Latest Updates
-
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.? -
రాజస్థాన్ ఫేమస్ లాల్ మాస్..మటన్ కూర ఇలా వండితే గిన్నెలో ఒక్క ముక్క కూడా మిగలదు! -
ఈ ఫ్రూట్‌తో పురుషుల్లో ఎనర్జీ రెట్టింపు.. శిలాజిత్ కంటే మోస్ట్ పవర్ఫుల్.! -
లక్ష్మీదేవి సముద్రం నుండి ఎందుకు పుట్టింది? దాచిన పురాణ కథ -
జూన్ 6 గ్రహ సంచారం: కుంభరాశిలో చంద్రుడి ప్రయాణం.. ఈ రాశుల వారికి అదృష్టం, సంపద వెల్లువ! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 06 జూన్ 2026 -
మన ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? ఈ 7 వాస్తు & ఆధ్యాత్మిక మార్గాలు సకారాత్మక శక్తిని పెంచుతాయట! -
పనీర్, కాలీఫ్లవర్‌తో ఇలా కుర్మా చేశారంటే.. నాన్‌వెజ్ కూడా దిగదుడుపే.! -
ప్రతి మహిళ ఏడాదికోసారి ఖచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్షలు ఇవే.. లేదంటే.? -
ప్రేమిస్తున్నారు కానీ పోతారేమోనని భయం ఆ భయమే బంధాన్ని ఎలా పాడుచేస్తోందో తెలుసా?
Father's Day 2024: నాన్న అంటే ఇలా ఉండాలని అనిపించుకునే రాశులవారు వీళ్లు
మహిళలకు మాతృత్వం ఎంత గొప్పదో, అలాగే పురుషులకు పితృత్వం అనేది ప్రతి మనిషికి భిన్నంగా ఉండే ప్రత్యేకమైన అనుభూతి. పిల్లలను పోషించడంలో తల్లిది ప్రాథమిక పాత్ర అయినా, పిల్లల పెంపకంలో తండ్రి కూడా ముఖ్యపాత్ర పోషిస్తాడు. పిల్లల జీవితంలో తండ్రి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. తల్లి ఇంటి బాధ్యతలతో పాటు పిల్లల పోషకరాలైతే తండ్రి మాత్రం పిల్లలకు దిశ మార్గ నిర్ధేషి. ఎందుకంటే పిల్లల మానసిక, శారీరక వికాసానికి తండ్రి కూడా అంతే పాత్ర పోషిస్తాడు . పిల్లల ఎదుగుదలలో వారి ఆరోగ్యం , భావోద్వేగ విషయంలో తండ్రి పాత్ర చాలా విలువైనది.
ప్రతి తండ్రి వారి పిల్లల విషయం అన్ని విధాలుగా మంచి సంరక్షకుడుగా వ్యవహరించాలి. అందుకు పిల్లలతో మంచి కమ్యూనికేషన్, ప్రొటక్షన్ మరియు మార్గదర్శకత్వం వంటి లక్షణాలు ప్రతి తండ్రి కలిగి ఉండాలి. ఇటువంటి లక్షణాలు చాలా వరకు పురుషులు స్వీకరించవచ్చు లేదా ఆచరించవచ్చు. అయితే మంచి తండ్రి అని సహజంగానే వస్తుంది. కానీ కొంత మంది అందుకు అలవాటు పడాలి. రేపు ఫాదర్స్ డే సందర్భంగా ఈ రాశులలో జన్మించిన వారు ఉత్తమ తండ్రులుగా ఉంటారు. మరి ఆ రాశులకు సంబంధించిన వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

మేషరాశి
ఈ విషయంలో మొదటి బెస్ట్ ఫాదర్ గా మేషరాశి సంబందించిన పురుషులకు దక్కుతుంది. వీరి సహజ నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు . వీరు గొప్ప నాయకులను సిద్దం చేస్తారు. వీరు పిల్లల పట్ల నిజాయితీ నిబద్దత కలిగి ఉంటారు. ఇంకా వారి మీద ప్రేమ అధికంగా ఉంటుంది. రక్షణ వంటి లక్షణాలను కలిగి ఉంటారు. భవిష్యత్తులో పిల్లలకు మంచి తండ్రిగా ఉదాహరణగా నిలుస్తారు.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి తండ్రులు సానుభూతిపరులు, వారి పిల్లల మనోభావాలను అర్థం చేసుకుంటారు. వారికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తారు. కుంటుంబానికి ప్రాధాన్యత నిస్తూ పిల్లలను మానసింకగా అర్థం చేసుకుంటారు . తమ బిడ్డ పెరగడానికి సహాయపడే పోషణ మరియు ప్రేమవాతావరణాన్ని సృష్టిస్తారు. వారి విషయంలో ప్రతి విజయంలో తోడుగా ఉంటూ, ప్రతి సవాళ్ళను కలిసి ఎదుర్కొంటారు.
సింహ రాశి
సింహరాశి వారికి సూర్యుడు అధిపతి. సూర్యుని వలే మనస్సు ప్రకాశిస్తుంటుంది. పిల్లల పట్ల ప్రేమ , దాతృత్వం, మంచి అవగాహన, నడవడిక వంటి లక్షణాలను కలిగి ఉండి , వారి పిల్లలకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. వీరు పిల్లల పట్ల మాత్రమే కాదు కుటుంబంలో అందరిపట్ల అంకితభావంతో ఉంటారు. మంచి ప్రేమను పంచుతుంది.పిల్లలకు మెంటారుగా ఉంటారు
కన్య
కన్యారాశికి సంబంధించిన పురుషులు మంచి తెలివైన, చురుకైన వారు . ఏ సమస్య అయినా ఇట్టే పరిష్కరిస్తారు. వీరు మంచి ఆలోచనా విధానం కలిగి ఉండి ఎలాంటి సమస్య అయినా పరిష్కార నైపుణ్యాలు కలిగి ఉండటం వల్ల ఉత్తమ తండ్రులలో ఒకరుగా చేస్తాయి. వీరు అక్షరాస్యులై పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థితికి చేర్చుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి సంబంధించిన పురుషులు పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు. ప్రేమతో పాటు రక్షణ మరియు పిల్లల పట్ల శ్రద్ద కలిగి ఉంటారు . పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు. వారికున్న అభిరుచి వల్ల వారి పిల్లలు పట్ల సంబంధం మరింత మెరుగుపడుతుంది.
మకరరాశి
ఈ రాశికి సంబంధించిన వారు బాధ్యతాలను చక్కగా నిర్వర్తిస్తారు. అందులో భాగంగానే తమ పిల్లల కోసం ఎక్కువ సమయం గడుపుతారు. ఈ రాశికి చెందిన పురుషులు పిల్లల పెంపకంలో శ్రద్ద చూపుతారు. తమ పిల్లలను విజయం కోసం ప్రయత్నించమని ప్రోత్సహిస్తారు. ఈ రాశికి చెందిన పురుషులు మంచి తండ్రులుగా పేరుతెచ్చుకుంటారు.వారు తమ కుటుంబానికి స్థిరత్వం మరియు భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. తెలుగు బోల్డ్ స్కై కథనానికి సంబంధించిన ఏ ఇన్‌పుట్ లేదా సమాచారాన్ని ధృవీకరించదు. ఏదైనా సమాచారం మరియు అంచనాలను అమలు చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు దయచేసి సంబంధిత నిపుణుల సలహాను పొందండి
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications