Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
New Year: కొత్త సంవత్సరంలో ఇంట్లో ఈ వస్తువులు ఉంచుకోకూడదు.. ఉంటే వెంటనే పారేయండి!
నూతన సంవత్సరానికి మరి కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. కొద్దీ రోజుల్లో కొత్త సంవత్సరాన్ని స్వాగతించేందుకు ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉంది. కొత్త సంవత్సరాన్ని ఎలా ప్రారంభించాలి? సరికొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ఎలా ప్రారంభించాలని ఇప్పటికే చాలా మంది ప్రణాళికలు రచించుకున్నారు. పాత సంవత్సరంలో నెగెటివ్ ఎనర్జీని పోగొట్టి, పాజిటివ్ ఎనర్జీ పొందడానికి ఇంటిని సిద్ధం చేసుకొని ఉంటారు.
అయితే మన ఇంటిని మనం ఎలా ఉంచుకుంటే అది మనపై ఆ విధమైన ప్రభావం చూపుతుందని చాలా గ్రంధాలు చెబుతున్నాయి. ఇంట్లో నెగిటివ్ వస్తువులు ఉంటే ఇంటికి మంచిది కాదు, అలాంటివి ఉంటే వాటిని ఇంట్లో నుండి తొలగించాలి. కొత్త సంవత్సరమే కాదు మకర సంక్రాంతి కూడా వస్తోంది. అందుకే కొత్త సంవత్సరంలో ఈ వస్తువులను ఇంట్లో పెట్టుకోకండి త్వరగా చెత్తబుట్టలో వేయండి. ఆ వస్తువులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

విరిగిన వస్తువులు
విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచుకోకూడదు. విరిగిన వస్తువులు ఇంటికి మంచివి కాదు. ఇది ఇంటి లోపల ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. కాబట్టి, విరిగిన పాత్రలు, అలంకరణ వస్తువులు, ఫోటోలు మొదలైన వాటిని ఇంటి నుండి బయటకు విసిరేయండి. చెత్తబుట్టలో వేసేటప్పుడు సరిగ్గా పారవేయండి. గాజు వస్తువులు ఉంటే వాటిని వేరు చేసి పారేయండి. అలాగే చెట్టు కింద దేవుడి ఫోటో దొరికితే వాటిని ఇంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకురాకూడదు.
ఎండిపోయిన మొక్క
ఇంటి ముందు ఎండు మొక్క ఉంటే వెంటనే దానిని తొలగించండి. ఎండిన మొక్క ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ మొక్కలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఎండిన మొక్కలు ఉంటే వాటిని ఇంటి నుండి విసిరేయండి.
విరిగిన గడియారం
ఇంట్లో ఎట్టి పరిస్థితిలోనూ పగిలిన గడియారాన్ని ఉంచుకోకూడదు. ఒకవేళ గడియారం పగిలినట్లైతే వాటిని రిపేర్ చేయించుకోవడానికి ప్రయత్నించండి. రిపేర్ చేయించుకోకపోతే పని మనిషికి ఇచ్చేయండి. అదీ కుదరకపోతే ఇంటి నుంచి బయటికి పడేయండి. ఇంట్లోని గడియారం సరిగ్గా పని చేయకపోతే వాటిని పారేయడమే మంచిది.
విరిగిన ఫర్నీచర్
ఇంట్లో కొన్ని విరిగిన ఫర్నీచర్ ఉంటే, వాటిని ఇంట్లో ఉంచుకోకూడదు. వాటిని బయట పడేయాలి. పగిలిన వస్తువులు ఇంట్లో ఉంటే మంచిది కాదు. ఇంట్లో పగిలిన అద్దాలు ఉంటే వాటిని కూడా విసిరేయండి.
పాత క్యాలెండర్
చాలా మంది పాత క్యాలెండర్ విసిరేయాలని అనుకోరు. కానీ పాత క్యాలెండర్‌ను గోడపై అలానే వదిలివేయవద్దు. వాటిని కచ్చితంగా బయటికి విసిరెయ్యాలి. ఇంట్లో పాత క్యాలెండర్ ఉంచుకోవడం వల్ల నెగిటివ్ వైబ్స్ వస్తుంటాయి. పాత రోజులు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ రావాలంటే కచ్చితంగా కొత్త క్యాలెండర్ వేసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications