Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
ఇంట్లో ఈ పనులు చేయకుండా వుంటే.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది..!
ఇంట్లో కొన్ని వస్తువులను పొరపాటున కూడా పెట్టుకోవద్దు. లేదంటే తీవ్ర నష్టం జరుగుతుందని శాస్త్రం మనకు చెబుతోంది. ఆ వస్తువులు ఏంటి, ఏవస్తువులను ఇంట్లో పెట్టుకోవద్దని పండితులు మనల్ని హెచ్చరించారో ఒకసారి తెలుసుకుందాం. ఇంట్లో ముఖ్యంగా పాడైపోయిన గడియారాన్ని పెట్టుకోకూడదు. ఒక వేళ వుంటే వాటిని వెంటనే తీసివేయాలి. ఇంట్లో పడక గదిలో డబుల్ బెడ్‌లు కూడా వుండకూడదు. ఇలా వుంటే వెంటనే వాటిని కూడా తీసివేయాలి, లేదంటే భార్యా భర్తల మధ్య అనుబంధం లోపిస్తుంది.

కొంతమంది ఇళ్లల్లో వంటగదిలోనే పూజ గది వుంటుంది. ఇలా వుండకూడదని శాస్త్రం మనకు హెచ్చరిస్తుంది. అలా వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఒకవేల పూజలు చేసినా వాటికి ఎటువంటి ఫలితం వుండదని అంటున్నారు.
పెళ్లైన స్త్రీలు తమ పుట్టింటి నుంచి కొంత బెల్లాన్ని తెచ్చుకోవాలి. ఇలా బెల్లం తెచ్చుకోవడం వల్ల చేసిన అప్పులన్నీ తీరిపోతాయ్. బెల్లం మన జాతకాన్నీ, అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు అంటున్నారు. మీ చేతి నుంచి పొరపాటున కూడా ఉప్పు జారి కిందపడవద్దు. ఒకవేల అలా జరిగితే కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు వున్నాయ్. ఎందుకంటే ఉప్పు శుక్రుడికి సంబంధించినది.
చాలా మంది శాస్త్రంపై సరైన అవగాహన లేక దిష్టి తగలకూడదని ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోను తలిగిస్తారు. ఇలా రాక్షసుల ఫోటోను తగిలియ్యవద్దని పండితులు చెబుతున్నారు. ఇంటికి దిష్టి తగలకుండా వుండాలంటే ఇంటికి గుమ్మడికాయను కట్టాలలి. అలాగే ఇంటి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు. అలా బరువులు పెడితే జీవితం భారంగా మారుతుంది.

కడిగిన వంటపాత్రలను బోర్లించి పెడతారు. ఇలా పెట్టడం శాస్త్రం సరైంది కాదని అంటోంది. అలాగే వండిన రైస్ కుక్కర్లను కూడా బోర్లా పెట్టకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కవయ్యే ప్రమాదం వుంది. వంటి గది ఇంటి గుమ్మానికి వుండకూడదు. వంటగదిలో చీపుర్లు పెట్టడం, చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదు, పగిలిన గాజులు కూడా ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు.
చెప్పుల స్టాండు కూడా ఇంటి లోపల వుండకుండా చూసుకోవాలి. చెప్పుల స్టాండు ఇంట్లో వుంటే అనారోగ్య సమస్యలు వస్తాయ్, ఇంటిని దురదృష్టం వెంటాడుతుంది.
పూజగదిలో దేవుని పటాలు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా వుండకూడదు. దేవుని పటాలను గోడలకు తగిలించవద్దు. దేవుడి పాత ఫోటోలను కూడా పూజగదిలో పెట్టవద్దు.
వాస్తు ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్లను వుంచకూడదు, బకెట్ నిండా ఎప్పుడూ నీళ్లు వుండే విధంగా చూసుకోవాలి. బాత్‌రూంలో నలుపు రంగులో వున్న బకెట్ లేకుండా చూసుకోవాలి. ఇలా వుంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు వున్నాయ్. కొంతమంది బాత్రూంలో చీపుర్లను వుంచుతారు. ఇలా చీపుర్లను వుంచడం కూడా మంచిది కాదని శాస్త్రం మనకు చెబుతోంది. ఇలా వుంటే డబ్బు సమస్యలు ఎదురౌతాయ్.
ఇంటి ముందు డస్ట్ బిన్‌ను పెడతారు. డస్ట్ బిన్ పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఇంటి గడపను లక్ష్మీదేవితో పోలుస్తారు. ఇంటి గడపను కూడా కాలితో తొక్కితే చాలా సమస్యలు వస్తాయ్. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఆ ముగ్గులో పసుపు, కుంకుమలను వేస్తారు. ఇలా వేయవద్దని మన పండితులు మనకు చెబుతున్నారు.
వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టు పెంచుకోవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయ్. అన్నం తిన తరువాత చేతులను తిన్న ప్లేటులోనే కడుక్కుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రం పడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications