Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
February Horoscope 2023: ఫిబ్రవరి నెలలో చాలా రాశుల వారికి అదృష్టం..ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూడండి...
20223 ఫిబ్రవరి నెలలో రాశి ఫలాలను చూడటం ద్వారా మీ భవిష్యత్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి..!
జ్యోతిష్యం పరంగా ఫిబ్రవరి 2023 చాలా ముఖ్యమైన నెలగా పరిగణించబడుతుంది. 2023 ఫిబ్రవరి రెండో నెలలో ఎంటర్ అవ్వడానికి మరొక రోజే ఉంది. జనవరి నెలలో కొన్ని గ్రహాల స్థానాల్లో మార్పులు, చాలా రాశులకు శుభ, అశుభ ఫలితాలను ఇచ్చాయి. మకర సంక్రాతి రోజున శుక్రుడు ధనుస్సు నుండి మకరరాశిలోకి సంచారం చేశాడు, జనవరి 17న శని దేవుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఫిబ్రవరి నెలలో కూడా గ్రహాలలో మార్పు ఉంటుంది. ఎందుకంటే కుంభరాశిలోకి శని సంక్రమించినప్పుడు అక్కడ శుక్ర, శని సంయోగం జరుగుతుంది. ఈ నెల మధ్యలో సూర్యుడు కూడా కుంభరాశిలోకి వెళ్లనున్నాడు. బుధుడు కూడా కుంభ రాశిలో చేరబోతున్నాడు. ఈ విధంగా కుంభ రాశిలో అనేక గ్రహాలు సంయోగంగా ఏర్పడతాయి.

ఇలా రాశులలో గ్రహాల మార్పు చోటు చేసుకోవడం వల్ల ద్వాదశ రాశులన్నింటి మీద వాటి ప్రభావం ఉంటుంది. జోతిష్యశాస్త్రం లెక్కల ప్రకారం ఫిబ్రవరి నెల చాలా రాశులకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. కొన్ని రాశుల వారికి మాత్రం లక్ష్మీ కటాక్షం మెండుగా ఉంటుంది. ఆమె నుండి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందుతారు. మరి ఫిబ్రవరి నెలలో గ్రహాల ప్రభావంతో మొత్తం ద్వాదశ రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ చూద్దాం..

మేష రాశి
మేషరాశి ఫిబ్రవరిలో గ్రహ సంచారాల వల్ల లాభిస్తుంది. మీకు గతంలో రావల్సిన డబ్బు మీకు అందకపోతే, దానిని తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ పెట్టుబడులపై మంచి రాబడిని పొందవచ్చు.
తల్లిదండ్రుల నుండి సహాయం పొందుతారు. ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాలు మంచి సమయం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైన కాలం. మీరు మీ స్నేహితుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. టూరిజం, స్మాల్ ట్రిప్ ఇలా ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఒత్తిడికి దూరంగా ఉండండి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఇది గొప్ప మాసం. మీరు ఈనెలలో పని మరియు వృత్తిని మెరుగుపరచడానికి మీరు మంచి సలహాలు మరియు కొత్త పద్ధతులను ఉపయోగిస్తారు. అలాగే ఈ నెలలో మీకు కార్యాలయాల్లో ఉన్నతాధికారులు, సహోద్యోగుల సహకారం పూర్తిగా లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఇది మీ జీవితాన్ని మెరుగుపరిచే నెల అవుతుంది.
జీర్ణవ్యవస్థ మరియు కడుపుకు సంబంధించిన సమస్యలు నెల ప్రారంభంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి, రిలాక్స్‌గా ఉండండి మరియు ప్రశాంతంగా ఉండటం మీ ఆరోగ్యానికి మంచిది. మీరు ఏ పని చేపట్టిన అందుకు మీ కుటుంబం మద్దతు పూర్తిగా ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. అనవసర చర్చలకు దూరంగా ఉండండి.

మిథున రాశి
మిథునరాశి వారికి ఫిబ్రవరి నెల కొంచెం ఒడిదుడుకులు ఎక్కువగా ఉండే నెల అవుతుంది. మీరు చేసే పనులు ఫలితాలు నెమ్మదిగా ఉంటాయి. మీరు మీ పెట్టుబడుల నుండి మంచి రాబడిని పొందుతారు. నెల ప్రారంభం నుండి మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎనర్జిటిక్ గా ఫీల్ అవుతారు. సంతోషంగా గడుపుతారు.
నెలాఖరులో, కొన్ని పని సంబంధిత ఒత్తిడి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఓపికపట్టండి. మీరు తొందరి పడి ఎలాంటి ప్రసంగాలు ఇవ్వకండి, మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మరియు స్పష్టంగా ఉండటం మంచిది. మీకున్న అనవసరమైన కోపాన్ని తగ్గించుకోండి మరియు ఏమి చెప్పాలో జాగ్రత్తగా మరియు ప్రశాంతంగా మాట్లాడండి. దీంతో కుటుంబంలో సాన్నిహిత్యం పెరుగుతుంది.

కర్కాటక రాశి
ఫిబ్రవరినెలలో గ్రహాల మార్పు వల్ల కర్కాటక రాశి వారికి ఈ నెల ఆహ్లాదకరమైన ఫలితాలను ఇస్తుంది. మీకు పూర్వీకులకు సంబంధించిన లేదా కుటుంబ ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు మీకు వ్యాపారంలో ప్రభావం చూపునున్నాడు మరియు మంచి లాభాన్ని ఇస్తుంది.
కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మీరు మీ ప్రేమ జీవితంలో సమస్యల నుండి బయటపడతారు. వైవాహిక జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. సూర్యుడి వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు వారికి అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది.

సింహ రాశి
ఫిబ్రవరి నెలలో సింహారాశి వారికి కెరీర్ మరియు ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. మీ సానుకూల మానసిక స్థితి కారణంగా, మీరు పని మరియు వృత్తిలో చాలా సాధించగలరు. సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. మీరు మీ లక్ష్యాలను సాధించే అవకాశం ఉంది. మీ కెరీర్ మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీరు వ్యాపారంలో అనుకూల ఫలితాలను పొందుతారు.
ఆరోగ్యం పరంగా 2023 ఫిబ్రవరి ప్రథమార్థంలో కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చిన్నపాటి జలుబు మరియు దగ్గుల వల్ల మీ శారీరక స్థితిలో మార్పు రావచ్చు . కుటుంబంలో మీ భాగస్వామితో విభేదాలు మరియు అపార్థాలు తొలగిపోతాయి. దాంతో సంతోకరమైన జీవితాన్ని గడుపుతారు. మీ బంధువులతో డబ్బుకు సంబంధించి కొన్ని వివాదాలు ఉండవచ్చు. సంబంధాల పట్ల శ్రద్ధ అవసరం.

కన్యా రాశి
ఫిబ్రవరి నెల కన్యా రాశికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నయువతకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారు. తోబుట్టువులతో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు డబ్బు ఆదా చేసుకోవచ్చు. అలాగే కొత్త ఉద్యోగావకాశాలు మరియు ప్రమోషన్లు కూడా లభిస్తాయి. ఆత్మీయుల సహకారంతో ఆటంకాలు ఏర్పడిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు కూడా లాభసాటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా కొత్తదనం మీరు అనుసరిస్తే అది మీకు అనుకూలంగా ఉంటుంది.

తులా రాశి
ఫిబ్రవరి నెలలో తులారాశి వారికి కెరీర్ మరియు ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. మీ కెరీర్ మరియు వ్యాపారంలో కొన్ని నిర్దిష్ట మార్పులు ఉంటాయి. ఈనెలలో మీరు వ్యాపారపరమైన ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కార్యాలయంలో ఎలాంటి వివాదాలకు దూరంగా ఉండటం ముఖ్యం. మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగులతో బహిరంగంగా మరియు నిజాయితీగా ఉండండి.
ఆరోగ్యం పరంగా ఈ నెలలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు మరియు నిద్ర సమస్యలు సంభవించవచ్చు. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువ విశ్రాంతి తీసుకోండి. శారీరం సహకరించనప్పుడు పని చేయవద్దు.
ఇక కుటుంబం విషయంలో మీరు కోపం మరియు భావోద్వేగాలకు దూరంగా ఉండండి. దాంతో మీ కుటుంబంలో సంబంధాలను బలంగా ఉంచుకుంటారు. ప్రేమకు శ్రద్ధ అవసరం. జీవిత భాగస్వామితో విభేదాలకు దూరంగా ఉండండి. అది మీకు ప్రశాంతతను ఇస్తుంది.

వృశ్చిక రాశి
ఫిబ్రవరినెల వృశ్చికరాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో, మీరు చాలా లాభదాయకమైన అవకాశాలను పొందుతారు మరియు పిల్లల పురోగతితో సంతోషంగా ఉంటారు. మీరు మీ పనిలో మీ భార్య నుండి మద్దతు పొందుతారు. దాంతో మీ మధ్య సంబంధం మరింత బలంగా ఉంటుంది.
ఈ నెలలో మీరు మీ కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. అలాగే మీరు చేసే కొన్ని మంచి పనుల వల్ల సమాజంలో ప్రశంసలు మరియు గౌరవం పొందుతారు. గ్రహాల ప్రభావం వల్ల ఈ కాలంలో మీ వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. ఆర్థిక పరంగా ధన లాభం అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు రాశి
ఫిబ్రవరి నెల ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో ఓపిగ్గా ఉండటం వల్ల. మీరు చాలా కాలంగా చేయాలనుకున్న కార్యం నెరవేరుతుంది మరియు ప్రభుత్వ అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఫిబ్రవరి నెలలో గ్రహాల ప్రభావంతో మీరు శక్తివంతులుగా మారుతారు. మరియు మీ నిర్ణయాత్మక నైపుణ్యాలతో పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. ఈ కాలంలో విదేశాల్లో వ్యాపారం చేసే వారికి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం కూడా బాగుంటుంది.

మకర రాశి
ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి కెరీర్ పరంగా మరియు ఆర్థిక స్థితి బాగుంటుంది. అయితే ఈ నెలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది . కృషికి తగిన ఫలితం మీకు లభిస్తుంది. ఆర్థికంగా మంచి నెల అని చెప్పలేం. కానీ అనవసరమైన ఖర్చులు మరియు అదనపు ఖర్చులను నివారించడానికి ప్రయత్నించండి. డబ్బు విషయాల్లో శ్రద్ధ చాలా అవసరం.
ఆరోగ్య పరంగా ఈ నెలలో మీకు మంచి ఆరోగ్యానికి సరైన విశ్రాంతి అవసరం. సమయానికి భోజనం చేయండి. వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. కుటుంభ జీవితంలో సంబంధాలు బలంగా ఉంటాయి. మీ బంధువుల పట్ల దయ చూపండి. కుటుంబ బాధ్యతలు మీకు చాలా ఒత్తిడిని కలిగిస్తాయి. ప్రేమకు మంచి నెల కాదు.

కుంభ రాశి
ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి కెరీర్ పరంగా మరియు ఆర్థిక స్థితి బాగుంటుంది. ఈ నెల ఖచ్చితంగా కుంభ రాశి వారికి కొన్ని పాఠాలు నేర్పుతుంది. మీ కెరీర్, వ్యాపారంలో కొత్త ప్రాజెక్ట్‌లకు భిన్నమైన విధానాన్ని అనుసరించండి. పరిస్థితిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నడుచుకోండి. అక్టోబర్ వరకు డబ్బు విషయాలలో మరియు పెట్టుబడులలో రిస్క్ తీసుకోకండి.
ఆరోగ్యం పరంగా ఈ ఫిబ్రవరి మాసం ప్రారంభంలో ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ, నెల ద్వితీయార్థంలో మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వ్యాయామం చేయండి. కుంటుంభ పరంగా ఈ నెల మొదటి సగం ప్రేమకు అనుకూలంగా ఉంటుంది. 13వ తేదీ తరువాత, శని సూర్యునితో కుంభరాశిలో చేరడం వల్ల కుటుంబంలో మీ ప్రేమ మరియు జీవిత భాగస్వామితో అహం మరియు అభిప్రాయ విభేదాలు ఉండవచ్చు. సహనం మరియు అవగాహన అవసరం.

మీన రాశి
ఫిబ్రవరి నెలలో మీనరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన మాసం. కార్యాలయంలో వాదనలకు దూరంగా ఉండండి. ఉన్నతాధికారులతో విభేదాలు వద్దు. సహోద్యోగుల నుండి మద్దతు లభించకపోవచ్చు. సానుకూల మానసిక స్థితితో వ్యవహరించండి. మీ ఆర్థిక పరిస్థితిపై శ్రద్ధ వహించండి. అతిగా ఖర్చు పెట్టడం మానుకోండి. ఆర్థిక వ్యవహారాల్లో నష్టపోయే అవకాశం ఉంది.
ఆరోగ్యం పరంగా ఈనెలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. నిద్రలేమితో బాధపడవచ్చు. విశ్రాంతి మరియు వ్యాయామం తప్పనిసరి.
అలాగే కుటుంబ జీవితంలో మీ మాటతీరులో శ్రద్ద అవసరం. ప్రశాంతంగా మరియు దయతో మాట్లాడండి. కుటుంబం మరియు స్నేహితులను గౌరవంగా చూసుకోండి. ప్రగల్భాలు మరియు అహంకారం మానుకోండి.



Click it and Unblock the Notifications











