Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Black Magic: 7 ధాన్యాలతో అలా చేశారంటే..ఏ చేతబడి, క్షుద్రవిద్య ఏం చేయలేదు!
చాలా సందర్భాలలో మన ఇంట్లోని వ్యక్తులు లేదా మనకు తెలిసిన వ్యక్తులు ఏదైనా పిచ్చి పిచ్చిగా చేయడం చేస్తుంటే..అది చేతబడి అయి ఉంటదేమో అని పెద్దలు అప్పుడప్పుడు అంటుండటం మనం వినే ఉంటాం. ఎవరిమీదనైనా చేతబడి జరిగితే వారి పరిస్థితి ఎలా ఉంటదో అని అనేక తెలుగు సినిమాల్లో చూశాం. మంత్రవిద్య లేదా చేతబడి వంటి నెగిటివ్ శక్తులు ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తాయి..మన జీవితాలపై దుష్ప్రభావం చూపుతాయి. ఆధ్యాత్మక గురువులు ఈ ప్రతికూలతలను తొలగించడానికి అద్భుతమైన మార్గాన్ని సూచించారు.
అదృశ్య శక్తుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోడానికి ప్రకృతి ప్రసాదించిన ఏడు రకాల ధాన్యాలు ఒక శక్తివంతమైన సాధానంగా పనిచేస్తాయని ఆధ్యాత్మిక గురువులు తెలిపారు. ఆ ఏడు ధాన్యాలు..జొన్నలు, సజ్జలు, బియ్యం, గోధుమలు,మొక్క జొన్న మొదలైనవి ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో గ్రహ శక్తిని తమలో నింపుకున్నాయని ఆథ్యాత్మిక గురువులు తెలిపారు. మీ సమీపంలోని కిరాణా దుకాణంలో ఇవి సులభంగా లభిస్తాయని చెప్పారు.

ముందుగా 7 రకాల ధాన్యాలను తీసుకొని వాటిని తెల్లటి వస్త్రంలో వేసి ఒక మూటగా కట్టండి. తర్వాత "సప్తేశ్వరాయ నమః" అనే శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తూ ఆ ధాన్యాల మూటను మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పండి. మీలోని ప్రతికూల శక్తిని ఈ కదలిక గ్రహిస్తుందని ఆధ్యాత్మిక గురువులు తెలిపారు. తర్వాత ఈ మూటను దగ్గరలోని ఏదైనా శివాలయానికి తీసుకువెళ్లండి. నర్మదేశ్వర శివలింగం మరింత శక్తివంతమైనదిగా చెప్పబడుతుంది. సూర్యాస్తమయం లోపు శివలింగాన్ని తాకి మీపై ఉన్న ఏదైనా మంత్రవిద్య లేదా ప్రతికూల ప్రభావాలను తొలగించమని పరమేశ్వరుడిని హృదయపూర్వకంగా ప్రార్థించండి.
మరుసటి రోజు స్నానం చేయకముందే ఆ ధాన్యాలను ఏడు వేర్వేరు ప్రదేశాలలో సమర్పించండి. మీ ఇంటి పైకప్పు మీద పక్షుల కోసం కొద్దిగా ఉంచండి..బావి, డ్రెయిన్ లేదా బోర్‌వెల్ దగ్గర కొద్దిగా వేయండి..ఆవు లేదా గేదెకు కొంచెం తినిపించండి..రావి చెట్టు కింద కొద్దిగా ఉంచండి..మర్రి చెట్టు కింద కొద్దిగా ఉంచండి..కొంచెం ధాన్యాన్ని భూమిలో పాతిపెట్టండి..చివరిగా మిగిలిన ధాన్యాన్ని కాల్చి ఆ పొగను మీ చుట్టూ వ్యాపింపచేయాలని తెలిపారు.
ఇది ఎందుకు అంత ప్రత్యేకమైనది?
శివుడు.. భూతనాథుడు, మహాకాళేశ్వరుడు , కాలానికి అధిపతి. ఆయన కరుణా కటాక్షాల వల్ల ఈ పరిహారం తక్షణమే ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది, వాటి ప్రభావాన్ని ప్రకృతిలో కలిసిపోయేలా చేస్తుందని ఆథ్యాత్మిక గురువులు తెలిపారు. ఈ అద్భుతమైన ఉపాయం ప్రాచీన గ్రంథాలలో వివరించబడిందని..కాబట్టి మీ జీవితంలో ఏదైనా ప్రతికూలత మిమ్మల్ని బాధిస్తుంటే, ఈ ఏడు గింజల ఉపాయాన్ని విశ్వాసంతో ఆచరించాలని సూచించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications