Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
జాతక దోషాలున్నాయా? కుక్కతో మీ కష్టాలు మాయం..శని బాధల నుండి విముక్తి
విశ్వాసానికి ప్రతీకగా కుక్కను చూపెడుతుంటారు చాలామంది. కుక్క అంటేనే విశ్వాసం..విశ్వాసం అంటేనే కుక్కది అన్నట్లుగా మన చిన్నప్పటి నుంచి వింటుంటాం. కుక్కలాంటి నమ్మకమైన సహచరుడిని కనుగొడం కష్టమని అంటుంటారు. ఈ రోజుల్లో కష్టకాలమైనా తోడుగా ఉండే ఒక నమ్మకమైన నేస్తం దొరకడం చాలా అరుదు. కానీ కుక్క అలాంటి స్నేహానికి ప్రతిరూపం. నీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయి రోడ్ల మీద అడుక్కునే పరిస్థితి వచ్చినా కూడా కుక్క ఎల్లప్పుడూ యజమానితోనే ఉంటుంది. చికెన్ ఆశ చూపించినా లేదా ఇంకేదైనా ఫుడ్ ఆశ చూపెట్టినా ఇంకొకరి గుమ్మం తొక్కదు.
కుక్కని కేవలం పెంపుడు జంతువులుగానే కాదు, తమ ప్రాణ స్నేహితులుగా భావిస్తారు చాలామంది. కుక్క ఇంట్లో ఉంటే ఒంటరితనం మాయమవుతుంది. కుక్క ఒంటరితనాన్ని తొలగించడమే కాకుండా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని కూడా తెస్తుందని జ్యోతిష్యశాస్త్రం తెలియజేస్తుంది. సనాతన ధర్మంలో కుక్కని భైరవుని వాహనంగా పరిగణిస్తారు.

జ్యోతిష్యంలో కుక్కకు ఉన్న ప్రాముఖ్యత ఇదే
జ్యోతిషశాస్త్రంలో కుక్క.. రాహువు, కేతువు గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. మీ జాతకంలో రాహు లేదా కేతు దోషాలు ఉంటే ఒక కుక్కను పెంచుకోవడం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆ గ్రహాల చెడు ప్రభావాలను తగ్గించడమే కాకుండా మీ జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును నింపుతుందని చెబుతున్నారు.
ఈ రంగు కుక్కను పెంచుకోవడం బెటర్
నల్ల కుక్కను పెంచుకుంటే ఇంట్లో శాంతి, సంతోషం వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా దుష్ట శక్తులను,నెగటివ్ ఎనర్జీని,అంతేకాకుండా చేతబడి లాంటి వాటి ప్రభావాన్ని కూడా దూరం చేస్తుందట. నల్ల కుక్కకు పాలు పట్టడం వల్ల ఇంట్లో ఒక మంచి బ్యాలెన్స్ వాతావరణం ఏర్పడుతుందట.
వీధి కుక్కలకు సేవ చేస్తే అంతా మంచే జరుగుతుందా?
ఒకవేళ మీరు ఇంట్లో కుక్కను పెంచుకోలేకపోతే వీధి కుక్కలకు పాలు, బ్రెడ్ లేదా బిస్కెట్లు తినిపించడం కూడా అంతే పుణ్యప్రదం అవుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆదివారం, మంగళవారం రోజుల్లో కుక్కకు పాలు పోస్తే రాహు కేతువులే కాకుండా శని దేవుడు కూడా సంతోషిస్తాడట. అంతేకాదు ఇది పితృ దోషాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కుక్కకు రొట్టె తినిపిస్తే జీవితంలోని ఎన్నో సమస్యలు మాయమవుతాయని మన పెద్దలు ఎప్పుడో చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తుచేసుకోవాలి.
శని బాధల నుండి విముక్తి
మీ జాతకంలో శని సడేసాతి లేదా ధైయ ప్రభావం ఉండి అది మీకు కష్టాలు కలిగిస్తుంటే ఒక కుక్కకు సేవ చేయడం మీకు చాలా మంచిది. ఇది ఆ గ్రహాం చెడు ప్రభావాలను తగ్గించడమే కాకుండా మీ మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుందని పండితులు తెలిపారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications