Latest Updates
-
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక
ఎలాన్ మస్క్, ముకేశ్ అంబానీల రాశులు ఏంటో తెలుసా?, ఆ రాశుల వారు కాబట్టే వారు ధనవంతులయ్యారు!
ఈ భూమి మీద ప్రతి ఒక్కరికీ ధనవంతులు అవ్వాలనే కోరిక ఉంటుంది. అందుకోసం తెగ కష్టపడుతుంటారు. అంబానీ, అదానీ, ఎలాన్ మస్క్ మాదిరిగా ధనవంతులై ప్రపంచంలోనే గొప్ప వ్యక్తులుగా మారాలని అనుకుంటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే వ్యాపారంలో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడ్డ వాడే అంబానీ, అదానీ, మస్క్ కాగలరు.
కృషి, పట్టుదల, శ్రమతో పాటు కొంత అదృష్టం కూడా తోడైతేనే అది సాధ్యమవుతుంది. అందుకు రాశి ఫలాలు కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్న ఎలాన్ మస్క్, అంబానీ, జెఫ్ బెజోస్లది ఏ రాశి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎలాన్ మస్క్
ఎలాన్ మస్క్ గురించి ఈ ప్రపంచం మొత్తం తెలుసు. టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ ఇలా అనేక కంపెనీలకు అధిపతి అయిన మస్క్.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధావంతుడు. అయితే అంతటి ధనవంతుడైన ఎలాన్ మస్క్ రాశి చక్రం కర్కాటకం. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు దూరదృష్టితో పాటు అంతర్దృష్టి కూడా ఉంటుంది. అందుకే ఎలాన్ మస్క్ జీవితంలో సంతోషంతో పాటు దుఃఖాలు కూడా ఉన్నాయి.
జెఫ్ బెజోస్
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. ఆయన ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు కూడా. ఇప్పుడు అతను టాప్ 10 జాబితాలో ఉన్నాడు. ఈయనది మకర రాశి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ అతి విశ్వాసం, సాహసోపేతమైన నిర్ణయాల కారణంగా తమ పనిలో విజయం సాధిస్తారు. దృఢ సంకల్పమే వారి బలం.
బెర్నార్డ్ ఆర్నాల్ట్
ఫ్యాషన్ వ్యాపారవేత్త అయిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ మీన రాశిలో జన్మించారు. ఈ రాశి వారికి కరుణ, తెలివితేటలు వారి ప్రధాన ఆయుధాలుగా ఉంటాయి. ఈ రాశికి చెందిన వారు వారు తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటారు.
బిల్ గేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వృశ్చిక రాశికి చెందిన వారు. ఈ రాశి వారిలో ఆర్థిక పరిస్థితులు ఎల్లప్పుడూ ఉన్నత స్థాయిలో ఉంటాయి. ఈ రాశిచక్రం యొక్క బలాలు ఒక పని పట్ల అంకితభావం, అనుకున్న లక్ష్యం పట్ల దృఢ సంకల్పం.
మార్క్ జుకర్బర్గ్
ఫేస్బుక్ ద్వారా ప్రసిద్ధి చెందిన మార్క్ జుకర్బర్గ్ ఇప్పుడు మెటా అనే పెద్ద వ్యాపారాన్ని నిర్మించాడు. జుకర్బర్గ్ వృషభ రాశిలో జన్మించాడు. అంకితభావం, సహనం వారి విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
ముఖేష్ అంబానీ
భారతదేశంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలలో ఒకరైన ముఖేష్ అంబానీకి వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈయన మేష రాశిలో జన్మించారు. పని పట్ల వారి దృఢ సంకల్పం మరియు అంకితభావం వారి అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయి. ఆగకుండా కొనసాగే వారి పని విజయానికి దారి తీస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
