Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
unlucky month in 2025: కొత్త ఏడాదిలో ఏ రాశి వారికి ఏ నెల అత్యంత దరిద్రంగా ఉంటుందో తెలుసా..
మరికొన్ని రోజుల్లో కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతున్నాం. ప్రతి ఒక్కరూ కొత్త ఆశలతో,సానుకూల మార్పులతో న్యూ ఇయర్ ప్రారంభిస్తారు. అయితే కొత్త ఏడాదిలో కొన్ని రాశుల వారికి కొన్ని నెలలు సవాళ్లు,ఇబ్బందులతో నిండి ఉండవచ్చు. 2025లో ఏ రాశి వారికి ఏ నెల చాలా ఇబ్బందిగా ఉంటుంది?ఏ రాశుల వారు ఏం చేస్తే ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అనే విషయాలను ఇక్కడ చూడండి.
మేషరాశి
మేషరాశి వారికి 2025లో జూన్ నెల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పనిలో ఆటంకాలు ఎదురవుతుంటాయి. కోపాన్ని అదుపు చేసుకోలేకపోవడం వల్ల వాగ్వివాదం జరిగే పరిస్థితి. కార్యాలయంలో ఎక్కువ పనిభారం ఉంటుంది,ఇది ఒత్తిడిని పెంచుతుంది. అనవసర ఖర్చులు,ఆర్థిక సమస్యలు,సంబంధాలలో అపార్థాలు ఉంటాయి. కాబట్టి ఈ నెల ప్రశాంతంగా ఉండండి,పెద్ద నిర్ణయాలకు దూరంగా ఉండాలని పండితులు సలహా ఇస్తున్నారు.

వృషభం
వృషభ రాశి వారికి 2025 అక్టోబర్ నెల చాలా సవాళ్లను విసురుతుంది. ఆర్థిక నిర్ణయాలలో ఇబ్బంది,సబంధాలలో అపార్థాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి,ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాలలో ఆటంకాలు వస్తాయి. వృషభ రాశి వారు ఈ నెల ఓపికపట్టి ఉండాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
మిధునరాశి
ఈ రాశి వారికి సవాలుగా ఉన్న నెల జనవరి 2025. ఈ నెలలో కార్యాలయంలో ఒత్తిడి, పనితీరులో ఆటంకాలు ఎదురవుతాయి. పెరిగిన వ్యయం కారణంగా బడ్జెట్ గాడితప్పుతుంది. ఆరోగ్య సమస్యలు, సంబంధాలలో ఒత్తిడి ఉంటుంది. కాబట్టి మిధునరాశి వారు జనవరిలో బడ్జెట్ నిర్వహణపై శ్రద్ధ వహించండి, అనవసరమైన ఖర్చులను నివారించండి.
కర్కాటకం
కర్కాటక రాశి వారికి 2025లో చాలా ఇబ్బందికరమైన నెల జూన్. భావోద్వేగ అస్థిరత, ప్రతికూల ఫలితాలు, ఆర్థిక సమస్యలు, అపార్థాలతో ఈ నెల నిండి ఉంటుంది. కొత్త పనుల్లో వైఫల్యం ఉంటుంది. ఈ నెలలో స్వీయ నియంత్రణను కొనసాగించండి, కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించకుండా ఉండండి.
సింహ రాశి
ఈ రాశి వారికి 2025లో అక్టోబర్ నెల అత్యంత అన్ లక్కీగా ఉంటుంది. ఈ నెలలో ప్రణాళికలలో వైఫల్యం ఎదురవుతుంది. విశ్వాసం లేకపోవడం, ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ప్రయాణ ప్రణాళికలలో ఆటంకాలు ఎదురవుతాయి. సింహరాశి వారు ఈ నెల ఓపికగా ఉండండి, విశ్వాసాన్ని కాపాడుకోండి.
కన్య
ఈ రాశి వారికి 2025లో సవాలుగా ఉన్న నెల ఫిబ్రవరి. ఈ నెల ఆఫీసులో పనిభారం, పురోగతిలో ఆటంకం ఉంటుంది. ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. సంబంధాలలో విభేదాలు, ఆందోళనలు పెరుగుతాయి. ఈ నెల సానుకూలంగా ఆలోచించండి, ప్రతి నిర్ణయాన్ని ఆలోచనాత్మకంగా తీసుకోండి.
తుల
ఈ రాశి వారికి 2025లో బాగా ఇబ్బందిగా ఉండే నెల జూన్. ఈ నెలలో ఆర్థిక సమస్యలు, బడ్జెట్ గందరగోళం ఉంటుంది. సంబంధాలలో టెన్షన్, కోపం కారణంగా సమస్యలు పెరుగుతాయి. నిరాశ, మానసిక భంగం ఉంటుంది ఈ నెల స్వీయ నియంత్రణ పాటించండి, ఖర్చులను నియంత్రించండి.
వృశ్చికరాశి
ఈ రాశి వారికి 2025లో బాగా ఇబ్బందిగా ఉండే నెల అక్టోబర్ 2025. ఈ నెలలో కార్యాలయంలో అడ్డంకులు ఎదురవుతాయి. అధిక వ్యయం, భావోద్వేగ సమస్యలు ఉంటాయి. ప్రణాళికలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఈ నెల మీ మానసిక సమతుల్యతను కాపాడుకోండి, ప్రణాళికలను వాయిదా వేయండి.
ధనుస్సు
ఈ రాశి వారికి 2025లో బాగా ఇబ్బందిగా ఉండే నెల అక్టోబర్ 2025. ఈ నెలలో చేపట్టే పనిలో వైఫల్యం, ఆర్థిక ప్రణాళికల వైఫల్యం ఉంటుంది. సంబంధాలలో అపార్థాలు, వివాదాలు తలెత్తులాయి. ఆరోగ్యం క్షీణించడం, అలసట ఉంటుంది. ఈ నెల ఓపికగా పని చేయండి, సంబంధాలలో కమ్యూనికేషన్‌ను కొనసాగించండి.
మకరరాశి
ఈ రాశి వారికి 2025లో బాగా ఇబ్బందిగా ఉండే నెల జూలై. ఈ నెలలో కెరీర్, ఆర్థిక విషయాలలో ఇబ్బందులు ఉంటాయి. ఒత్తిడి, అలసట ఎక్కువ ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఈ నెలలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి, ఓపికగా పని చేయండి.
కుంభ రాశి
ఈ రాశి వారికి 2025లో బాగా ఇబ్బందిగా ఉండే నెల సెప్టెంబర్. ఈ నెలలో పనితీరులో ఆటంకాలు ఎదురవుతాయి. ఆకస్మికంగా పెరిగిన ఖర్చులు ఇబ్బందిపెడతాయి. సంబంధాలలో సమస్యలు, అనిశ్చితి నెలకొంటుంది. ఎన్నో చేదు సంఘటనలు ఎదుర్కొంటారు. ఈ నెలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, సహనంతో ఉండండి.
మీనం
ఈ రాశి వారికి 2025లో బాగా ఇబ్బందిగా ఉండే నెల అక్టోబర్. ఈ నెలలో డబ్బు సంబంధిత సమస్యలు ఉంటాయి. సంబంధాలలో అస్థిరత నెలకొంటుంది. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈ నెలలో ధ్యానం, యోగా చేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications