Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మే నెలలో కీలకమైన గ్రహాల మార్పులు.. ఈ 6 రాశుల వారికి తమ దశ తిరిగినట్లే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి మే నెల ఒక గొప్ప మైలురాయిగా నిలవబోతుంది. ఎందుకంటే ఈ నెలలో చాలా గ్రహాల స్థానాల్లో మార్పులు జరగబోతున్నాయి. దీనివల్ల కొన్ని రాశుల జీవితాల్లో విశేషమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా రాశి చక్రంలోని ఆరు రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టానికి సంబంధించిన గుర్రం ఎక్కే అవకాశం ఉంటుంది. ఈ రాశుల వారు ఏం పట్టినా బంగారం కాబోతుంది. బంగారం ధర ఎలా పెరుగుకుంటూ పోతుందో.. వీరి అదృష్టం కూడా అలానే మారబోతుంది. రాహు-కేతు మార్పులు, బుధుడు, గురుడు, రవి వంటి ప్రధాన గ్రహాల గతి మార్పులతో కొన్ని రాశులకు కొత్త అవకాశాలు, అభివృద్ధి, ఆర్థిక లాభాలు, కుటుంబ శుభ వార్తలు లభించనున్నాయి. ఇంతకీ ఏఏ రాశుల వారికి మే నెల నుంచి అదృష్టం పట్టుకోబోతుంది? ఏ రాశుల వారికి గొప్పఅవకాశాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో చూసుకుందాం
మే నెలలో గ్రహాల సంచారాల్లో మార్పులు
మే 7: బుధుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు
మే 16: రవి వృషభ రాశిలోకి మారతాడు
మే 18: రాహువు కుంభ రాశిలోకి, కేతువు సింహ రాశిలోకి ప్రవేశిస్తారు
మే 25: గురుడు మిథున రాశిలోకి అడుగుపెడతాడు
ఈ మార్పుల ప్రభావం ప్రధానంగా వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభం రాశులపై ప్రభావం చూపనుంది. ఇప్పుడు వాటి ప్రత్యేక విశేషాలు చూద్దాం:

వృషభం:
ఈ రాశివారికి మే నెల అత్యంత శుభదాయకంగా మారబోతోంది. ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. రాశిపతి శుక్రుడు ఉన్నత స్థానంలో ఉండటం వల్ల లక్ష్మీయోగం, కుబేరయోగం లభించవచ్చు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారాల్లో ప్రగతి, నిరుద్యోగులకు ఆశించిన అవకాశం, పెళ్లి సంబంధాలు, సంతాన యోగం కలిగే అవకాశం ఉంటుంది.
మిథునం:
బుధుడి లాభస్థాన ప్రవేశం, శుక్రుడి ఉచ్ఛ స్థానం.. ఈ రెండూ కలిసికట్టిగా ఈ రాశివారికి విజయ మార్గాన్ని చూపిస్తాయి. దీని కారణంగా ఈ రాశి వారికి ఆదాయ వృద్ధి ఉంటుంది. స్టాక్ మార్కెట్ లాభాలు కలుగుతాయి. ఉద్యోగ పదోన్నతులు, విదేశీ ఉద్యోగ అవకాశాలు, సంపన్న కుటుంబాల్లో పెళ్లి సంబంధాలు కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
సింహం:
ఈ రాశికి అధిపతి అయిన రవి దశమ స్థానంలో ప్రవేశించటం వల్ల ప్రభుత్వ రంగాల్లో పనిచేసేవారికి మరింత ప్రాధాన్యత లభిస్తుంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఉద్యోగంలో గుర్తింపు, హోదా పెరుగుదల, ప్రముఖులతో సంబంధాలు, ఆస్తి సంపాదన అవకాశాలు, విదేశీ ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి.
తుల:
ఈ నెల తుల రాశివారికి ఆర్థిక యోగాలు, అధికారం సూచించే శుభ ఫలితాలను అందించనుంది. వీటితో పాటు ఈ రాశి వారికి వ్యాపార లాభాలు, ప్రేమ సంబంధాలు, పెళ్లి నిశ్చయాలు, సంతానవార్తలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
ధనుస్సు:
గురుడు తన స్వరాశి అయిన ధనస్సులో రాశిలో ఉండటం, రాహువు సహకారం వలన ఈ రాశి వారికి ఉన్న దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఈ రాశి వారిపై శని ప్రభావం తగ్గిపోవడం, ఆర్థిక అభివృద్ధి, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం, పదోన్నతులు, విదేశీ ఆఫర్లు, మంచి వివాహ యోగాలు వంటి లాభదాయకమైన సూచనలు కనిపిస్తున్నాయి.
కుంభం:
ఈ రాశివారికి మే నెలలో అనేక అనుకోని లాభాలు తలుపుతడతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఉద్యోగంలో ప్రమోషన్, కుటుంబ శుభకార్యాలు, సంతాన యోగం వంటి శుభ సూచనలు దాపురిస్తున్నాయి.
ప్రత్యేక సూచన:
ఈ ఫలితాలు సాధారణ జ్యోతిష శాస్త్రం ఆధారంగా ఇవ్వబడినది. మరింత ఖచ్చితమైన వివరాల కోసం వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. గ్రహ మార్పుల ప్రభావం వ్యక్తిగత గ్రహస్థితుల ఆధారంగా మారవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications