవంతులవుతారు. అలాంటి మొక్కల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది తులసి మొక్క. సనాతన ధర్మంలో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది. తులసి మొక్క పచ్చగా ఆ కుటుంబం మీద దైవానుగ్రహం ఉంటుందని నమ్ముతారు. ప్రతికూల శక్తులు ఇంటి దరిదాపుల్లో కూడా ఉండలేవు. తులసి విష్ణువు, లక్ష్మి ఇద్దరికీ ప్రీతికరమైనది. అందుకే తులసిని హరిప్రియ అని కూడా అంటారు.

వాస్తు శాస్త్రం ప్రకారం తులసి వేరు డబ్బును ఆకర్షిస్తుంది. దీనిని ఇంట్లో సురక్షితంగా ఉంచడం ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీ ఖజానాలో తులసి వేరును ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచడం వల్ల మీ దగ్గర ఎప్పటికీ డబ్బు అయిపోదు. ఖజానా ఎల్లప్పుడూ డబ్బుతో నిండి ఉంటుంది. అదేవిధంగా జాతకంలో ఉన్న గ్రహాలు జీవితంలో ఆటంకాలు సృష్టిస్తుంటే తులసి వేర్లను ఎర్రటి గుడ్డలో కట్టి ఉంచడం మంచిదని కొందరు పండితులు సూచిస్తున్నారు. ఇక,ఇల్లు లేదా కార్యాలయం నుండి ప్రతికూల శక్తిని తొలగించడానికి తులసి మూలాన్ని ఉపయోగించి ఒక దండను తయారు చేసి దానిని గుడి లేదా ఆఫీసు టేబుల్‌పై బాగా ఉంచితే ఉపశమనం ఉంటుందని తెలిపారు.
Note: మత విశ్వాసాలు,నమ్మకాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని పాటించడం వ్యక్తులు సొంత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications